అక్కన్న మాదన్న మహాకాళి గుడి


అక్కన్న మాదన్న మహాకాళి గుడి
అక్కన్న మాదన్న మహాకాళి గుడి is located in Telangana
అక్కన్న మాదన్న మహాకాళి గుడి

అక్కన్న మాదన్న మహాకాళి గుడి
తెలంగాణ లో ప్రాంతం
భౌగోళికాంశాలు:17°22′31″N 78°28′28″E / 17.37528°N 78.47444°E / 17.37528; 78.47444
పేరు
స్థానిక పేరు:అక్కన్న మాదన్న మహాకాళి గుడి
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:తెలంగాణ
ప్రదేశం:షాలిబండ వద్ద, హైదారాబాదు
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:మహాకాళి
ప్రధాన పండుగలు:బోనాలు
చరిత్ర
కట్టిన తేదీ:
(ప్రస్తుత నిర్మాణం)
17 వశతాబ్దం
నిర్మాత:మాదన్న , అక్కన్న
వెబ్‌సైటు:akkannamadannatemple.com
శాలిబండ మహంకాళి అమ్మవారు

అక్కన్న మాదన్న మహాకాళి గుడి భారతదేశములోని తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదునందు గల హిందూ దేవాలయం.[1] ఈ దేవాలయం జంటనగరాలైన హైదరాబాదు, సికింద్రాబాదులలో జరిపే ప్రసిద్ధ పందగ బోనాలుకు ప్రసిద్ధి చెందినది.[2] ఈ దేవాలయం బోనాలు పండగలలో ఘటాల ఊరేగింపుకు ప్రసిద్ధి చెందినది.

చరిత్ర

[మార్చు]

17 వ శతాబ్దంలో హైదరాబాదు తానీషా పరిపాలనలో ఉండేది. ఆయన గోల్కొండ కోటకు చక్రవర్తిగా ఉండేవారు. ఆయన రాజ్యంలో అనేక మంది మంత్రులు ఉండేవారు. వారిలో ముఖులు అక్కన్న, మాదన్నలు. వారిలో ఒకరు సైనికాధికారిగానూ మరొకరు ప్రధాన మంత్రిగానూ ఉండేవారు. ఈ సోదరులు రాజాస్థానంలో ముఖ్యమైన మంత్రులుగా ఉండేవారు. వారు ఈ దేవాలయం ప్రాంతంలో నివసించేవారు. వీరు మహాకాళీ యొక్క భక్తులు. వారు ప్రతిరోజు ఈ దేవాలయంలో పూజలు నిర్వహిస్తూ ఉండేవారు. వారు పూజలు చేసిన తర్వాతనే రాజాస్థానానికి (గోల్కొండ) కు హాజరయ్యేవారు. వారు హతులైన తర్వాత ఈ దేవాలయం మూయబడింది.

67 సంవత్సరాల తర్వాత ఈ దేవాలయం షాలిబండ వద్ద పునః ప్రారంభించబడింది. ఈ దేవాలయం ప్రారంభించిన తర్వాత అతి కొద్దిమంది పాత నగరం ప్రజలు వెళ్ళేవారు. ప్రస్తుతం ఈ దేవాలయం అతి ప్రసిద్ధి చెందిన మహాకాళీ ఆలయంగా కొనియాడబడుతుంది.

1998 దాడులు

[మార్చు]

1998 లో సంఘ వ్యతిరేక శక్తుల మూలంగా ఈ దేవాలయం పై దాడులు చేయబడ్డాయి. దీని మూలంగా విగ్రహం, దేవాలయం నాశనం జరిగింది.[3]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "The Hindu : Telangana / Hyderabad News : Bonalu spirit envelops old city". Archived from the original on 2006-09-23. Retrieved 2014-10-03.
  2. "The Hindu : `Bonalu' festival concludes". Archived from the original on 2012-11-05. Retrieved 2014-10-03.
  3. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2016-02-04. Retrieved 2014-10-03.

ఇతర లింకులు

[మార్చు]