అడవిబాదం నూనె

చెట్టు
పువ్వు
పండు/మరొటి) కేరళ)

అడవిబాదం నూనెగింజలనుండి శాక నూనెను ఉత్పత్తిచేయవచ్చును.అయితే ఇది ఆహారయోగ్యమైన నూనె కాదు. ఈనూనెను ముఖ్యంగా కుష్టు\కుష్ఠు వ్యాధి,, క్షయవ్యాధుల నివారణ ఔషధాలలో ఉపయోగిస్తారు. ఈ చెట్టును ఇంకానిరడి/ది , చౌల్ మోగ్రా (హిందీలీ, గరుడఫల్ అనికూడా పిలుస్తారు.ఈ చెట్టుమల్పిగియలెస్ (Malpighiales) క్రమానికి, అకారియేసి (achariaceae) లేదా ఫ్లాకర్టియెసి ( Flacourtiaceae ) కుటుంబానికి చెందిన మొక్క, ప్రజాతి హిడ్నొకార్పస్ (hydnocarpus) కు చెందినమొక్క.ఇందులో సమానమైన ప్రవృత్తి గల మూడు రకాల మొక్కలున్నాయి.1.Hydnocarpus kurzii, 2. Hydnocarpus pentandrus, 3. Hydnocarpus laurifolia.ఈ చెట్టు ఆవిర్భ స్థలం ఆసియా ఉష్ణమండల ప్రాంతం, [1] తూర్పు ఇండియా ఉపఖండ ప్రాంతం.[2] తూర్పు ఇండియా అనగా భారతదేశంలోని పశ్చిమబెంగాల్ (వంగదేశం, బీహారు, జార్ఖండ్,, ఒరిస్సాలు చేరియున్న ప్రాంతం .ఇది బ్రిటిషుపాలకులు కలకత్తాను రాజధాని చేసుకున్న రాజ్యప్రాంతం.

భారతదేశ భాష లలో ఈ చెట్టు సాధారణపేరు[3][4]

[మార్చు]
  • హిందీ=:కాల్ మొగరా ( कालमोगरा Calmogara, Chalmogra, Chaulmoogra, (Jangli badam )
  • కన్నడ= చాల్ మొగ్రా ( Chalmogra), ఎణ్ణే మర (yenne mara), Mirolhakai, Surti, Suranti, Toratti, ఆడవి బాదామి •
  • మళయాళం=కొడి (Kodi, మరవట్టి ( Maravatty), Marotti, Nirvatta, Nirvetti
  • మరాఠి=కాడు కావాత్ (Kadu Kawath)
  • సంస్కృతం= తువరక ( Tuvaraka), Turveraka, Tuvrak, (कुष्टवैरी Kushtavairi)
  • తమిళం=మరవెట్టి (Maravetti), Maravattai, Marotti
  • తెలుగు=నిరడి-విత్తులు ( Niradi-vittulu)

ప్రపంచంలో ఇతరదేశాలలో ఈ చెట్టు వ్యాప్తి

[మార్చు]

ఈచెట్లు ప్రపంచంలో భారదేశంలో కాకుండగా ఇంకా ఆగ్నేయ ఆసియా దేశాలలో, ముఖ్యంగా మలేసియాసముద్ర ప్రాంతంలో బాగా విస్తరణ చెందివున్నాయి. అటు పిమ్మట శ్రీలంక, నిగెరియ,, ఉగాండాదేశాలలో కూడా బాగానే సాగుచేస్తున్నారు.[3]

భారత దేశంలో ఈ వృక్షాలు విస్తరించి వున్న రాష్ట్రాలు

[మార్చు]

భారతదేశంలోనిపశ్చిమకనుమ లలోనిఉష్ణమండలవర్షారణ్యం లలో మహారాష్ట్ర నుండి కేరళ వరకున్న సముద్ర తీరప్రాంతాలలో,, అస్సాం, త్రిపుర రాజ్యాలలోని రహదారి ప్రక్కలలో పెంచబడుచున్నాయి.[3]

చెట్టు

[మార్చు]

దృఢమైన కాండం కల్గి, ఎత్తుగా, నిటారుగా పెరిగే చెట్టు. పుష్కలంగా కొమ్మలు కాండం చివరి భాగాన గొడుగు/చత్రం వలె విస్తరించి వుండును. కొమ్మల నిండుగా పత్ర దళాలుండును. కొన్నిప్రాంతాలలో ఆకురాల్చు చెట్టు గాను, కొన్ని ప్రాంతాలలో సతత హరిత వృక్షంగా పెరుగును. కాండంపైన బిరుసైన చామనఛాయ/కపిలవర్ణంలో బెరడు వుండును.కొమ్మల మీద, రెమ్మల మీద సన్నని కేశాల వంటి నూగు నిర్మాణం కలిగివుండును. ఆకులు దీర్ఘాండాకారంగా, సాగదీసిన వృత్తాకారంగా వుండును. ఆలుకు తొడిమ వద్ద విశాలంగావుండి, చివరకు వెళ్ళే కొలది సన్నంగా వుండును. ఆకులు .5-.2.2 మి.మీ తొడిమె కలిగి రెమ్మలమీద కణుపు వదలి కణుపు వద్ద వ్యతిరేక దిశలో ఆకులు అమరి వుండును. ఆకులు 8-23 X 2.5-10 సెం, మీ. పరిమాణం కల్గివుండును. ఆకులు పచ్చగా వుండును.పూలు వృత్తాకారంగా (వలయాకారంగా) 5-10 సెం.మీ పరిమాణంలో, తెల్లని పుష్ప దళాలను కల్గి వుండును.[4] జనవరి-ఏప్రిల్ నెలలో చెట్టు పుష్పించడం మొదలు పెట్టుతుంది. ఆగస్టు-సెప్టెంబరు నెలలో కాయలు ఫక్వానికి వచ్చి పళ్ళు అగుతాయి. పండు గోళాకారం లేదా అండాకారంగా వుండి పైన గట్టి పెంకును కల్గివుండును. పెంకు లోపల మృదువైన గుజ్జు వుండును. గుజ్జు పండు పరిమాణంలో 50-55% వుండును. పండులో విత్తనాలు10-15 శంకువు ఆకారంలో కపిల వర్ణంలో వుండును.గింజలో విత్తన/బీజ భాగం 60–70 %వుండి, విత్తనంలో 63% వరకు నూనె వుండును. ఒక చెట్టు నుండి ఏడాదికి 100 కిలోల వరకు పళ్ళ దిగుబడి వచ్చును.[3]

విత్తన సేకరణ-నూనె ఉత్పాదన

[మార్చు]

సాధారణంగా పళ్ళుపండి రాలే సమయానికి చెట్టు మీదకెక్కి పళ్ళను చెట్టు క్రింద పరచిన దళసరి గోతాం, లేదా టార్పాలిన్ వంటి దానిమీద పడేలా ఛేసి సేకరిస్తారు.పళ్ళను చాకుతో చీరి విత్తనాలను వెలికితీసి, శుభ్రంగా నీటితో కడిగి, ఎండ తగిలేలా పలుచగా ఆరబెట్టెదరు.ఆరిన విత్తనాలను చెక్కసుత్తిలో బాది విత్తనాల మీది పొట్టును తొలగించెదరు, ఎక్కువప్రమాణంలో అయ్యినచో డికార్టికేటరు అనే యంత్రంద్వారా ఫైపొట్టూ తొలగించెదరు. పొట్టు తొలగించిన బీజాలనుగానుగలేదా విద్యుత్తుతో తిరిగే గానుగ వంటి రోటరిలనులో, [5] బారీప్రమాణంలోనైనచో ఎక్సుపెల్లరు యంత్రాల ద్వారా నూనెను తీయుదురు.[6]

నూనె గుణ గణాలు

[మార్చు]

నూనె పాలిపోయిన పచ్చరంగులో కన్పిస్తుంది. అయితే నూనెను రిఫైండ్ చేసిన తరువాత నీళ్లవలె పారదర్శకంగా కన్పిస్తుంది. సాధారణంగా అన్ని మొక్కల, చెట్ల నూనెగింజలలో వుండు నూనెలలో సాధారణంగా వుండు కొవ్వుఆమ్లాల కన్న కాస్త భిన్నమైన కొవ్వుఆమ్లాలు ఈ నూనెలో ఉన్నాయి. ఇతర నూనెలో వుండేకొవ్వుఆమ్లాలు ఇందులోవున్నప్పటి కిచాలా తక్కువ ప్రమాణంలో వుండును.అందువలన ఈ నూనెను వంటనూనెగా ఉపయోగించుటకు యోగ్యంకాదు. నూనెలో సైక్లోపెటిన్ కొవ్వు ఆమ్లాలైన హైడ్నొకాప్రిక్, చౌల్ మొగ్రిక్, గొర్లిక్ ఆమ్లాలు 70-80% వరకుండును. సాధారణ కొవ్వుఆమ్లాలు 20-30% వర కుండును. మూడు రకాల మొక్కల విత్తన నూనెలను GLC పద్ధతిలో పరీక్షించినప్పుడు, మూడింటిలోను కొవ్వుఆమ్లాలు వేరువేరు పరిమాణంలో కన్పించాయి.

మూడురకాల మొక్కలనూనెల కొవ్వుఆమ్లాల వివరణ పట్టిక (సగటు) [7]

కొవ్వు ఆమ్లం hy.kurzil H. wightiana H. odorata
హైడ్నొకాప్రిక్ ఆమ్లం 23.೦ 22.9 ..
చౌల్ మోగ్రిక్ ఆమ్లం 19.6 35.0 ..
గోర్లిక్ ఆమ్లం 25.1 12.8 ..
చక్రీయ హొమొలోగస్ 0.3 4.6 ..
మిరిస్టిక్ ఆమ్లం 0.6 0.8 0.4
పామిటిక్ ఆమ్లం 8.4 5.6 11.8
స్టియరిక్ ఆమ్లం 1.6 4.7 ..
పామిటొలిక్ ఆమ్లం 6.0 0.5
ఒలిక్ ఆమ్లం 5.4 3.6 21.8
లినొలిక్ ఆమ్లం 1.6 1.8 29.3
లినొలెనిక్ ఆమ్లం .. .. 31.2

నూనెయొక్క భౌతిక రసాయనిక ధర్మాల పట్టిక [8]

భౌతిక గుణం మితి
వక్రీభవసూచిక 400Cవద్ద 1.472-1.476
అయోడిన్ విలువ 98-103
సపొనిఫికెసను విలువ 198-204
అమ్ల విలువ గరిష్ఠంగా 25.0%
ద్రవీభవన ఉష్ణోగ్రత 20-25
విశిష్ట గురుత్వం25/250Cవద్ద 0.950-.960

నూనె వినియోగం

[మార్చు]

పరాన్నక్రీములనాశనిగా ఉపయోగిస్తారు. అలాగే గాయాలవలన ఏర్పడిన మచ్చలను, గుర్తులను తొలగించుటకు ఉపయోగిస్తారు.చర్మవ్యాధుల నివారణలో కూడా ఈ నూనెను వాడినట్లు దఖాలా లున్నాయి.అయితే గర్భవతులు వాడవచ్చునో, కూడదో ఇంకా నిర్ధారణకాలేదు[9]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "chaulmoogra". thefreedictionary.com. Retrieved 2015-03-07.
  2. 2.0 2.1 "Chaulmoogra". herbs2000.com. Archived from the original on 2015-03-26. Retrieved 2015-03-07.
  3. 3.0 3.1 3.2 3.3 3.4 SEA HandBook-2009,By The Solvent Extractors' Association of India
  4. 4.0 4.1 "Jangli Almond". flowersofindia.net. Retrieved 2015-03-07.
  5. "Oil Mill Machineries". oilmillmachineries.net. Retrieved 2015-03-07.
  6. "Oil Expeller At Our Factory Shed In Domjur, Howrah". .biodieseltechnologiesindia.com. Retrieved 2015-03-07.
  7. "The component fatty acids of chaulmoogra oil". onlinelibrary.wiley.com. Retrieved 2015-03-07.
  8. Singh, Rita. "Encyclopaedic Dictionary of Bio-Medecine". books.google.co.in. p. 151. Retrieved 2015-03-07.
  9. "Chaulmoogra". butterflyexpressions.org. Archived from the original on 2015-06-10. Retrieved 2015-03-07.
  10. "CHAULMOOGRA". webmd.com. Retrieved 2015-03-07.