అనిరుధన్ సంపత్ | |||
| |||
పదవీ కాలం 1 జూన్ 2009 – 17 జూన్ 2019 | |||
ముందు | నియోజకవర్గం ఏర్పాటు చేశారు | ||
---|---|---|---|
తరువాత | అదూర్ ప్రకాష్ | ||
నియోజకవర్గం | అట్టింగల్ | ||
పదవీ కాలం 1996 – 1998 | |||
ముందు | సుశీల గోపాలన్ | ||
తరువాత | వర్కాల రాధాకృష్ణన్ | ||
నియోజకవర్గం | చిరయింకిల్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | త్రివేండ్రం, కేరళ | 1962 జూలై 22||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | సీపీఎం | ||
సంతానం | 2 | ||
నివాసం | 4-C-15/1635, గ్రేస్ కాటేజ్, కే. అనిరుధన్ రోడ్, తిరువనంతపురం, కేరళ |
అనిరుధన్ సంపత్ (జననం 22 జూలై 1962) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన అట్టింగల్ నుండి మూడుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[1][2][3]
ఎ. సంపత్ సీపీఎం ద్వారా రాజకీయాల్లోకి వచ్చి పార్టీలో వివిధ హోదాల్లో పని చేసి 1996లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో అట్టింగల్ నుండి సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి తాళేకున్నిల్ బషీర్ పై 48,083 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. ఆయన 2009లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి జి. బాలచంద్రన్ పై 18,341 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో హోం వ్యవహారాల స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా, ప్రివిలేజెస్ కమిటీ సభ్యుడిగా, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడిగా, నేషనల్ షిప్పింగ్ బోర్డు సభ్యుడిగా, ఇతర వెనుకబడిన తరగతుల (OBCలు) సంక్షేమ కమిటీ సభ్యుడిగా పని చేశాడు.
ఎ. సంపత్ 2014లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బిందు కృష్ణపై 69,378 ఓట్ల మెజారిటీతో గెలిచి మూడోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై పార్లమెంట్‌లో ఆర్థిక & కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సలహా కమిటీ సభ్యుడిగా, పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్, లా అండ్ జస్టిస్‌పై స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా పని చేశాడు. ఆయన 2019లో సీపీఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాష్ చేతిలో 38,247 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.