వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | మహ్మద్ అమీర్ సోహైల్ అలీ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | లాహోర్, పంజాబ్, పాకిస్తాన్ | 1966 సెప్టెంబరు 14|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అ. 9 అం. (175 cమీ.)[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 122) | 1992 4 June - England తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2000 5 March - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 80) | 1990 21 December - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2000 19 February - Sri Lanka తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1983–1999 | Lahore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1987–1992 | Habib Bank Limited | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1995–2001 | Allied Bank Limited | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1998–1999 | Karachi | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2000–2001 | Lahore | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2001 | Somerset | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: CricketArchive, 2010 30 March |
మహ్మద్ అమీర్ సోహైల్ అలీ (జననం 1966, సెప్టెంబరు 14) పాకిస్తాన్ క్రికెట్ వ్యాఖ్యాత, మాజీ క్రికెటర్.[2] పదేళ్ల పాటు సాగిన క్రీడా జీవితంలో, సోహైల్ 195 ఫస్ట్-క్లాస్, 261 లిస్ట్ ఎ పరిమిత ఓవర్ల మ్యాచ్‌లు ఆడాడు, ఇందులో 47 టెస్ట్ మ్యాచ్‌లు, 156 వన్డే ఇంటర్నేషనల్స్ పాకిస్థాన్ తరపున ఉన్నాయి.
ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ గా, వన్డేలలో 156 మ్యాచ్‌లలో 14 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు.
సోహైల్ 1983లో ఫస్ట్-క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేసాడు. ఎడమచేతి వాటం ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ గా, అప్పుడప్పుడు ఎడమచేతి వాటం స్పిన్ బౌలర్ గా రాణించాడు.
సోహైల్ మొదటిసారిగా 1990లో శ్రీలంకతో జరిగిన వన్డే ఇంటర్నేషనల్‌లో జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో 1992 క్రికెట్ ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ముఖ్యమైన సభ్యుడిగా ఉన్నాడు.
సోహైల్ 1998లో పాకిస్థాన్‌కు ఆరు టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఒక టెస్ట్ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను ఓడించిన మొదటి పాకిస్తానీ కెప్టెన్ గా నిలిచాడు.[3] 1996 నుండి 1998 వరకు 22 వన్డే ఇంటర్నేషనల్‌లలో పాకిస్తాన్‌కు కెప్టెన్‌గా చేశాడు. తొమ్మిది విజయాలు, బ్యాట్‌తో సగటు 41.5 సాధించాడు. షార్జాలో వెస్టిండీస్‌పై పాకిస్థాన్‌కు తాత్కాలిక కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.[4]
2001లో క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత, సోహైల్ జాతీయ జట్టుకు చీఫ్ సెలెక్టర్ గా నియమించబడ్డాడు. 2004 జనవరిలో పదవీకాలం ముగిసింది. అతని స్థానంలో మాజీ జాతీయ జట్టు వికెట్ కీపర్ వసీం బారీ వచ్చాడు. క్రికెట్ బ్రాడ్‌కాస్టర్‌గా పని చేస్తూనే ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 4న, మళ్ళీ రెండోసారి జాతీయ జట్టు చీఫ్ సెలెక్టర్‌గా నియమితుడయ్యాడు.[5]