అర్చన | |
---|---|
![]() | |
జననం | అర్చన |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1970-ఇప్పటివరకు |
అర్చన రెండు సార్లు జాతీయ ఉత్తమనటి పురస్కారాన్ని పొందిన ప్రముఖ చలనచిత్ర నటి. తెలుగు, తమిళ చిత్రాలకు గాను 1989 లో, 1988 లో జాతీయ ఉత్తమ నటి పురస్కారాన్ని పొందిన ప్రతిభాశాలి.
అర్చన ఆంధ్రప్రదేశ్ లోని తెలుగు కుటుంబంలో 1970 అక్టోబరు 8న జన్మించింది. ఆమె తమిళనాడు ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫిల్మ్ టెక్నాలజీ నుండి పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ లో గ్రాడ్యుయేషన్ పొందిన నటి. ఆమె తన కెరీర్‌ను హిందీ చిత్రం “యాడూన్ కే బరాత్”తో ప్రారంభించింది. ఆమె రెండు దశాబ్దాలకు పైగా తెలుగు, తమిళ, మలయాళ (పిరవి) సినిమాలలో నటించింది. ఆమె “ఉత్తమ నటిగా జాతీయ చలనచిత్ర పురస్కారం”, “ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డు” గెలుచుకుంది[1]