![]() 2013లో తన కుటుంబంతో అర్జున్ (ఎడమ నుండి రెండవవాడు). | |||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | |||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | అర్జున్ సచిన్ టెండూల్కర్ | ||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | ముంబయి, మహారాష్ట్ర, భారతదేశం | 24 సెప్టెంబరు 1999||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 1 అం. (185 cమీ.)[1] | ||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి | ||||||||||||||||||||||||||
బౌలింగు | ఎడమ చేయి, మీడియం-ఫాస్ట్ | ||||||||||||||||||||||||||
పాత్ర | బౌలర్ | ||||||||||||||||||||||||||
బంధువులు | సచిన్ టెండూల్కర్ (తండ్రి)[2] రమేష్ టెండూల్కర్ (తాత) | ||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | |||||||||||||||||||||||||||
Years | Team | ||||||||||||||||||||||||||
2020-21 – ప్రస్తుతం | ముంబయి క్రికెట్ జట్టు | ||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | |||||||||||||||||||||||||||
| |||||||||||||||||||||||||||
మూలం: Cricinfo, ఏప్రిల్ 2 2021 |
అర్జున్ సచిన్ టెండూల్కర్ (జననం 1999 సెప్టెంబరు 24) ఒక భారతీయ క్రికెటర్.[3] అతను సచిన్ టెండూల్కర్ కుమారుడు.[4]
అర్జున్ టెండూల్కర్ ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్, ఎడమచేతి వాటం బ్యాట్స్మెన్. 2018లో శ్రీలంకపై అండర్-19 టోర్నీతో అర్జున్ టెండూల్కర్ అరంగేట్రం చేసాడు.[5] అలాగే 2020-21 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో హర్యానాపై ముంబై తరపున 2021 జనవరి 15న తన టి20 ఫార్మాట్ క్రికెట్ లో అడుగుపెట్టాడు.[6] ఇందులో మూడు ఓవర్లలో 34 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు.[7]
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021కి ముందు ఫిబ్రవరి 2021లో జరిగిన ఐపిఎల్ వేలంలో అర్జున్ టెండూల్కర్ ను ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది[8][9] 2021 సెప్టెంబరులో మొదటిసారిగా ముంబై సీనియర్ జట్టులో అర్జున్ టెండూల్కర్ ఎంపికయ్యాడు. ముంబై 22 మంది సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ జట్టులో అతను ఒక ఆటగాడు.[10] అయితే గాయం కారణంగా 2021 ఐపిఎల్ నుండి తొలగించబడ్డాడు.[11] అతన్ని 2022 ఫిబ్రవరిలో మళ్లీ ముంబై ఇండియన్స్ కొనుగోలు చేసింది, ఈ ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 టోర్నీ 2022లో మార్చి 26 నుండి మే 29 వరకు జరిగింది.[12] అయితే ఇందులో ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం కూడా అతనికి రాలేదు.
ఆ తరువాత ముంబయి క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) తీసుకుని గోవా జట్టుకు అర్జున్ టెండూల్కర్ బౌలర్ గా ఎంపికైయ్యాడు. అయితే 2022 డిసెంబరు 14న రంజీ ట్రోఫీ ఎలైట్ విభాగంలో తన తొలి మ్యాచ్ లోనే సెంచరీ నమోదు చేశాడు. రాజస్థాన్ జట్టుతో గ్రూప్-సి మ్యాచ్ లో ఏడోస్థానంలో బ్యాటింగ్ కు దిగిన అతను 207 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సులతో 120 పరుగుల స్కోరు నమోదుచేసాడు.[13]
23 ఏళ్ల అర్జున్ టెండూల్కర్ మొదటి మ్యాచ్ తోనే శతక వీరుల జాబితాలో చేరాడు. ఈ ఘనత సచిన్ టెండుల్కర్ 15 ఏళ్ల వయసులోనే సాధించడం విశేషం.
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite news}}
: Check date values in: |date=
and |archive-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: Check date values in: |access-date=
(help)
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)