అల్వాల్, తెలంగాణ రాష్ట్రం, మేడ్చల్ జిల్లా, అల్వాల్ మండలంలోని గ్రామం.[1]
అల్వాల్ | |
— రెవెన్యూ గ్రామం — | |
పాత అల్వాల్ సరస్సు దృశ్యం. | |
తెలంగాణ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 17°29′52″N 78°30′31″E / 17.497697°N 78.508580°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | మేడ్చల్ మల్కాజ్‌గిరి |
మండలం | అల్వాల్ |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
ఇది హైదరాబాదు పొరుగు ప్రాంతం.రాష్ట్రంలోని జిల్లాల పునర్య్వస్థీకరణకు ముందు రంగారెడ్డి జిల్లాలో భాగంగా ఉంది.గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్లో విలీనం కావడానికి మున్సిపాలిటీగా ఉంది.
లోగడ అల్వాల్ గ్రామం/పట్టణ ప్రాంతం లోగడ రంగారెడ్డి జిల్లా, మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలోని మల్కాజ్‌గిరి మండల పరిధిలో ఉంది.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల పునర్య్వస్థీకరణలో భాగంగా అల్వాల్ పట్టణ ప్రాంతాన్ని (1+09) పది పట్టణ ప్రాంతాలతో నూతన మండల కేంధ్రంగా మేడ్చల్ జిల్లా,మల్కాజ్‌గిరి రెవెన్యూ డివిజను పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[1]
అల్వాల్ పరిధిలో 28.41 ఎకరాల్లో జీ ప్లస్ 5 అంతస్తుల్లో వెయ్యి పడకల మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి 2022 ఏప్రిల్ 26న మధ్యాహ్నం 1 గంటకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు భూమిపూజ చేశాడు. 897 కోట్ల రూపాయలతో నిర్మించనున్న ఈ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌లో వెయ్యి పడకలను (300 ఐసీయూ బెడ్స్), 26 ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు టి. హరీశ్‌రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు మాగంటి గోపీనాథ్, దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మైనంపల్లి హనేమతరావు, వివేకానంద గౌడ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.[2][3]