అశ్వారావుపేట | |
— మండలం — | |
తెలంగాణ పటంలో భద్రాద్రి జిల్లా, అశ్వారావుపేట స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 17°14′28″N 81°6′38″E / 17.24111°N 81.11056°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | భద్రాద్రి జిల్లా |
మండల కేంద్రం | అశ్వారావుపేట |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
వైశాల్యము | |
- మొత్తం | 582 km² (224.7 sq mi) |
జనాభా (2011) | |
- మొత్తం | 59,652 |
- పురుషులు | 29,963 |
- స్త్రీలు | 29,689 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 51.06% |
- పురుషులు | 56.94% |
- స్త్రీలు | 45.10% |
పిన్కోడ్ | 507301 |
అశ్వారావుపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1] ఇది సమీప పట్టణమైన సత్తుపల్లి నుండి 40 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఖమ్మం జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం కొత్తగూడెం రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది పాల్వంచ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 20 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో ఒకటి నిర్జన గ్రామం.మండల కేంద్రం అశ్వారావుపేట
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 59,652 - పురుషులు 29,963 - స్త్రీలు 29,689.
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 582 చ.కి.మీ. కాగా, జనాభా 59,652. జనాభాలో పురుషులు 29,963 కాగా, స్త్రీల సంఖ్య 29,689. మండలంలో 15,775 గృహాలున్నాయి.[3]
2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016 లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అశ్వారావుపేట మండలం ఖమ్మం జిల్లా నుండి (1+19) ఇరువై గ్రామాలుతో కొత్తగా ఏర్పడిన భద్రాద్రి (కొత్తగూడెం) జిల్లా పరిధిలో చేర్చుతూ ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.[4]
గమనిక:నిర్జన గ్రామం ఒకటి పరిగణనలోకి తీసుకోలేదు