ఆంటోనీ ఈస్టమన్ | |
---|---|
![]() | |
జననం | ఆంటోనీ 1946 ఆగస్టు 26 చోవన్నూర్, కింగ్డమ్ అఫ్ కొచ్చిన్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు త్రిసూర్ జిల్లా, కేరళ, భారతదేశం) |
మరణం | 3 జూలై 2021 | (aged 74)
జాతీయత | ![]() |
ఆంథోని ఈస్ట్‌మన్ మలయాళ సినిమా దర్శకుడు & నిర్మాత. ఆయన దర్శకత్వం వహించిన అంబాడే న్జానే సినిమా ఆయనకు మంచి గుర్తింపు తెచ్చింది. ఆంథోని ఇనాయే తేడి సినిమా ద్వారా నటి సిల్క్ స్మితను సినీ రంగానికి పరిచయం చేశాడు.[1]
ఆంథోని మురిగితీరి కురియాకోస్, మార్తా దంపతులకు 26 ఆగస్టు 1946లో చోవన్నూర్ గ్రామం, కింగ్డమ్ అఫ్ కొచ్చిన్, బ్రిటిష్ ఇండియాలో జన్మించాడు. ఆయన చోవన్నూర్ లోని సెయింట్ థామస్ స్కూల్ & కున్నంకుళం ప్రభుత్వ పాఠశాల నుండి పాఠశాల విద్యాభాస్యం పూర్తి చేశాడు.[2] ఆంథోనీ 1960వ దశకంలో ఫొటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించి, ఈస్టమన్ స్టూడియో ప్రారంభించాడు.[3]
ఆంథోని మేరీ ని వివాహమాడాడు. ఆయనకు కుమారుడు గంజి, కుమార్తె మినీ ఉన్నారు.[4]
ఆంథోని 1979లో ‘ఇనాయే తేడి’ సినిమా ద్వారా దర్శకుడిగా మారాడు.
ఆంథోనీ 3 జూలై 2021న త్రిస్పూర్లో గుండెపోటుతో మరణించాడు. [5]