సారాంశం | |||||
---|---|---|---|---|---|
రైలు వర్గం | సూపర్ ఫాస్టు ఎక్స్ప్రెస్ | ||||
స్థానికత | ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ | ||||
తొలి సేవ | ఆగస్టు 12, 2015 | ||||
ప్రస్తుతం నడిపేవారు | భారతీయ రైల్వే | ||||
మార్గం | |||||
మొదలు | న్యూఢిల్లీ | ||||
ఆగే స్టేషనులు | 19 | ||||
గమ్యం | విశాఖపట్నం | ||||
ప్రయాణ దూరం | 2,099 కిలోమీటర్లు (1,304 మై.)* | ||||
సగటు ప్రయాణ సమయం | 35 hours 15 minutes | ||||
రైలు నడిచే విధం | Daily | ||||
రైలు సంఖ్య(లు) | 20805 (విశాఖపట్నం - న్యూఢిల్లీ) 20806 (న్యూఢిల్లీ - విశాఖపట్నం) | ||||
లైను (ఏ గేజు?) | ఢిల్లీ - చెన్నై మార్గము హౌరా - చెన్నై ప్రధాన మార్గము | ||||
సదుపాయాలు | |||||
శ్రేణులు | AC first class, AC two tier, AC 3 tier, AC pantry | ||||
పడుకునేందుకు సదుపాయాలు | Yes | ||||
ఆహార సదుపాయాలు | Yes | ||||
ఇతర సదుపాయాలు | good | ||||
సాంకేతికత | |||||
పట్టాల గేజ్ | బ్రాడ్ గేజ్ | ||||
వేగం | 59 km/h (37 mph) (average with halts) | ||||
|
ఆంధ్రప్రదేశ్ ఎక్స్ప్రెస్ లేదా ఎ.పి.ఎక్స్ప్రెస్ భారతదేశ రాజధాని అయిన న్యూఢిల్లీ నుండి ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వరకు నడుపబడు సూపర్ఫాస్టు ఎక్స్ప్రెస్ రైలు.[1] ఈ రైలు భారతీయ రైల్వేలతో నిర్వహింపబడింది. ఈ రైలు 20805/20806 పేరుతో పిలువబడుతోంది. ఈ సర్వీసును 2015 ఆగస్టు 12 న భారత రైల్వే మంత్రి సురేష్ ప్రభు ప్రారంభించారు.[2][3]
ఈ రైలు పూర్తిగా ఎయిర్ కండిషన్ తో కూడుకొని ఉంది. ఇది వారంలో అన్ని దినాలలో ప్రయాణిస్తుంది. ఇది ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ రాష్ట్రాలలో ప్రయాణించి చివరకు ఆంధ్రప్రదేశ్లో ప్రవేశింస్తుంది. ఈ రైలులో 1 ఎసి మొదటి తరాతి, 5 ఎసి టూటైర్, 7 ఎసి 3 టైర్, 1 ఎసి పాంట్రీ కార్, 2 గార్డు కం జెనెరేటర్ కార్స్ ఉన్నాయి. ఈ రైలు విశాఖపట్నం నుండి బయలుదేరి రెండవరోజు న్యూఢిల్లీకి చేరుతుంది. అదే విధంగా న్యూఢిల్లీలో బయలుదేరి రెండవ దినం విశాఖపట్నం చేరుతుంది. ఈ రైలు యొక్క సరాసరి వడి 59 కి.మీ/గంట[2]
22415 పేరుతో గల రైలు విశాఖపట్నం నుండి బయలుదేరి న్యూఢిల్లీకి చేరుతుంది. అదే విధంగా 22416 రైలు న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖపట్నం చేరుతుంది.
ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ జంక్షన్ రైల్వే స్టేషను, వరంగల్, నాగ్పూర్, ఇటార్సీ జంక్షన్, భోపాల్, ఝాన్సీ రైల్వే జంక్షన్, గ్వాలియర్, ఆగ్రాగుండా ప్రయాణిస్తుంది.
ఈ రైలు భారతీయ లోకోమోతివ్ క్లాస్ WAP-7 [LGD, TKD OR GZB] లోకోషెడ్ ను ఉపయోగించుకుని, [4] పూర్తిగా ప్రయాణం చేస్తుంది.