ఆరిఫ్ బట్

ఆరిఫ్ బట్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1944-05-17)1944 మే 17
లాహోర్, పంజాబ్, బ్రిటిష్ ఇండియా
మరణించిన తేదీ2007 జూలై 11(2007-07-11) (వయసు 63)
లాహోర్, పాకిస్తాన్
బ్యాటింగుకుడిచేతి వాటం
బౌలింగుకుడిచేతి ఫాస్ట్ మీడియం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 47)1964 డిసెంబరు 4 - ఆస్ట్రేలియా తో
చివరి టెస్టు1965 జనవరి 29 - న్యూజీలాండ్ తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 3 97
చేసిన పరుగులు 59 4,017
బ్యాటింగు సగటు 11.80 29.10
100లు/50లు 0/0 4/22
అత్యధిక స్కోరు 20 180
వేసిన బంతులు 666 11,879
వికెట్లు 14 201
బౌలింగు సగటు 20.57 26.79
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 1 10
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 2
అత్యుత్తమ బౌలింగు 6/89 8/45
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 44/–
మూలం: Cricinfo, 2023 మే 23


ఆరిఫ్ బట్ (1944, మే 17 - 2007, జూలై 11) పాకిస్తానీ టెస్ట్ క్రికెట్ ఆటగాడు. ఫాస్ట్-మీడియం బౌలర్ గా, బ్యాట్స్‌మన్ గా రాణించాడు.

జననం

[మార్చు]

ఆరిఫ్ బట్ 1944, మే 17న పాకిస్తాన్, పంజాబ్‌లోని లాహోర్‌లో జన్మించాడు.

క్రికెట్ రంగం

[మార్చు]

16 సంవత్సరాల వయస్సులో 1960-61లో పంజాబ్ విశ్వవిద్యాలయంతో జరిగిన మ్యాచ్ లో లాహోర్ తరపున ఫస్ట్ క్లాస్ క్రికెట్ లోకి అరంగేట్రం చేశాడు. లాహోర్‌లోని ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్‌లో శిక్షణ పొందాడు. 1977-78 సీజన్ తర్వాత రిటైర్ అయ్యేవరకు 1962-63 నుండి పాకిస్తాన్ రైల్వేస్ తరపున ఫస్ట్-క్లాస్ క్రికెట్ ఆడాడు.

1964-65లో మెల్‌బోర్న్‌లో పాకిస్తాన్ తరపున తన అరంగేట్రం చేసాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 89 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. టెస్టు అరంగేట్రంలో 6 వికెట్లు తీసిన మొదటి పాకిస్థానీగా రికార్డు సాధించాడు.[1] గాయపడిన వికెట్ కీపర్ అబ్దుల్ కదిర్ స్థానంలో పాకిస్తాన్ రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ ప్రారంభించాడు, 12 పరుగులు చేశాడు. దాదాపు గంటపాటు ఆస్ట్రేలియా కొత్త బంతిని ఎదుర్కొన్నాడు.[2]

అతను 1966-67 క్వాయిడ్-ఐ-అజం ట్రోఫీ ఫైనల్‌లో కరాచీపై తొలి సెంచరీని సాధించాడు. 1973-74లో ప్యాట్రన్స్ ట్రోఫీ, క్వాయిడ్-ఎ-అజం ట్రోఫీలో రైల్వేస్‌కు నాయకత్వం వహించాడు. క్వాయిడ్ ఫైనల్‌లో సింధుకు వ్యతిరేకంగా 55 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు. ఆ సీజన్‌లో 718 పరుగులు చేశాడు, ఇందులో పంజాబ్‌పై ఓపెనింగ్ బ్యాట్‌గా 180 పరుగులు చేశాడు. 1972-73లో సర్గోధపై రైల్వేస్‌కు 45 పరుగులకు 8 వికెట్లు అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు.

మూలాలు

[మార్చు]
  1. "Six wickets on Test debut". Archived from the original on 2007-04-01. Retrieved 2007-07-16.
  2. Australia v Pakistan, Melbourne 1964-65

బాహ్య లింకులు

[మార్చు]