ఆరోహణ్

ఆరోహణ్
సినిమా పోస్టర్
దర్శకత్వంశ్యామ్ బెనగళ్
రచనషామా జైదీ
నిర్మాతపశ్చిమ బెంగాల్ ప్రభుత్వం
తారాగణంఓం పురి
విక్టర్ బెనర్జీ
పంకజ్ కపూర్
ఛాయాగ్రహణంగోవింద్ నిహలానీ
కూర్పుభానుదాస్ దివాకర్
సంగీతంపూర్ణా దాస్ బౌల్
విడుదల తేదీ
1982
సినిమా నిడివి
144 నిమిషాలు
దేశంభారతదేశం
భాషహిందీ

ఆరోహణ్, 1982లో విడుదలైన హిందీ సినిమా.[1] శ్యామ్ బెనగల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విక్టర్ బెనర్జీ, ఓం పురి,[2] దీప్తి భట్ ప్రధాన పాత్రలలో నటించారు.[3][4] భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలలో ఈ సినిమాకు ఉత్తమ హిందీ సినిమా, ఉత్తమ నటుడు విభాగాల్లో అవార్డులు వచ్చాయి.

నటవర్గం

[మార్చు]
  • విక్టర్ బెనర్జీ (జోక్దార్ బిభూతిభూషణ్ గంగూలీ)
  • ఓం పురి (హరి మండలం ‌)
  • పంకజ్ కపూర్ (గ్రామ ఉపాధ్యాయుడు)
  • నోని గంగూలీ (హరి తమ్ముడు బోలాయ్ మండలం ‌)
  • శ్రీల మజుందార్ (పాంచీ)
  • ఖోఖా ముఖర్జీ (హసన్ మల్ల)
  • గీతా సేన్ (హరి అత్త కాళిదాశి)
  • జయంత్ కృపాలని (సీనియర్ జిల్లా మేజిస్ట్రేట్ జయంత్)
  • రాజన్ తారాఫ్డర్ (బిభూతిభూషణ్ ఎస్టేట్ ఏజెంట్ కర్మకర్‌)
  • దీప్తి భట్ (హరి భార్య)
  • అమ్రీష్ పురి (హైకోర్టులో న్యాయమూర్తి)
  • ఇషానీ బెనర్జీ
  • శేఖర్ ఛటర్జీ
  • అరవింద్ దేశ్‌పాండే
  • షమానంద్ జలంద్
  • జయేష్ క్రిపలానీ

కథా సంగ్ర్రహం

[మార్చు]

కథా కాలం 1960 దశకం మధ్య ప్రాంతాలది. నక్సల్బరీ తిరుగుబాటు బెంగాల్ అంతటా వ్యాపించి, అణగారిన రైతులు కమ్యూనిజం, సోషలిస్ట్ రిపబ్లిక్‌ను విశ్వసించే యువకులచే ఏకం అవుతున్న సమయం అది. హరి మండలం తన భార్య, ఇద్దరు కుమారులు, సోదరుడు, వృద్ధ వితంతువు అత్త కాళిదాసి, ఆమె కుమార్తె పంచితో కలిసి బీర్భూమ్ జిల్లాలోని గిరిపూర్ అనే మారుమూల బెంగాల్ గ్రామంలో నివసిస్తున్న ఒక పేదరైతు. హరి అతని తమ్ముడు బోలాయి కౌలు రైతులు. హరి తన చెల్లెలు పెళ్ళి కోసం తన భూస్వామి బిభూతిభూషణ్ గంగూలీని అప్పు అడుగుతాడు. దానికి బదులుగా తన కౌలు హక్కులను ప్రభుత్వ కార్యాలయంలో నమోదు చేయవద్దని కోరుతాడు బిభూతిభూషణ్. హరి అమాయకుడు. తరతరాలుగా తాము దాస్యం చేస్తూ ఉన్నా తమ హక్కుల గురించి వాస్తవాన్ని గ్రహించినా ఏమీ చేయలేకపోతాడు. అతని తమ్ముడు బోలాయ్ మాత్రం భూస్వామి వద్ద సేవకునిగా ఉండటానికి సంతోషంగా లేడు. అనేక సార్లు తన నిరసనను భూస్వామి, అతని ప్రతినిధి రాజన్ తపర్దార్ వద్ద ప్రదర్శించేవాడు. బొలాయ్, పంచీ ఇరువురూ ప్రేమించుకున్నారు.

కాలక్రమేణా, ఈ ప్రాంతంలో కమ్యూనిస్ట్ ఉద్యమం బలపడుతుండగా, హరి తన భూస్వామిచేత అణచివేయబడ్డాడు. తన సొంత స్థలంలో జీతగాడిగా పనిచేయసాగాడు. అతనితో పని చేయకుండా అతని సోదరుడిని తొలగించారు. బోలాయి గ్రామ జీవితం పట్ల విరక్తి చెంది, పని కోసం కలకత్తా వెళతాడు. అక్కడ, అతను చిల్లర దొంగతనాలు చేసే ముఠాతో చేరి చివరికి రాజకీయగూండాగా మారాడు. పంచి, ఆమె తల్లి ఇద్దరూ కలకత్తాకు వలస వెళతారు. కాళిదాశి ఒక మధ్యతరగతి గృహంలో అతి తక్కువ జీతంతో వంట మనిషిగా, పనిమనిషిగా పనిచేస్తుండగ్గా, పంచి ఒక మధ్య వయస్కుడైన మార్వాడీ వ్యాపారి ఎరలో చిక్కుకుంటుంది.

హరి ఒంటరిగా తన భూస్వామితో పోరాటం కొనసాగించాడు. అతనిపై సానుభూతి వున్న మాస్టర్ సహాయంతో ఉచితంగా ఒక లాయర్‌ను కుదుర్చుకుని జిల్లా కోర్టులో భూస్వామిపై కేసు పెడతాడు. భూస్వామి తన బలాన్ని ఉపయోగించి అతనిని గూండాలతో తన్నించి, అతడి ఇంటిని తగలబెట్టి, అతని ఎద్దులను తీసుకువెళ్ళి కోర్టులో పోరాడటానికి నిస్సహాయుణ్ణి చేస్తాడు. హరి ఒత్తిడితో కేసు హైకోర్టుకు చేరుతుంది. కానీ అక్కడ తీర్పు భూస్వామికి అనుకూలంగా వస్తుంది. ఇంతలో, బెంగాల్‌లో మొదటి వామపక్ష కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పడింది. సంవత్సరాల కోర్టుపోరాటం, పంచాయితీ ఎన్నికలలో గ్రామ పంచ్‌గా మారాక అతను తన భూమి పట్టాసర్టిఫికేట్‌ను అందుకున్నాడు. హరి తన తమ్ముడిని, తన వాళ్ళను వెదకడానికి కలకత్తా వస్తాడు. విఫలయత్నం చేసి తన గ్రామానికి వెళ్ళిపోతాడు. బొలాయ్ రాజకీయ హత్యకేసులో ఇరుక్కొని యావజ్జీవ శిక్షను అనుభవిస్తూ జైలులో ఉన్న సంగతి గానీ, మార్వాడీ వ్యాపారి పంచీకి కడుపుచేసి ఇంటినుండి తరిమివేస్తే ఆమెకు అబార్షన్ అయ్యి, ఆరోగ్యం క్షీణించి, షాక్‌కు గురై, మతిస్థిమితం కోల్పోయి వీదులలో తిరుగుతున్న సంగతి గానీ, కూతురు దుస్థితిని చూసి గుండెపగిలి కాళిదాసి చనిపోయిన విషయంగానీ పాపం హరికి తెలిసే అవకాశం లేదు. కొంత కాలానికి హరి మరణించడంతో కథ ముగుస్తుంది. .

పాటలు

[మార్చు]

ఈ సినిమాకు పూర్ణా దాస్ బౌల్ సంగీతం అందించగా, న్యాజ్ హైదర్ పాటలు రాశాడు.[5]

  1. భటక్ రహా హరి మండల సే
  2. చల్తీ హై విద్రోహ్ కి ఆంధీ
  3. దేఖో హరి మండలం కో దేఖో
  4. డెర్ నహీ డెర్ నహీ హోవే డెర్ నా కర్
  5. జ్యోతి ఆంఖ్ సే ఓజల్ హో గయి
  6. ఖో బైత హై
  7. ట్యూన్ అబ్ తక్ జో కుచ్ పాయ

అవార్డులు

[మార్చు]
భారత జాతీయ చలనచిత్ర పురస్కారాలు

మూలాలు

[మార్చు]
  1. "Arohan (1982) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow". in.bookmyshow.com. Retrieved 2021-08-15.
  2. "Happy birthday Om Puri: His 10 movies that film lovers will remember forever". Hindustan Times (in ఇంగ్లీష్). 2019-10-17. Retrieved 2021-08-15.
  3. "Aarohan (1982)". Indiancine.ma. Retrieved 2021-08-15.
  4. "Arohan". www.rottentomatoes.com. Retrieved 2021-08-15.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Hindi Film Songs - Arohan (The Ascent) (1982) | MySwar". myswar.co. Retrieved 2021-08-15.

బయటి లింకులు

[మార్చు]