వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | ఆల్విన్ ఇసాక్ కల్లిచరణ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | జార్జిటౌన్, దెమెరారా, బ్రిటిష్ గినియా | 1949 మార్చి 21|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | కల్లి | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 5 అడుగుల 4 అంగుళాలు[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | ఎడమచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఆఫ్ బ్రేక్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | బ్యాటర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బంధువులు | డెరెక్ కాళీచరణ్ (సోదరుడు) మహేంద్ర నాగముత్తు (మేనల్లుడు) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వెబ్‌సైటు | https://alvinkallicharran.com/ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 144) | 1972 ఏప్రిల్ 6 - న్యూజీలాండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 1981 జనవరి 4 - పాకిస్తాన్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 7) | 1973 సెప్టెంబరు 5 - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 1981 ఫిబ్రవరి 4 - ఇంగ్లండ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1966/67–1980/81 | గయానా | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1971–1990 | వార్‌విక్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1972/73–1973/74 | బెర్బైస్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1977/78 | క్వీన్స్‌లాండ్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1981/82–1983/84 | ట్రాన్స్‌వాల్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
1984/85–1987/88 | ఆరెంజ్ ఫ్రీస్టేట్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 2013 జులై 2 |
ఆల్విన్ ఐజాక్ కాళీచరణ్ (జననం 1949 మార్చి 21) తమిళ మూలానికి చెందిన మాజీ ఇండో-గయానీస్ క్రికెటర్. ఇతను వెస్టిండీస్ తరపున 1972 - 1981 మధ్య టెస్ట్ క్రికెట్ ఆడాడు. ఇతను ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్, కుడిచేతి ఆఫ్ స్పిన్నర్.
బ్రిటీష్ గయానా(ఇప్పుడు గయానా) లోని పోర్ట్ మౌరాంట్‌లో కల్లిచర్రణ్ జన్మించాడు. 1966లో అండర్-16 గయానా జట్టుకు కెప్టెన్‌గా ప్రొఫెషనల్ కెరీర్, 1967లో ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేసే వరకు అతను పోర్ట్ మౌరాంట్‌లో వీధి క్రికెట్ ఆడేవాడు.[2]
ఇతను 1983 సంవత్సరానికి విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా అతను ఎంపికయ్యాడు. 1975, 1979 క్రికెట్ ప్రపంచ కప్‌లు గెలిచిన వెస్టిండీస్ క్రికెట్ జట్లలో ఇతను సభ్యుడు. 1978-79 పర్యటనలో భారత్‌పై సాధించిన 187 పరుగులు అతని అత్యధిక స్కోరు. అతను ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్‌లో కూడా పాల్గొని వార్విక్‌షైర్ జట్టుకు ఆడి విజయం సాధించాడు. 1984లో ఆక్స్‌ఫర్డ్‌షైర్‌తో వన్ డే నాట్‌వెస్ట్ ట్రోఫీలో మైనర్ కౌంటీ మ్యాచ్ ఆడుతున్నప్పుడు అతను 206 పరుగులు సాధించి, బౌలింగ్ చేసి 32 పరుగులకు 6 వికెట్లు తీసుకున్నాడు.[3]
అతని ఇన్నింగ్స్ లో అత్యంత ప్రాచుర్యం చెందినవాటిలో ఒకటి 1974లో ఇంగ్లండ్ - వెస్టిండీస్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగింది. 158 పరుగులతో కాళీచరణ్ ఆడినప్పుడు రెండో రోజు చివరి బంతికి టోనీ గ్రెగ్ అతన్ని రనౌట్ చేయడం వివాదగ్రస్తమైంది. బంతిని డిఫెండ్ చేసిన తర్వాత రెండవ రోజు ఆట పూర్తికావడంతో కల్లిచర్రణ్ ఆఫ్ వాక్ చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలో గ్రేగ్ నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో స్టంప్‌లను బంతితో కొట్టి అతన్ని రనౌట్ చేశాడు. దీనిపై వివాదం జరగడంతో పిచ్ బయటి చర్చల తర్వాత, ఇంగ్లండ్ తమ అప్పీల్‌ను ఉపసంహరించుకుంది. మూడో రోజు ఉదయం కలిచరణ్ ఆట ప్రారంభించగలిగాడు. [4]
అతను వరల్డ్ సిరీస్ క్రికెట్‌లో చేరడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. కెర్రీ ప్యాకర్ వివాదంతో క్లైవ్ లాయిడ్ రాజీనామా చేయడంతో కాళీచరణ్‌ని 1977-1978లో వెస్టిండీస్ కెప్టెన్‌గా నియమించారు.
దక్షిణాఫ్రికా అపార్తీడ్ (జాతివివక్ష) విధానాలను వ్యతిరేకిస్తూ కామన్ వెల్త్ ప్రధానుల మధ్య జరిగిన చర్చలో ఆ దేశంతో క్రీడా సంబంధాలు తెంచుకోవాలని చేసుకున్న గ్లెనెగల్స్ ఒప్పందాన్ని ధిక్కరిస్తూ జరిగిన అనధికారిక రెబెల్ పర్యటనకు నేతృత్వం వహించి దక్షిణాఫ్రికాతో కల్లీచరణ్ ఆడాడు. దీనివల్ల కాళీచరణ్ మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇందువల్ల ఆ తర్వాత అతను వెస్టిండీస్ జట్టుకు కాకుండా దక్షిణాఫ్రికా దేశవాళీ క్రికెట్‌లో ఆరెంజ్ ఫ్రీ స్టేట్, ట్రాన్స్‌వాల్ వంటి జట్లకు ఆడి తన కెరీర్‌లో మిగిలిన కాలం గడపాల్సి వచ్చింది.
కెల్లీచరణ్ భార్య పేరు పాట్సీ. అతని సోదరుడు డెరెక్ గయానాకు, తర్వాతి కాలంలో యుఎస్ఎకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడాడు. అతని మేనల్లుళ్ళు మహేంద్ర నగమూటూ, విశాల్ నగమూటూ కూడా క్రికెటర్లే. కాళీచరణ్ సత్యసాయిబాబా భక్తుడు.[5] నార్త్ కెరోలినాలోని ట్రయాంగిల్ క్రికెట్ లీగ్ కోచ్ గానూ, పుదుచ్చేరీ స్త్రీ, పురుష క్రికెట్ జట్లకు మెంటార్ గానూ వ్యవహరిస్తున్నాడు.[6][7] అతని క్రికెట్ ఆటలోనూ, సేవారంగంలోనూ అతని కృషి ఫలితంగా 2019లో న్యూఇయర్స్ ఆనర్స్ జాబితాలో బ్రిటిష్ ఎంపైర్ మెడల్ పొందాడు.[8]
The bare-headed Kalli, little more than 5ft 4in tall