ఆవకాయ్ బిర్యానీ | |
---|---|
దర్శకత్వం | అనీష్ కురువిల్లా |
నిర్మాత | శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల |
తారాగణం | కమల్ కామరాజు బిందు మాధవి రావు రమేష్ జొన్నాడ వరుణ్ |
కూర్పు | ప్రవీణ్ బోయిన |
సంగీతం | మణికాంత్ కద్రి |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | అమిగోస్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | నవంబరు 14, 2008 |
సినిమా నిడివి | 140 నిమిషాలు |
భాష | తెలుగు |
ఆవకాయ్ బిర్యానీ అనీష్ కురువిల్లా దర్శకత్వంలో 2008లో విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో కమల్ కామరాజు, బిందు మాధవి ముఖ్యపాత్రలు పోషించారు. ఈ సినిమాను శేఖర్ కమ్ముల, చంద్రశేఖర్ కమ్ముల కలిసి అమిగోస్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించారు. మణికాంత్ కద్రి సంగీత దర్శకత్వం వహించాడు.[1]
ఆటో నడిపే అక్బర్ అనే వ్యక్తి ఆవకాయ తయారుచేసి అమ్మే లక్ష్మి అనే అమ్మాయి ప్రేమకథ ఈ సినిమా.
దేవరకొండ నుంచి వికారాబాద్ వరకు ఆటో నడుపుతూ ఉంటాడు అక్బర్. చదువులో పలుమార్లు విఫలమైనా ఎలాగైనా డిగ్రీ పూర్తి చేయాలని అనుకుంటూ ఉంటాడు. పోలవరంలో ఉండే లక్ష్మి అక్కడ తమ సర్వం కోల్పోవడంతో తన కుటుంబంతో కలిసి దేవరకొండకు వస్తుంది. ఆమె కుటుంబంతో కలిసి ఆవకాయలు, పచ్చళ్ళు తయారు చేసి అమ్ముతూ ఉంటుంది. ఆమె పచ్చళ్ళు ప్రపంచవ్యాప్తంగా అమ్ముడవ్వాలని ఆమె లక్ష్యం. లక్ష్మి తండ్రికి ముస్లింలు అంటే ద్వేషం. కుటుంబంలో అందరికీ వాళ్ళకి దూరంగా ఉండమంటాడు. కానీ లక్ష్మి, అక్బర్ మాత్రం ఇద్దరూ ఒకరంటే ఒకరు అభిమానించుకుంటారు.