రకం | ప్రైవేట్ బిజినెస్ స్కూల్ |
---|---|
స్థాపితం | 1999 |
చైర్మన్ | ఆది గోద్రేజ్ (2011-ప్రస్తుతం) |
డీన్ | అజిత్ రంగనేకర్ |
సహ-వ్యవస్థాపకులు | రజత్ గుప్తా, అనిల్ కుమార్ |
విద్యాసంబంధ సిబ్బంది | 49 పర్మినెంట్ ఫ్యాకల్టీ 105 విజిటింగ్ ఫ్యాకల్టీ [1] |
విద్యార్థులు | 847 (770 in MBA) (10 in Ph.D.[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-]) (67 in EMBA) |
స్థానం | హైదరాబాదు-తెలంగాణ, మౌహాలి-పంజాబ్, భారతదేశం 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E |
కాంపస్ | పట్టణ ప్రాంతం |
అథ్లెటిక్ మారుపేరు | ISB |
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (Indian School of Business) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ) తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ల కొరకు ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఐ.ఎస్.బి కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు [2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము సహకారముతో 1999 డిసెంబరు 20న[3] స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ మాజీ మేనేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ స్థాపనలో కీలకపాత్ర పోషించారు.[4]
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనిజిమెంట్‌లతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి.[5] శీఘ్రగతిన నడిచే ఒక సంవత్సరపు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఐఎస్‌బీ ప్రత్యేకత.
భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2022 మే 26న నగరంలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) వార్షికోత్సవానికి హాజరుకానున్నారు.
1996 సంవత్సరంలో కొంతమంది పారిశ్రమక వేత్తలు, విద్యావేత్తలు ఆసియాలో ప్రపంచవ్యాప్తంగా అగ్రశ్రేణి, ప్రత్యేక వ్యాపార కళాశాల స్థాపన ఆవశ్యకతను గుర్తించింది. ప్రస్తుతం పరిశ్రమ రంగాలలో అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ సూక్ష్మ నైపుణ్యాలలో శిక్షణ పొందిన యువ నాయకులు, పారిశ్రామిక వేత్తల అవసరమని వారు గుర్తించి, వినూత్న విద్యా కార్యక్రమాలతో, ప్రపంచ స్థాయిలో సమానమైన వ్యాపార కళాశాల స్థాపన జరగాలని వ్యవస్థాపకులు భావించారు. ఒక సంవత్సరం లోపే, ఎగ్జిక్యూటివ్ బోర్డ్ ఏర్పడి, వార్టన్ స్కూల్, కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషనల్ కౌన్సిల్‌లతో కలిసి అంతర్జాతీయ అకడమిక్ కమిటీ ఏర్పడింది. కొంతకాలం తర్వాత లండన్ బిజినెస్ స్కూల్ కూడా ఈ బోర్డులో భాగస్వామ్యం అయినది. మొదటి పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాం 2001లో 128 మంది విద్యార్థులతో ప్రారంభించబడింది, తర్వాత ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది.భారతదేశంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాపార కళాశాలను తమ రాష్ట్రాలలో (మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు) ప్రారంభించాలని వ్యాపారవేత్తలను కోరారు. అన్ని వసతులను పరిశీలించిన వ్యాపారవేత్తల బృందం అన్ని పరిశీలించి, చివరకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో స్థాపనకు స్వాగతించి, సరిఅయిన వసతులు కల్పించడంతో ఎట్టకేలకు 1999 సంవత్సరంలో క్యాంపస్ భవనాలకు శంకుస్థాపన జరిగింది.[6][7]
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ కు రెండు క్యాంపస్ లు ఉన్నాయి, హైదరాబాద్ లో 260 ఎకరాల స్థలంలో, పంజాబ్ రాష్ట్రము లోని మొహాలీలో 70 ఎకరాల స్థలంలో ఉన్నాయి. ఇక్కడ చేరిన విద్యార్థులకు క్యాంపస్ వసతి ఉంది.[8]
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ ఎస్ బి) లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్ మెంట్ (పిజిపి) ప్రపంచవ్యాప్తంగా టాప్ ర్యాంక్ కలిగిన ఒక సంవత్సరం మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్. ప్రపంచంలోని అత్యుత్తమ బి-స్కూల్స్ లో పరిగణించబడే ఐ ఎస్ బి యువ మేనేజర్లకు క్రమశిక్షణా దృక్పథాలు, ప్రపంచ వ్యాప్తంగా పారిశ్రామిక రంగాలలో జరుగుతున్న మార్పులలో వారికీ అత్యాధునిక పరిశోధనతో, ప్రపంచంలోని అత్యుత్తమ అధ్యాపకులు బోధించే విస్తృతంగా ప్రశంసలు పొందిన పాఠ్యప్రణాళికతో వ్యాపార నిర్వహణ నైపుణ్యాలను పెంపొందించడానికి ఈ కార్యక్రమం రూపొందించబడింది.[9]
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (హైదరాబాద్, మొహాలీ), అధికారికంగా ఎంబిఎల సంస్థ (అంబాఎ) నుండి అక్రిడిటేషన్ పొందింది, దీనితో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ అంబాఎ, ఈక్యూఎస్, అసోసియేషన్ టు అడ్వాన్స్ కాలేజియేట్ స్కూల్స్ ఆఫ్ బిజినెస్ (ఎఎసిఎస్ బి) నుండి అక్రిడిటేషన్ల 'ట్రిపుల్ క్రౌన్' సాధించిన ప్రపంచంలోని 100వ కళాశాలగా నిలిచింది. ట్రిపుల్ అక్రిడిటేషన్, దీనిని 'ట్రిపుల్ క్రౌన్' అక్రిడిటేషన్ అని కూడా అంటారు, ఇది ప్రపంచవ్యాప్తంగా కేవలం 100 బిజినెస్ స్కూల్స్ (ప్రపంచంలోని అన్ని స్కూళ్లలో 1% కంటే తక్కువ) కలిగి ఉన్న అక్రిడిటేషన్ ల కలయిక, ఇది మూడు అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన అక్రిడిటేషన్ సంస్థల చే ప్రదానం చేయబడుతుంది.[10]
2001 డిసెంబరు 2న నాటి ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి హైదరాబాదులో ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్ బీ) ప్రారంభించగా 20వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా 2022 మే 26న హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఈ సంస్థలో ఇప్పటివరకు 50 వేల మంది నిష్ణాతులుగా పట్టాలు పొందారని అన్న ఆయన ఆసియాలో ఉన్నత బిజినెస్ స్కూల్స్ లో ఇది ఒకటి అని కొనియాడారు. ఐఎస్‌బీ 20వ వార్షికోత్సవ చిహ్నాన్ని ఆయన ఆవిష్కరించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐఎస్‌బీ స్కాలర్లకు ఎక్సలెన్స్, లీడర్‌షిప్ అవార్డులు ప్రదానం చేశారు.[11]
కృష్ణమూర్తి వెంకట సుబ్రమణియన్: భారత ప్రభుత్వ మాజీ ఆర్థిక సలహాదారు ఈ విద్యాలయంలో ఆర్థికశాస్త్ర బోధకుడిగా పనిచేస్తున్నాడు.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)