ఇందిరా తివారీ | |
---|---|
![]() | |
జననం | భోపాల్, మధ్యప్రదేశ్ |
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2011–ప్రస్తుతం |
ఇందిరా తివారి భారతీయ నటి. ఆమె హిందీ భాషా చిత్రాలైన ఆరక్షన్ (2011), నజర్‌బంద్ (2020), సీరియస్ మెన్ (2020), గంగూబాయి కతియావాడి (2022) వంటి వాటితో ప్రసిద్ధిచెందింది.
ప్రకాష్ ఝా 2011 బాలీవుడ్ చిత్రం ఆరక్షన్‌లో విద్యార్థి పాత్రను పోషించడం ద్వారా ఆమె తన నటనా జీవితాన్ని ప్రారంభించింది. ఆమె తర్వాత ఏకాంత్, ది మ్యాన్‌లియెస్ట్ మ్యాన్, అన్‌ఫెయిర్, రిటర్న్ టు సిండర్ మొదలైన లఘు చిత్రాలలో నటించింది.
2020లో, ఆమె సుమన్ ముఖోపాధ్యాయ దర్శకత్వం వహించిన నాజర్‌బంద్‌లో నటించింది. ఈ చిత్రం బెంగాలీ నవలా రచయిత, కవయిత్రి ఆశాపూర్ణా దేవి కథ ఆధారంగా వచ్చింది.[1][2][3] అదే సంవత్సరం, దర్శకుడు సుధీర్ మిశ్రా నెట్‌ఫ్లిక్స్ ఒరిజినల్ సీరియస్ మెన్‌లో నవాజుద్దీన్ సిద్ధికితో కలిసి ఆమె మహిళా ప్రధాన పాత్ర పోషించింది.[4][5][6][7]
హుస్సేన్ జైదీ రచించిన మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై పుస్తకం ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వం వహించిన 2022 చిత్రం గంగూబాయి కతియావాడిలో ఆమె ప్రముఖ పాత్రను పోషించింది.[8][1]
సంవత్సరం | సినిమా | పాత్ర | నోట్స్ |
---|---|---|---|
2011 | ఆరక్షన్ | తబేలా టాపర్ స్టూడెంట్ | |
2014 | ఏకాంత్ | రీనా | షార్ట్ ఫిల్మ్ |
2016 | ది మ్యాన్లీయెస్ట్ మ్యాన్ | సరళ (కారియా భార్య) | షార్ట్ ఫిల్మ్ |
2017 | అన్ఫేయిర్ | ఆయేషా | షార్ట్ ఫిల్మ్ |
2019 | రిటర్న్ టు సిండర్ | ఆన్ | షార్ట్ ఫిల్మ్ |
2020 | సీరియస్ మెన్ | ఓజా మణి | |
నాజర్‌బాండ్ | వాసంతి | ||
2022 | గంగూబాయి కతియావాడి | కమ్లీ | |
2022 | బెడ్ స్టోరీస్ | జావేద | వెబ్ సిరీస్ |