ఇచ్చోడ

ఇచ్చోడ
ఇచ్చోడ is located in తెలంగాణ
ఇచ్చోడ
ఇచ్చోడ
తెలంగాణ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: 19°25′40″N 78°27′12″E / 19.427847°N 78.453405°E / 19.427847; 78.453405
రాష్ట్రం తెలంగాణ
జిల్లా ఆదిలాబాద్ జిల్లా,
మండలం
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్
ఎస్.టి.డి కోడ్
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో జరిగిన ఆదివాసి కళా జాతర కార్యక్రమంలో కళాకారులు

ఇచ్చోడ, తెలంగాణ రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా, ఇచ్చోడ మండలంలోని గ్రామం.[1] ఇది జనగణన పట్టణం.[2] 2016 అక్టోబరు 11 న చేసిన తెలంగాణ జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ గ్రామం పాత ఆదిలాబాద్ జిల్లా లోని ఇదే మండలంలో ఉండేది.[3]

వ్యవసాయం, పంటలు

[మార్చు]

ఇచ్చోడ మండలంలో వ్యవసాయ యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 14464 హెక్టార్లు, రబీలో 452 హెక్టార్లు. ప్రధాన పంటలు ప్రత్తి, జొన్నలు, కందులు, కూరగాయల పంటలు, గోధుమ.[4]

చరిత్ర

[మార్చు]

ఇచ్చోడకు ఆ పేరు రావడానికి గల కారణం అక్కడ నివసించే గోండులలో ఇచ్చోడకార్ సిడాం అనే వంశం వారు . తొలి యాత్రాచరిత్ర కారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ ప్రాంతాన్ని సందర్శించి తన కాశీయాత్ర చరిత్రలో భాగంగా వివరాలు నమోదుచేసుకున్నారు. దాని ప్రకారం ఈ ఊరు అప్పట్లో చాలా చిన్నగ్రామం. ఇక్కడ నుంచి ఆదిలాబాద్ షహర్‌కు వెళ్ళే మార్గంలో కడం అనే నది ఉన్నదని, చిన్న ప్రవాహమే అయినా లోతు ఎక్కువనీ, దారి చాలా అడుసుగలదని వ్రాశారు. దానిని దాటడం కష్టం కావడంతో వాతావరణ అనుకూల్యత కొరకు ప్రజలు అప్పట్లో ఈ గ్రామంలో ఆగేవారని తెలిపారు. కంపెనీ(ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వం) వారి టపా కూడా ఇక్కడ రెండు మూడు రోజులు వాతావరణ అనుకూల్యత కోసం ఆగేదని ఆయన వివరించారు.[5]

మూలాలు

[మార్చు]
  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 221 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "Ichoda Population, Caste Data Adilabad Andhra Pradesh - Census India". www.censusindia.co.in. Archived from the original on 2020-10-08. Retrieved 2020-10-05.
  3. "ఆదిలాబాదు జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2021-03-06. Retrieved 2021-01-06.
  4. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 74
  5. వీరాస్వామయ్య, యేనుగుల (1941). కాశీయాత్రా చరిత్ర (PDF) (మూడవ ముద్రణ ed.). విజయవాడ: దిగవల్లి వెంకట శివరావు. Retrieved 26 November 2014.

వెలుపలి లంకెలు

[మార్చు]