ఈ.ఏ.ఏ ఏవియేషన్ మ్యూజియం గతంలో ఈ.ఏ.ఏ ఎయిర్ వెంచర్ మ్యూజియం (ఎయిర్ అడ్వెంచర్ మ్యూజియం) [1] అనేది చారిత్రాత్మక, ప్రయోగాత్మక విమానాల సంరక్షణ, ప్రదర్శనతో పాటు పురాతన వస్తువులు సంరక్షణ కోసం నెలకొల్పబడిన పురావస్తుశాల. ఇది విస్కాన్సిన్ లోని ఓష్ కోష్ లో నిర్మించబడింది. ఇది విట్మాన్ ప్రాంతీయ విమానాశ్రయం దగ్గరలో నిర్మింపబడింది. ఇందులో చాలా విమానాల నమూనాలు, విమానాలకు సంబంధించిన విడి భాగాలు చాలా ప్రదర్శనకు పెట్టారు. ఇందులో 20,000 కు పైగా ప్రదర్శనా వస్తువులు ఉన్నాయి.
ఈ.ఏ.ఏ వ్యవస్థాపకుడు పాల్ పోబెరెజ్నీ 1958 ఆగస్టులో ఈ.ఏ.ఏ ఎయిర్ మ్యూజియం-ఎయిర్ ఎడ్యుకేషన్ సెంటర్ ఆలోచనను ప్రతిపాదించాడు. 1970 ల చివరలో, పాల్ కుమారుడు, ఈ.ఏ.ఏ అధ్యక్షుడు టామ్ పోబెరెజ్నీ, ప్రస్తుత నవీకరించబడిన ఈ.ఏ.ఏ మ్యూజియం, ప్రధాన కార్యాలయాన్ని నిర్మించే ప్రచారానికి నాయకత్వం వహించాడు. ఇది 1983 లో అధికారికంగా ప్రారంభించబడింది.