మింజుర్ భక్తవత్సలం | |||
సా.సం 1938 లో భారత జాతీయ కాంగ్రెస్ హరిపుర సెషన్ లో భక్తవత్సలం | |||
పదవీ కాలం 2 అక్టోబరు 1963 – 6 మార్చి 1967 | |||
ప్రధాన మంత్రి | జవహర్లాల్ నెహ్రూ , లాల్ బహదూర్ శాస్త్రి , ఇందిరా గాంధీ | ||
గవర్నరు | భిష్ణురాం మేధి , జయచామరాజ వొడెయార్ బహదూర్ , పి. చంద్రారెడ్డి (ఆపద్ధర్మ), సర్దార్ ఉజ్జల్ సింగ్ (ఆపద్ధర్మ), | ||
ముందు | కె. కామరాజ్ | ||
తరువాత | సి.ఎన్.అన్నాదురై | ||
ప్రజా పనులు, ప్రణాళికా శాఖామంత్రి
(మద్రాసు రాజ్యం) | |||
పదవీ కాలం 24 మార్చి 1947 – 6 ఏప్రిల్ 1949 | |||
Premier | ఓ. పి. రామస్వామి రెడ్డియార్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | |||
మరణం | 1987 ఫిబ్రవరి 13 చెన్నై , తమిళనాడు, భారతదేశం | (వయసు 89)||
రాజకీయ పార్టీ | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | జ్ఞానసుందరాంబల్ | ||
సంతానం | సరోజినీ వరదప్పన్ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
మింజిర్ భక్తవత్సలం లేదా మింజిర్ కనకసభాపతి భక్తవత్సలం (9 అక్టోబరు 1897 – 1987 ఫిబ్రవరి 13) భారతీయ న్యాయవాది, రాజకీయనాయకుడు, భారత స్వాతంత్ర్యసమరయోధుడు. అతను 1963 అక్టోబరు 2 నుండి 1967 మార్చి 6 వరకు మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలనందించాడు. అతను తమిళనాడు రాష్ట్రానికి చివరి భారత జాతీయకాంగ్రెస్ కు చెందిన ముఖ్యమంత్రి. భక్తవత్సలం మద్రాసు రాజ్యంలో 1897 అక్టోబరు 9 న జన్మించాడు. అతను న్యాయవిద్యనభ్యసించి మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు చేసాడు. అతను పిన్న వయస్సులోనే రాజకీయాలలోకి ప్రవేశించి భారత స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొన్నాడు. అతను ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమం లలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. అతను 1937లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యాడు. రాజాజీ ప్రభుత్వంలో పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహించాడు. ఓ. పి. రామస్వామి రెడ్డియార్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా తన సేవలనందించాడు.
అతను 1950లలో భారత జాతీయ కాంగ్రెస్‌ను నాయకత్వం వహించి, మద్రాసు రాజ్యానికి 1963 నుండి 1967 వరకు ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు. 1967 ఎన్నికలలో భారత జాతీయ కాంగ్రెస్ ఓటమి తరువాత అతను రాజకీయాల నుండి పాక్షికంగా తప్పుకున్నాడు. అతను 1987 జనవరి 31న తన 89వ వయసులో మరణించాడు.
అతను సి.ఎన్.కనకసభాపతి మద్రాసు రాజ్యంలో నజరేత్ గ్రామంలోని వెల్లాలార్ కుటుంబానికి చెందిన[1] ముదలియార్, మల్లిక దంపతులకు[2] జన్మించాడు. తాను ఐదేళ్ల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి మరణించాడు. అతను తన మామయ్యలైన సి.ఎన్.ముతురంగ ముదలియార్, సి.ఎన్.ఎవలప్ప ముదలియార్ ల వద్ద పెరిగాడు.[2] అతను మద్రాసులో తన పాఠశాల విద్యను పూర్తిచేసాడు. తరువాత మద్రాసు న్యాయ కళాశాలలో న్యాయవాద విద్యనభ్యసించాడు. 1923లో గ్రాడ్యుయేషన్ అయిన తరువాత అతను మద్రాసు హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించాడు.
అతను గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడే భారత స్వాతంత్ర్యోద్యమంలో చేరాడు. అతను భారత జాతీయ కాంగ్రెస్ లో చేరి 1922లో మద్రాసు ప్రొవిన్షియల్ కాంగ్రెస్ కమిటీకి సభ్యుడైనాడు. 1926లో అతను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యునిగా తన సేవలనందించాడు. అతను "ఇండియా" అనే దినపత్రికను ప్రారంభించాడు. దానిని 1933 వరకు కొనసాగించాడు. అతను 1935, 1926 లలో జరిగిన జిల్లా బోర్డు, పురపాలక ఎన్నికల సమయంలో తమిళనాడు కాంగ్రెస్ సివిక్ బోర్డు సెక్రటరీగా ఉన్నాడు. అతను కొంతకాలం మద్రాసు మహాజన సభకు సెక్రటరీగా తన సేవలనందించాడు. అతను వేదారణ్యం సత్యాగ్రహం సమయంలో గాయపడ్డాడు. 1932లో భారత స్వాంతంత్ర్య దినోత్సవం వేడుకలను జరిపినందున 1932లో అరెస్టు చేసారు. ఆరు మాసాల పాటు జైలు శిక్షను అనుభవించాడు. 1936లో పురపాలక సంఘ ఎన్నికలలో అతను మద్రాసు సిటీ కార్పొరేషన్ కు ఎన్నికై డిప్యూటీ మేయర్ పదవిని చేపట్టాడు.
1937 ఎన్నికలలో తిరువాలూర్ నియోజకవర్గం నుండి గెలుపొంది తన 40వ యేట మద్రాసు అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు.[1] అతను రాజాజీ ప్రభుత్వంలో స్థానిక స్వపరిపాలన మంత్రిత్వశాఖలో పార్లమెంటరీ సెక్రటరీగా బాధ్యతలను నిర్వహించాడు. యునైటెడ్ కింగ్డమ్ యుద్ధ ప్రకటన తరువాత అతను ఇతర భారత జాతీయ కాంగ్రెస్ నాయకులతో పాటు రాజీనామా చేసాడు. అతను క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలు శిక్ష అనుభవించాడు. 1944లో విడుదలైన తరువాత భారత రాజ్యాంగ సభకు ఎన్నికైనాడు.
1946 లో జరిగిన మద్రాస్ అసెంబ్లీ ఎన్నికలలో భక్తివాత్సలం పోటీచేసి తిరిగి ఎన్నికైనాడు.[1] అతను ఓ. పి. రామస్వామి రెడ్డియార్ మంత్రివర్గంలో ప్రజాపనులు, సమాచారశాఖా మంత్రిగా తన సేవలనందించాడు.[3] 1952 అసెంబ్లీ ఎన్నికలలో, స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటి సారిగా భక్తివాత్సలం ఓడిపోయాడు.[1] 1957 లో, అతను శ్రీపెరంబుదూర్ సీటు గెలుచుకొని అసెంబ్లీలో ప్రవేశించాడు. అతను కామరాజ్ మంత్రివర్గంలో హోం మంత్రిగా నియమించబడ్డారు.
1962 లో, భారత జాతీయ కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికలలో గెలిచింది. 25 సంవత్సరాలలో ఐదవసారి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శ్రీపెరంబదూర్ నియోజవర్గంలో అతను తిరిగి ఎన్నికై మద్రాసు అసెంబ్లీలో 1963 అక్టోబరు 2న గాంధీజయంతి రోజున అడుగు పెట్టాడు. భారత జాతీయ కాంగ్రెస్ లో ఎక్కువ సమయం సేవలనందించడానికి కామరాజ్ ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన తరువాత భక్తవత్సలం ముఖ్యమంత్రి బాధ్యతలను చేపట్టాడు.[4] మద్రాస్ రాష్ట్రానికి భారత జాతీయ కాంగ్రెస్ నుండి చివరి ముఖ్యమంత్రిగా ఇప్పటివరకు భక్తవత్సలం 1967 మార్చి 6 వరకు ఉన్నాడు.[5]
1963లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు చెందిన ఎం. ఎస్. గోల్వాల్కర్ "స్వామి వెవేకానంద శత జయంతి ", వివేకానంద స్మారక శిల కమిటీలను ప్రారంభించాడు. వీటికి ఏక్నాథ్ రనాడేను సెక్రటరీగా నియమించాడు.[6] ఈ కమిటీ ప్రధాన ఉద్దేశం కన్యాకుమారిలో వివేకానంద శతజయంతి సందర్భంగా అతని గౌరవార్థం రాతి స్మారకాన్ని నిర్మించడం.[6] ముఖ్యంత్రి భక్తవత్సలం, కేంద్ర మంత్రి హుమయూన్ కబీర్ వెహెమెంట్లీ దీనిని వ్యతిరేకించారు.[6] అయినప్పటికీ రనాడే 323 పార్లమెంటు సభ్యుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని సమర్పించినందున ఈ స్మారక నిర్మాణానికి ఒప్పుకున్నాడు.[7]
అతను ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలంలో మద్రాసు రాష్ట్రంలో తీవ్ర హిందీ ఉద్యమాలు జరిగాయి.[8] భక్తవత్సలం భారత ప్రభుత్వం నిర్భంధ భాషగా హిందీని పరిచయం చేయాలనే నిర్ణయాన్ని బలపరిచాడు. కళాశాలలో తమిళ భాషా మాధ్యమాన్ని ఉంచాలనే డిమాండ్ ను వ్యతిరేకించాడు.[9] 1964 మార్చి 7న మద్రాసు శాసనసభలో అతను త్రిభాషా సూత్రంగా ఆంగ్లం, హిందీ, తమిళ భాషలు ఉందాలని ప్రతిపాదించాడు.[10][11]
26 జనవరి 1965 నాటికి, భారత పార్లమెంటు సిఫార్సు చేసిన 15 సంవత్సరాల సుదీర్ఘ కాలం గడువు ముగిసిన రోజు, పోలీస్ చర్యలు, ప్రమాదాలకు దారితీసిన ఆందోళనలు తీవ్రతరం అయ్యాయి.[11] ఆరుగురు ఆందోళనకారులు (చిన్నస్వామి, శివలింగం, అరంగనాథన్, వీరప్పన్, ముత్తు, సారంగపాణి) ఆత్మాహుతి చేసుకున్నారు. ముగ్గురు (దండపాణి, ముత్తు, షణ్ముగం) లు విషం తీసుకున్నారు. 1965 జనవరి 27న ఆందోళన కారులపై జరిగిన పోలీసుల కాల్పుల్లో 18 సంవత్సరాల ఉద్యమకారుడు రాజేంద్రన్ మరణించాడు.[9]
1965 హిందీ వ్యతిరేక ఆందోళనలో ప్రభుత్వ ఆస్థుల విధ్వంసానికి, హింసకు ద్రవిడ మున్నేట్ర ఖజగం, వామపక్ష పార్టీలు బాధ్యులని భక్తవత్సలం 1965 ఫిబ్రవరి 13న ఆరోపించాడు.[12]
జనవరి 2015న తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధిపతి ఇ. వి. కె. ఎస్. ఎలంగోవన్ అనేకమంది వ్యతిరేక నిరసనకారులను చంపబడటానికి భక్తివాత్సలాన్ని నిందించాడు. అంతేకాకుండా, పి.డి.ఎస్ లో సబ్సిడీ బియ్యం పంపిణీని ముగించడంపై నిందించాడు.[13]
భక్తవత్సలం తన 89వ యేట మరణించాడు.[14] అతని సమాధి గుయిండీలోని కామరాజ్ సమాధి వద్ద నెలకొల్పారు.
తమిళనాడులోని ప్రముఖ రాజకీయ కుటుంబంతో అతని వివాహానికి సంబంధం ఉంది. భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయనాయకుడు, కేంద్రమంత్రి ఓ. వి. అలగేశన్, మద్రాసు రాజ్య పూర్వ ముఖ్యమంత్రి పి. టి రాజన్ అతని బంధువులు.[15] భక్త వత్సలం కుమార్తె సరోజినీ వరదప్పన్ రామాజిక కార్యకర్త. అతని మనుమరాలు జయంతి నటరాజన్ రాజకీయ నాయకురాలు, భారత జాతీయ కాంగ్రెస్ రాజకీయ నాయకురాలు.[8][15]
రాజకీయ కార్యాలయాలు | ||
---|---|---|
అంతకు ముందువారు కె.కామరాజ్ |
మద్రాసు ముఖ్యమంత్రి 2 October 1963 – 6 March 1967 |
తరువాత వారు సి. ఎన్. అన్నాదురై |