ఎన్.జి.కె. | |
---|---|
దర్శకత్వం | సెల్వరాఘవన్ |
రచన | సెల్వ రాఘవన్ |
నిర్మాత | ఎస్ ఆర్ ప్రభు , కేకే రాధా మోహన్ |
తారాగణం |
|
ఛాయాగ్రహణం | శివకుమార్ విజయన్ |
కూర్పు | కె.ఎల్. ప్రవీణ్ |
సంగీతం | యువన్ శంకర్ రాజా |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ వారియర్ పిక్చర్స్ |
పంపిణీదార్లు | రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ |
విడుదల తేదీ | 31 మే 2019 |
సినిమా నిడివి | 148 నిముషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
ఎన్.జి.కె. 2019లో వచ్చిన పొలిటికల్ థ్రిల్లర్ సినిమా. సూర్య, సాయి పల్లవి, రకుల్ ప్రీత్ సింగ్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి సెల్వరాఘవన్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా 2019, మే 31న విడుదలైంది. ఈ చిత్రాన్ని తమిళం, తెలుగు, మలయాళంలో విడుదల చేశారు.[1][2]
నంద గోపాల కృష్ణ అలియాస్ ఎన్జీకే (సూర్య) అగ్రికల్చరల్ ఇంజినీరింగ్లో ఎంటెక్ పూర్తి చేస్తాడు. మంచి ఉద్యోగంలో చేరినా దానిలో సంతృప్తి లేకపోవడంతో సొంతూరికి వచ్చి సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్) చేస్తాడు. కొంత మంది స్నేహితులతో కలిసి దీనిపై రైతుల్లో అవగాహన కల్పిస్తూ ఉంటాడు. ఎన్జీకే చేసే పని నచ్చక కొంత మంది పురుగుల మందు వ్యాపారులు, వడ్డీ వ్యాపారులు, కూరగాయల వ్యాపారులు కలిసి అతనికి వార్నింగ్ ఇస్తారు. వెంటనే ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ఆపేయాలని హెచ్చరిస్తారు. దీంతో ఎన్జీకే స్థానిక ఎమ్మెల్యే పెంచలయ్య సాయం కోరతాడు. ఎన్జీకేకు ఊళ్లో మంచి పలుకుబడి ఉండటంతో తన సహాయానికి ప్రతిఫలంగా పార్టీలో చేరాలని ఎన్జీకేకు పెంచలయ్య షరతు పెడతాడు. ఒక కార్యకర్తగా మొదలై పార్టీలో బలమైన నాయకుడిగా సూర్య ఎలా ఎదగగలిగాడు? తన ఎత్తులతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎలా అయ్యాడు అనేది కథ.[3]
ఈ చిత్రానికి సంగీతం యువన్ శంకర్ రాజా అందించగా, శ్రేయ ఘోషాల్, సిద్ శ్రీరామ్, రంజిత్, హేమాంబిక పాటలు పాడారు.[4]
సం. | పాట | పాట రచయిత | గాయని \ గాయకులు | పాట నిడివి |
---|---|---|---|---|
1. | "‘వడ్డీలోడు వచ్చెనే" | చంద్రబోస్ | సత్యం | 03:38 |
2. | "‘తిరగబడు తిరగబడు’" | చంద్రబోస్ | జితిన్ రాజ్ | 03:56 |
3. | "‘ప్రేమా ఓ ప్రేమా’" | చంద్రబోస్ | సిడ్ శ్రీరామ్, హేమాంబిక | 04:30 |
4. | "‘అణచివేసిన’" | రాజేష్ ఎ.మూర్తి | శరత్ సంతోష్ | 02:04 |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite news}}
: |archive-date=
requires |archive-url=
(help)
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)