ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల | |
---|---|
తెలంగాణ ప్రభుత్వం | |
భౌగోళికం | |
స్థానం | ఎర్రగడ్డ, హైదరాబాదు, తెలంగాణ, భారతదేశం |
వ్యవస్థ | |
ఆరోగ్య సంక్షేమ వ్యవస్థ | ప్రజా |
రకాలు | ప్రత్యేకం |
[యూనివర్సిటీ అనుబంధం | కాళోజి నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం |
Services | |
అత్యవసర విభాగం | అవును |
పడకలు | 600 |
చరిత్ర | |
ప్రారంభమైనది | 1895 |
లింకులు | |
వెబ్సైటు | అధికారిక వెబ్సైటు |
ఎర్రగడ్డ ప్రభుత్వ మానసిక వైద్యశాల, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులోని ఎర్రగడ్డ ప్రాంతంలో ఉన్న మానసిక అసుపత్రి. నిజాం పాలనలో హైదరాబాద్ రాష్ట్రంలో స్థాపించబడిన పురాతన ఆరోగ్య సంస్థల్లో ఇదీ ఒకటి.[1] తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ఈ ఆసుపత్రి, రాష్ట్రం నలుమూలల నుండి వచ్చే మానసిక ఆరోగ్య రోగులకు సేవలు అందిస్తోంది. 600 పడకలతో ఉన్న ఈ బోధనాసుపత్రి కాళోజీ నారాయణరావు పరిధిలో నిర్వహించబడుతోంది.
దారుల్-మజనీన్ అంటే మానసిక ఆశ్రయంగా స్థాపించబడిన ఈ ఆసుపత్రి చంచల్‌గూడ సెంట్రల్ జైలులో ప్రారంభించబడింది. 1895-1907 సమయంలో అప్పట్లో నిజాం ఆధిపత్యంలో భాగంగా ఉన్న మహారాష్ట్రలోని జల్నాకి 400 పడకలతో మార్చబడింది. అప్పుడు, మానసిక వ్యాధుల కోసం ఆసుపత్రి, జల్నాగా పేరు మార్చబడింది.[2]
హైదరాబాద్ రాష్ట్రం (1948-56) ఏర్పడిన తర్వాత, జల్నా మహారాష్ట్రలో విలీనంకావడంతో 1953లో ఈ సంస్థ హైదరాబాద్‌కు మార్చబడింది. మొదట్లో ఇది కస్టోడియల్ కేర్ ఆశ్రయంగా ప్రారంభమైంది. జాల్నా ఆసుపత్రికి ప్రభుత్వ చివరి సూపరింటెండెంట్ గా, ఎర్రగడ్డ ఆసుపత్రికి మొదటి సూపరింటెండెంట్ గా డాక్టర్ ఆర్. నటరాజన్ పనిచేశాడు.
70వ దశకంలో ఇన్‌స్టిట్యూట్ హోదాను పొందింది, సైకియాట్రీలో ఉన్నత, గ్రాడ్యుయేట్ శిక్షణతోపాటు 2000లో పరిశోధన నోడల్ సెంటర్‌గా మారింది. నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ (1982) అమలుకు ముందు మెదక్‌లోని శంకర్‌పల్లిలో ఈ సంస్థ కమ్యూనిటీ హెల్త్ సర్వీసెస్‌ను 1980లో ప్రారంభించింది.[3]
ఇందులో ఔట్ పేషెంట్, ఇన్‌పేషెంట్, ఎమర్జెన్సీ, అక్యూట్ సైకియాట్రిక్ కేర్, డి-అడిక్షన్, సైకలాజికల్ కౌన్సెలింగ్, లేబొరేటరీ, రేడియోలాజికల్ సేవలు ఉన్నాయి. శంకర్‌పల్లిలో కమ్యూనిటీ ఆధారిత సేవలు, వివిధ గృహాలలో వృద్ధులు, వికలాంగుల కోసం మానసిక ఆరోగ్య క్లినిక్‌లు నిర్వహించబడుతున్నాయి.[4]
నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ లో భాగంగా 2006లో కోర్టు, క్రిమినల్ కేసుల కోసం ప్రత్యేకంగా ఉద్దేశించబడిన 150 పడకల బ్లాక్‌తో ఇది విస్తరించబడింది.[5]