ఎ. కరుణాకరన్ | |
---|---|
జననం | 1971 డిసెంబరు 25 |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | దర్శకుడు, కథారచయిత, స్క్రీన్-ప్లే |
ఎ.కరుణాకరన్ తెలుగు సినిమా దర్శకుడు. ఖదీర్, ఎన్.శంకర్ వంటి తమిళ దర్శకులకు అసిస్టంటుగా తన సినీజీవితాన్ని మొదలుపెట్టిన కరుణాకరన్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా నటించిన తొలిప్రేమ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. నేటికీ తెలుగులో ప్రేమ కథా చిత్రాలకు పేరెన్నికగల దర్శకులలో కరుణాకరన్ ఒకరిగా పేర్కొనబడుతుంటాడు.[1]
కరుణాకరన్ 1971 డిసెంబరు 25 న కేరళలో జన్మించాడు. తన పాలిటెక్నిక్ విద్య పూర్తయ్యాక సినిమా రంగంలోకి అడుగుపెట్టాడు. చిత్రలేఖనంలో ప్రావీణ్యం ఉండటం వలన కొన్నాళ్ళు వాణిజ్య ప్రకటన సంస్థలకు పార్ట్ టైమ్ పనిచేస్తూ సినిమా ఛాన్స్ కోసం ప్రయత్నించాడు.[2][3]
సంవత్సరం | చిత్రం | పాత్ర | నటీనటులు | ఇతర విశేషాలు |
---|---|---|---|---|
1998 | తొలిప్రేమ | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | పవన్ కళ్యాణ్, కీర్తి రెడ్డి | ఉత్తమ తెలుగు చిత్రం - జాతీయ పురస్కారం
నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత నంది అవార్డు - ఉత్తమ దర్శకుడు |
2000 | యువకుడు | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | సుమంత్, భూమిక | |
2001 | ముఝే కుఛ్ కెహ్నా హై | కథ | ||
2002 | వాసు | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | దగ్గుబాటి వెంకటేష్, భూమిక | |
2005 | బాలు | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | పవన్ కళ్యాణ్, శ్రియా, నేహా ఒబెరాయ్ | |
2006 | హ్యాపీ | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | అల్లు అర్జున్, జెనీలియా | |
2008 | ఉల్లాసంగా ఉత్సాహంగా | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | యశో సాగర్, స్నేహా ఉల్లాల్ | విజేత, నంది అవార్డ్ - ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత |
2010 | ఉల్లాస ఉత్సాహ | కథ | ||
డార్లింగ్ | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | ప్రభాస్, కాజల్ అగర్వాల్ | ||
2012 | ఎందుకంటే...ప్రేమంట! | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | రామ్, తమన్నా | ద్వి భాషా చిత్రం |
ఎన్ ఎండ్రు కదల్ ఎంబేన్ | ||||
2014 | చిన్నదాన నీ కోసం | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం | ||
2018 | తేజ్ ఐ లవ్ యు | కథ,స్క్రీన్ప్లే, దర్శకత్వం |