ఏవండోయ్ శ్రీవారు | |
---|---|
దర్శకత్వం | ఇ. సత్తిబాబు |
రచన | మరుధూరి రాజా (మాటలు) |
కథ | ఉదయ్ రాజ్ |
నిర్మాత | ఎం. దశరథరాజు[1] |
తారాగణం | శ్రీకాంత్, స్నేహ, నిఖిత, రమాప్రభ, శరత్ బాబు, సునీల్, కృష్ణ భగవాన్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం |
సంగీతం | శ్రీకాంత్ దేవా |
నిర్మాణ సంస్థ | |
విడుదల తేదీ | మే 12, 2006 |
భాష | తెలుగు |
ఏవండోయ్ శ్రీవారు ఇ. సత్తిబాబు దర్శకత్వంలో 2006 లో విడుదలైన కుటుంబ కథా చిత్రం. ఇందులో శ్రీకాంత్, స్నేహ, నిఖిత ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాను శ్రీరాం ఆర్ట్స్ పతాకంపై ఎం. దశరథరాజు నిర్మించాడు. మరుధూరి రాజా మాటలు రాశాడు. శ్రీకాంత్ దేవా సంగీతం అందించాడు.
సూర్య అనే వ్యక్తి ఒక అపార్టుమెంటులో అద్దెకు దిగుతాడు. అక్కడ స్వప్న అనే అమ్మాయి వెంటపడుతూ ఉంటాడు. కానీ ఆమె మాత్రం అతన్ని పెద్దగా పట్టించుకోదు. కాని సుర్యం మాత్రం పట్టుదలగా ఆమెతో మాటలు కలపాలని ప్రయత్నిస్తుంటాడు. చివరకు సంధ్య తండ్రి చంద్రశేఖర్ ను కూడా కలుస్తాడు. కానీ సంధ్య మాత్రం స్పందించదు. చివరకి సూర్య తనకు కావలసింది చంద్రశేఖర్ అని చెబుతాడు. అందుకు కారణమైన తన గతాన్ని వివరిస్తాడు. చంద్రశేఖర్ తన కూతురు దివ్య ప్రేమ కుటుంబాన్ని ఎదిరించి సూర్యని వివాహం చేసుకుందనే కారణంతో ఆమెను కుటుంబం నుంచి బహిష్కరిస్తాడు. తర్వాత ఆమె ప్రమాదవశాత్తూ మరణిస్తుంది. ఆమె చివరి కోరికగా తన కొడుకును తండ్రి పెంపకంలో పెరగాలని కోరుకుంటుంది. అందుకోసం చంద్రశేఖర్ ని ఎలాగైనా ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు.