ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహం

IRNSS-1G
మిషన్ రకంNavigation
ఆపరేటర్ఇస్రో
COSPAR ID2016-027A Edit this at Wikidata
SATCAT no.41469Edit this on Wikidata
మిషన్ వ్యవధి12 years
అంతరిక్ష నౌక లక్షణాలు
బస్I-1K
తయారీదారుడుISRO Satellite Centre
Space Applications Centre
లాంచ్ ద్రవ్యరాశి1,425 కిలోగ్రాములు (3,142 పౌ.)
శక్తి1,300 W[1]
మిషన్ ప్రారంభం
ప్రయోగ తేదీ28 April 2016 12:50 IST
రాకెట్PSLV-XL C33
లాంచ్ సైట్సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం (First)
కాంట్రాక్టర్ISRO
కక్ష్య పారామితులు
రిఫరెన్స్ వ్యవస్థGeocentric
రెజిమ్Sub-Geosynchronous Transfer Orbit (sub-GTO)
Perigee altitude284 కి.మీ. (176 మై.)[1]
Apogee altitude20,657 కి.మీ. (12,836 మై.)[1]
 

ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహంను భారతదేశపు ప్రతిష్తాత్మక మైన అంతరిక్ష ప్రయోగ సంస్థ క్లుప్తంగా ఇస్రో రూపకల్పన చేసి తయారు చేసింది. అంతరిక్షం నుండి జలయాన, భూయాన, ఆకాశ/వాయుయాన వాహనాలను పర్యవేక్షించుటకు, నియంత్రించుటకు, మార్గదర్శన కావించుటకు అమెరికాకు జీపీఎస్, రష్యాకు గ్లోనాన్, ఐరోపాకు గెలిలీయో, చైనాకు బేయ్‌డోన్, జపాన్కు క్రాసీ జెనిత్ నావిగేసన్ వ్యవస్థలు ఉన్నాయి. అదే తరహాలో భారతదేశం కూడా తన ప్రాదేశికప్రాంతం పైన అంతరిక్షంనుండి పర్యవేక్షించు, నియంత్రించు, మార్గదర్శన కావించు స్వంత నావెగేసన్/దిక్చూచి వ్యవస్థను కల్గి ఉండు ఉద్దేశంతో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ (భారతీయ క్షేత్రియదిక్చూచి ఉపగ్రహ వ్యవస్థ-Indian Regional navigation satellite syastem:IRNSS) ప్రణాలికను రూపొందించారు. స్వంత నావెగెసన్ వ్యవస్థ అవసరాన్ని 2006 లోనే ఇస్రో గుర్తించింది. ఈ ప్రణాళిక క్రింద భారతదేశానికి సంబంధించి 1500 కి.మీ మేర అకాశ, జల,, భూమార్గాలలో క్షేత్రియదిక్చూచి ఉపగ్రహ వ్యవస్థ కల్గిఉండుటకై మొత్తం 7 నావిగేసన్ ఉపగ్రహాలను అంతరిక్షంలో వివిధ క్షక్యలలో ప్రవేశపెట్టూటకై నిర్ణయించారు. ఇస్రో సంస్థ ఈ ఏడు నావిగేసన్ ఉపగ్రహాలను తయారు చేయుటకు, వాటిని తాము రూపొందించిన పిఎస్‌ఎల్‌వి శ్రేణికి చెందిన XLరకపు ఉపగ్రహ వాహక నౌక లద్వారా నిర్దేసిత కక్ష్యలో ప్రవేశపెట్టు గురుతర బాధ్యతను తన భుజస్కందాలమీదకు తీసుకున్నది. ఇప్పటి వరకు ఇస్రో భారతీయ క్షేత్రియదిక్చూచి ఉపగ్రహ వ్యవస్థకు చెందిన ఆరు ఉపగ్రహాలను విజయవంతంగా క్షక్యలో ప్రవేశపెట్టీనది. ఆవరుసలో ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహం చివరి ఏడవ ఉపగ్రహం. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో రూపొందించిన పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహ వాహకనౌక ద్వారా క్షక్ష్యలో ప్రవేశపెట్టూకై నిర్ణయించారు.[2]

భారతీయ క్షేత్రియదిక్చూచి ఉపగ్రహ వ్యవస్థను 3,425 కోట్లతో అభివృద్ధి పరచారు. ఇందులో ఉపగ్రహాల నిర్మాణానికి 1000 కోట్లు, ఉపగ్రహాలను క్షక్యలో ప్రవేశపెట్టు వాహకనౌకలనిర్మాణనికి 1125 కోట్లవరకు ఖర్చు అంచనాతో ఈ ప్రణాళికను 2013 లో ప్రారంభించారు. తుది దశచేరుకొనేటప్పటికి ఖర్చు పెరిగినట్లు తెలుస్తునది. ఈ భారతీయ క్షేత్రియదిక్చూచి ఉపగ్రహ వ్యవస్థను ప్రత్యక్షంగా నియంత్రించుటకు కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు సమీపంలో బైలాలు ప్రాంతంలో గ్రౌండ్ స్టేషను నిర్మాణం చేపట్టారు.దీని ఖర్చు 1300కోట్లు. ఏడూపగ్రహాలు అంతరిక్షక్ష్యలో పనిచెయ్యడం మొదలైతే స్వదేశీ అంతరిక్ష ఉపగ్రహ దిక్చూచి వ్యవస్థ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చి భూమార్గ, జలమార్గ, ఆకాశ/వాయుమార్గాల స్థితిగతులు, దిక్కులుతెలియ జేయడం, ఆపద సమయంలోసమాచాచరం అందించడం, భూగోళానికి సంబంధించిన సమాచారం, వాహనచోదకులకు దిశానిర్దేశం, ఇంటర్నెట్‌తో అనుసంధానం వంటి ఎన్నోసౌకర్యాలు అందుబాటులోకి వస్తాయి. అదేవిధంగా భారతవిమానయాన, నౌకయాన మార్గాలకు ఈ ఉపగ్రహవ్యవస్థ దోహదపడుతుంది. భారతదేశం అంచునుంచి సుమారు 1500 కిలోమిటర్ల పరిధి దాకాఈ సేవలు విస్త్రరించి సొంత దిక్సూచి వ్యవస్థ అందుబాటులోకి వచ్చును[2]

ఇప్పటివరకు ప్రయోగించిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ ఉపగ్రహాలు

[మార్చు]

IRNSS-1A ఉపగ్రహాన్ని పిఎస్‌ఎల్‌వి-సీ22 ఉపగ్రహవాహక నౌకద్వారా 2013 జూలైలో, IRNSS-1B ఉపగ్రహన్ని పిఎస్‌ఎల్‌వి-సీ24 ఉపగ్రహవాహక నౌకద్వారా ఏప్రిల్‌2014లో, IRNSS-1C ని పిఎస్‌ఎల్‌వి-సీ26 ఉపగ్రహవాహక నౌక ద్వారా 2014 అక్టోబరులో,, IRNSS-1D ఉపగ్రహన్ని పిఎస్‌ఎల్‌వి-సీ27 ఉపగ్రహవాహక నౌకద్వారా 2015 మార్చిలో, పిఎస్‌ఎల్‌వి-సీ31 ఉపగ్రహవాహకనౌక ద్వారా. 2016 జనవరి 20న IRNSS-1E ఉపగ్రహాన్ని శ్రీహరికోట లోని ధావన్ అంతరిక్షప్రయోగ కేంద్రం నుండి ప్రయోగించారు.ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహన్ని గురువారం,10.03.2016 న సాయంత్రం 4:01 గంటలకు పిఎస్‌ఎల్‌వి-సీ32 ఉపగ్రహ వాహకనౌక ద్వారా నింగిలోకి పంపారు.

ఉపగ్రహ వివరాలు

[మార్చు]

తాజాగా అంతరిక్షములోకి పంపిన ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహం బరువు 1425కిలోలు.ఇందులో ఇంధనం బరువు 827 కిలోలు.ఇది 12 ఏళ్లపాటు సేవలు అందిస్తుంది.ప్రాంతీయ దిక్సూచి వ్యవస్థలో ఇది ఆరో ఉపగ్రహం.ఇందులో దిక్సూచి, రేజి౦గ్ కు సంబంధించినపెలోడ్లతో (ఉపకరణాలు) పాటుఅత్యంత కచ్చితమైన రుబీడియం పరమాణు గడియారం ఉంది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్-1ఎఫ్ ఉపగ్రహం వ్యయం 120 కోట్లు[3]

ఉపగ్రహంలోని ఉపకరణాలు/పేలోడు

[మార్చు]

ఉపగ్రహం రెండురకాల ఉపకరణాల సమూదాయాన్నికలిగిఉన్నది. అందులో ఒకటి దిక్సూచి (navigation payload) సంబంధించింది. రెండవది రెంజింగ్ (ranging) ఉపకరణాలు కలిగి ఉన్నాయి.నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు కలిగిన విభాగం ఓడల/నౌకల, విమాన తదితర యానాలకు సంబంధించిన దిక్సూచి సమాచారాన్ని వినియోగదారులకు పంపిణి చేస్తుంది.నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలు L5- బ్యాండ్ (1176.45MHZ), S-బ్యాండ్ (2492.028 MHZ ) లో పనిచేయును. నావిగేసన్ కు సంబంధించిన ఉపకరణాలలో అత్యంత కచ్చితమైన సమయాన్ని చూపించు రుబీడియం పరమాణు గడియారం అమర్చబడినది.[4]

రెంజింగ్ (ranging) ఉపకరణాలభాగం C-బ్యాండ్ ట్రాన్స్‌పాండరును కల్గి, ఉపగ్రహం యొక్క కచ్చితమైన రేంజి తెలుపుతుంది.ఇది భూమిపై దిశానిర్దేశం అందించగల ప్రాంత పరిధిని నిర్ధారిస్తుంది. లేజరు రెంజింగుకై కార్నర్ క్యూబ్ రెట్రోరేఫ్లేక్టరును ఐఆర్ఎన్ఎస్ఎస్-1ఈలో పొందుపరచారు.ఉపగ్రహం రెండు వైపుల రెండు సౌరపలకలను అమర్చారు. ఇవి 1660 వ్యాట్ ల విద్యుత్తును ఉత్పత్తి చెయ్యును. దీనికి 90 అంపియర్ అవర్ సామర్ధ్యమున్న లిథియం-అయాన్ బ్యాటరిని అనుసంధానించారు. ఉపగ్రహం 440 న్యూటను శక్తిగల అపోజి మోటరును, 22 న్యూటను శక్తిగల 12 త్రస్టరులను కలిగి ఉన్నది.[4]

ప్రయోగ వివరాలు

[మార్చు]

ఉపగ్రహాన్ని గురువారం మధ్యాహ్నము 12:50 నిమిషాలకు పిఎస్‌ఎల్‌వి-సీ33 ఉపగ్రహం ద్వారా కక్ష్యలోకి పంపారు.ఉపగ్రహం ప్రయోగ వేదిక నుండి బయలు దేరిన 20నిమిషాల19 సెకన్ల్క తరువాత ఉపగ్ర్హం నిర్దేశిత భూస్థిర బదిలీ కక్ష్యలో ప్రవేశపెట్ట బడింది. కౌంట్‌డౌన్ ముగిసిన తక్షణం వాహకనౌక నిప్పులు కక్కుతూ గగనమండలం వైపు దూసుకెల్లింది.44.4 మీటర్ల పొడవు,320టన్నుల బరువు ఉన్న ఉపగ్రహ వాహకనౌక తనప్రయాణంలో ఏతువంటి వడిదుడుకులు లేకుండా తనలక్ష్యం వైపు దూసుకెళ్ళి, నాలుగుదశల దహనక్రియ విజయవంతంగా అనుకున్నట్లుగా జరిగి, రాకెట్ నిర్దేశించిన మార్గంలో, వేగంతో పయనం సాగించి, 20నిమిషాల 19 సెకన్లకు 1425 కిలోల బరువున్న ఐఆర్‌ఎన్ఎస్‌ఎస్-1జీ ఉపగ్రహాన్ని అనుకున్న భూస్థిర బదిలీ కక్ష్యలో దిగ్విజయంగా ప్రవేశపెట్టినది.మొదటిదశ దహన క్రియ 110 సెకన్లలో, రెండవదశ 262 సెకన్లలలో, మూడవదశ 663 సెకన్లలలో చివరి నాల్గవదశ దహన క్రియ1,182 సెకన్లలలో పూర్తయింది. వాహకనౌక ఉపగ్రహాన్ని 286 కిలోమీటర్ల పెరిజీ (భూమికి దగ్గరి దూరం),20,657 కిలోమీటర్ల అపోజీ (భూమి నుండి దూరంగా) దూరంలో దీర్ఘవృత్తాకార భూస్థిర బదిలీ కక్ష్యలో, 17.82 డిగ్రీల వాలులో ఉపగ్రహం తన ప్రదక్షణ/భ్రమణం సాగిస్తున్నది.[5]

ఉపగ్రహంలో ఉన్న 827 కిలోల ద్రవ ఇంధానాన్ని అపోజీ మోటర్లద్వారా దశలవారిగా మండించి, ఉపగ్రహాన్ని భూమికి 36 కిలోమీటర్ల ఎత్తులో భూస్థిర కక్ష్యలో ప్రవేశపెట్టెదరు.ఇందుకు కనీసం ఏడురోజుల సమయం అవసరం.

ఉపయోగాలు

[మార్చు]

ఈ చివరి ఏడవ ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశ పెట్టడం ద్వారా మరో రెండు నెలలలో పూర్తిస్థాయిలో భారతదేశ జీపియస్ వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది.ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్ వ్య్వస్థ వలన సెల్‌పోన్లు, ఇతర పరికరాలద్వారా నావిగేసన్ సౌకర్యాలు అందుబాటులోకి రావడం తోపాటు వైమానిక, నౌకయాన రంగాలకు రక్షణ, పౌర సేవలకు ఈఈ భారతీయ ప్రాంతీయ/క్షేత్రియ ఉపగ్రహదిక్చూచి వ్యవస్థ ఎంతో సహాయకారి కాగలదు.

ఇవికూడా చూడండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 "PSLV-C33 - IRNSS-1G Specifications" (PDF). ISRO. Archived from the original (PDF) on 25 ఏప్రిల్ 2016. Retrieved 28 April 2016.
  2. 2.0 2.1 "ఇక స్వంత దిక్చూచి వ్యవస్థ". shkashi.com. Archived from the original on 2016-04-27. Retrieved 2016-04-27.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  3. ఈనాడుదినపత్రిక,11,మార్చి2016
  4. 4.0 4.1 "IRNSS-1F". isro.gov.in. Archived from the original on 2017-07-31. Retrieved 2016-03-18.
  5. "రెండు నెలల్లో మన జీపీయస్". sakshi.com. 2016-04-29. Archived from the original on 2016-04-29. Retrieved 2016-04-29.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)