ఓం శివపురి | |
---|---|
జననం | |
మరణం | 1990 అక్టోబరు 15 | (వయసు 52)
క్రియాశీల సంవత్సరాలు | 1964–1990 |
జీవిత భాగస్వామి | సుధా శివపురి |
పిల్లలు | రీతు శివపురి వినీత్ శివపురి |
ఓం శివపురి (1938 జూలై 14 - 1990 అక్టోబరు 15) ఒక భారతీయ థియేటర్ నటుడు, దర్శకుడు. ఆయన హిందీ చిత్రాలలో ప్రసిద్ధ క్యారెక్టర్ నటుడు కూడా.
న్యూఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా పూర్వ విద్యార్థి. ఆయన నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా రెపర్టరీ కంపెనీ (1964)కి మొదటి చీఫ్‌గా, దాని నటుల్లో ఒకరిగా ఉన్నాడు. ఆ తరువాత, ఆయన న్యూ ఢిల్లీలో థియేటర్ గ్రూప్ అయిన దిశంతర్‌ను స్థాపించాడు.
ఆయన మరణాంతరం, రాజస్థాన్ సంగీత నాటక అకాడమీ ప్రతి సంవత్సరం ఓం శివపురి జ్ఞాపకార్థం ఆయన వర్ధంతి సందర్భంగా నాటకోత్సవాన్ని నిర్వహిస్తుంది. ఓం శివపురి మెమోరియల్ డ్రామా ఫెస్టివల్ ఐదు రోజుల ఉత్సవం, ఇది అక్టోబరు 16న ప్రారంభమవుతుంది.[1]
పాటియాలాలో జన్మించిన ఓం శివపురి జలంధర్ రేడియో స్టేషన్‌లో పని చేయడం ద్వారా తన వృత్తిని ప్రారంభించాడు. ఆ సమయంలో సుధా శివపురి అక్కడ పనిచేస్తున్నది.[2]
ఆ తరువాత, వారు న్యూ ఢిల్లీలోని నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో చేరారు, థియేటర్ డోయెన్ ఇబ్రహీం అల్కాజీ వద్ద శిక్షణ పొందారు. 1963లో పట్టభద్రుడయ్యాక, వారు కొత్తగా ఏర్పడిన ఎన్ఎస్డి రిపర్టరీ కంపెనీలో నటులుగా చేరారు. ఓం శివపురి రిపర్టరీ కంపెనీకి మొదటి చీఫ్‌గా కూడా ఉన్నాడు.[3]
ఓం శివపురి, సుధా శివపురి 1968లో వివాహం చేసుకున్నారు, వారి స్వంత థియేటర్ గ్రూప్, దిశాంతర్‌ను ప్రారంభించారు. ఇది ఢిల్లీ అగ్రగామి థియేటర్ గ్రూపులలో ఒకటిగా మారింది.[4] ఆయన దర్శకుడిగా అనేక నాటకాలు నిర్మించారు, అందులో ముఖ్యమైనవి ఆధే. అధురే, మోహన్ రాకేష్ రచించిన ఒక క్లాసిక్ హిందీ నాటకం ; ఖామోష్! అదాలత్ జరీ హై, విజయ్ టెండూల్కర్ మరాఠీ నాటకం శాంతత హిందీ వెర్షన్! కోర్ట్ చాలు ఆహే మొదలైనవి చెప్పుకోవచ్చు. వీటిల్లో అతని భార్య సుధా శివపురి ప్రధాన పాత్రల్లో నటించింది. వారి అత్యంత ప్రసిద్ధ నిర్మాణం, గిరీష్ కర్నాడ్ చారిత్రక నాటకం తుగ్లక్, ఇది న్యూ ఢిల్లీలోని తల్కతోరా గార్డెన్స్ వద్ద ప్రదర్శించబడింది.[5]
ఓం శివపురి 1971లో మణి కౌల్ ఆషాఢ్ కా ఏక్ దిన్‌తో తన చలనచిత్ర జీవితాన్ని ప్రారంభించాడు, ఆ తర్వాత 1972లో గుల్జార్ కోషిష్ లో చేసాడు. 1974లో బొంబాయికి మారారు. సుమారు రెండు దశాబ్దాల కెరీర్‌లో, అతను 175కి పైగా హిందీ చిత్రాలలో విలన్ గా, సహాయక తారాగణంగా విభిన్న పాత్రలను పోషించాడు.
అతని భార్య సుధా శివపురి కూడా ఒక ప్రముఖ టెలివిజన్ నటి, క్యుంకీ సాస్ భీ కభీ బహు థీ అనే టీవీ సీరియల్‌లో బా పాత్రకు ప్రసిద్ధి చెందింది. ఈ జంటకు హిందీ సినిమా నటి అయిన రీతు శివపురి అనే కుమార్తె ఉంది, వినీత్ అనే కుమారుడు ఉన్నాడు.
ఓం శివపురి 1990 అక్టోబరు 15న 52 ఏళ్ల వయసులో గుండెపోటుతో మరణించాడు. ఆయన మరణానంతరం ఆయన నటించిన పలు చిత్రాలు విడుదలయ్యాయి కూడా.[6]