కచ్చూరాలు

కచ్చూరాలు
Scientific classification
Kingdom:
(unranked):
(unranked):
(unranked):
Order:
Family:
Genus:
Species:
H. spicatum
Binomial name
Hedychium spicatum

కచ్చూరాలు (లాటిన్ : Hedychium spicatum-[1]) ఒక ఔషధ మొక్క.వీటిని సౌందర్య సాధక మూలికల్లో ఉపయోగిస్తారు.తెల్లపసుపుగా దీనికి మరోపేరు ఉంది.ఇది చూడటానికి మామిడి అల్లం దుంపలాగా కనిపిస్తుంది. దీని శాస్త్రీయవృక్షనామం ళఖూషఖ్ఘౄ చీళజ్య్ఘూజ్ఘ. చక్రాల్లా తరిగి మూలికలు అమ్మే షాపుల్లో ఎండించిన కచ్చూరాలను చక్రాల్లా తరిగి విక్రయిస్తుంటారు. ఇది రుచికి చేదుగానూ, వాసనకు కర్పూరం వాసనగానూ కలిగి ఉంటుంది. ఒకప్పుడు అల్లపుపచ్చడిలాగా కచ్చూర దుంపలతో ఊరగాయ పెట్టుకునేవాళ్లని తెలుస్తుంది. కొన్ని దేశాల్లో ఈ దుంపని కూరగా వండుకుంటారు అని తెలుస్తుంది.ఈ దుంపల్లో జెడోరియా అనే ఎస్సెన్షియల్ ఆయిల్ ఉంటుంది. అది అనేక వైద్య ప్రయోజనాలకు ఉపయోగకారిగా గుర్తించబడిందని తెలుస్తుంది.వీటికి సువాసన ఇచ్చే గుణం ఉంది.

లక్షణాలు

[మార్చు]
కచ్చూరాల మొక్క (Hedychium spicatum)
  • నిటారుగా పెరిగే కొమ్ము గల బహువార్షిక గుల్మం.
  • దీర్ఘవృత్తాకారం నుండి బల్లెమాకారంలో 3 వరుసలలో అమరివున్న సరళ పత్రాలు.
  • కంకి పుష్ప విన్యాసంలో దట్టంగా అమర్చబడిన మీగడ రంగు పుష్పాలు. ఆకర్షణ పత్రాకారంలో ఉన్న పార్శ్వ వంధ్య కేసరాలు.
  • మూడు నొక్కులున్న గుండ్రటి ఫలం.

వీటి ఉపయోగాలు

[మార్చు]
  • గాయకులు ప్రతివారు వారి కంఠధ్వని శ్రావ్యంగా ఉండాలని ఓ చిన్ని ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతూ ఉంటారు.
  • కొబ్బరినూనెలో వీటిని చితకకొట్టి వేసి తలకు రాసుకుంటారు.దానివనల వలన వెంట్రుకలు మృదువుగా వుంటాయని అంటారు.
  • గొంతు నస, దగ్గు, ఆయాసం, ఉబ్బసంలాంటి సమస్యలు కచ్చూరాలు, మిరియాలతో కలిపి పొడిగాచేసి, పాలలో వేసి, అవి సగం అయ్యేలా మరగించి,వడగట్టి రుచికి కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని త్రాగితే తగ్గుతాయని తెలుస్తుంది.[2]
  • తెల్లవెండ్రుకుల నివారణకు వీటిని కొన్ని వారాలపాటు గోరింటాకుతోకలిపి నూరి తలకుమర్దించిన తరువాత తలంటుస్నానం చేస్తే ఫలితం ఉంటుందంటారు.కచ్చూరాల ముక్కల్ని కొబ్బరి నూనెలో వేసి ఉంచుతారు. వీటి వలన ఆ నూనెకు ఒక విధమైన పరిమళం వస్తుంది. ఈ నూనె రాసుకుంటే వెంట్రుకల కుదుళ్లు గట్టిపడతాయి
  • కచ్చూరాల మొటిమల నివారణకు ఉపయోగిస్తారు.ముఖానికి జిడ్డు తగ్గుతుంది. జిడ్డు తగ్గటంతో ముఖం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు తగ్గుతాయి.మొటిమల వలన వచ్చే నొప్పి, వాపు వాపు తగ్గించే గుణం ఉంది. మొటిమలు కొందరిని ఎక్కువుగా భాధిస్తాయి.వీటిని మెత్తనిపొడిగాచేసి తేనె కొద్దిగా కలిపి బఠాని గింజత మాత్రలుగా చేసి ఆరబెట్టి,రోజుకు రెండుచొప్పున కడుపులోకి తీసుకున్నవారికి మంచిఫలితాన్ని ఇస్తుందని తెలుస్తుంది. కచ్చూరాలకు ఎలర్జీని తగ్గించే గుణం కూడా ఉంది. ఎలర్జీ కారణంగా ముఖం మీద, శరీరంలో ఇతర భాగాల మీద వచ్చే అనేక చర్మవ్యాధుల్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మొటిమలు దురద పెట్టటాన్ని కచ్చూరాలు తగ్గిస్తాయి.
  • గొంతు ఇన్‌ఫెక్షన్లనుకు వచ్చే నొప్పిని నివారించటానికి, చర్మాన్ని మృదువుగానూ కాంతివంతంగానూ ఉంచటానికి, లివరుని శక్తిమంతం చేసి రక్తదోషాలను నివారించటానికి, పావుచెంచా కన్నా తక్కువ పొడిని పాలలో వేసి టీలాగా కాచుకుని తాగవచ్చు.
  • గర్భాశయాన్ని పోషించే గుణంతోపాటు నెలసరి సమస్యలను కూడా సరిచేసే గుణం కచ్చూరాలకుంది. యువతులు తరచూ కచ్చూరాలను తక్కువ మోతాదులో వాడుతూ ఉంటే అధిక రుతు రక్తస్రావం, నెలసరి సరిగా రాకపోవటం, సమయానికి రాకపోవటం, ఆ మూడు రోజులూ కడుపునొప్పి, నడుము నొప్పి లాంటి బాధలు కూడా దీనివలన తగ్గుతాయి.[3]

మూలాలు

[మార్చు]
  1. "Hedychium spicatum - Useful Tropical Plants". tropical.theferns.info. Archived from the original on 2016-04-30. Retrieved 2020-05-27.
  2. "కచ్చూర చిన్న ముక్కను బుగ్గన పెట్టుకుని రసం మింగుతుంటే..." telugu.webdunia.com. Retrieved 2020-05-27.{{cite web}}: CS1 maint: url-status (link)[permanent dead link]
  3. "Andhrabhoomi - Telugu News Paper Portal | Daily Newspaper in Telugu | Telugu News Headlines | Andhrabhoomi". andhrabhoomi.net. Retrieved 2020-05-27.

వెలుపలి లంకెలు

[మార్చు]