ఈ చిత్ర కథకు మూలమైన కవయిత్రి గురించి ఆతుకూరి మొల్ల వ్యాసం చూడండి.
కథానాయిక మొల్ల (1970 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పద్మనాభం |
---|---|
నిర్మాణం | బి.పురుషోత్తం |
తారాగణం | హరనాధ్, వాణిశ్రీ, గుమ్మడి వెంకటేశ్వరరావు, పద్మనాభం, జ్యోతిలక్ష్మి, నాగభూషణం, అల్లు రామలింగయ్య, మిక్కిలినేని, త్యాగరాజు, రాధాకుమారి |
సంగీతం | ఎస్.పి. కోదండపాణి |
నిర్మాణ సంస్థ | రేఖా & మురళీ ప్రొడక్షన్స్ |
భాష | తెలుగు |
కథానాయిక మొల్ల హాస్యనటుడు పద్మనాభం దర్శకత్వం వహించిన తెలుగు సినిమా. ఇది 1970 మార్చి 5న విడుదలయ్యింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రధమ ఉత్తమ చిత్రంగా1970 వ సంవత్సరానికి గాను , బంగారు నంది అవార్డు ప్రకటించింది
ఆత్మకూరు గ్రామంలో వెనుకబడిన జాతికి చెందిన కుమ్మరి వేతన (గుమ్మడి). వృత్తిపని, కూలి పని చేసుకునేవారికి పెద్దదిక్కు. అతని కుమార్తె మల్లమ్మ (వాణిశ్రీ). ఆ ఊళ్లో కుటిల పండితుడు రామాచారి (నాగభూషణం). అతని అనుయాయులు అవధాని (అల్లు రామలింగయ్య), దౌర్జన్యాలకు పాల్పడే కనకయ్య (మిక్కిలినేని). కొడుకు తిక్కన్న (రాజ్‌బాబు). రామాచారి భార్య సీతమ్మ (హేమలత) భర్త తప్పుడు పనులను వారిస్తుంటుంది. పేదల కష్టం దోచుకొని.. వారిని హింసిస్తున్న రామాచారిని మల్లమ్మ ఎదిరిస్తుంటుంది. మల్లన్న శ్రీశైల శివునిపై రాసిన శతక పద్యాలను రామాచారి తగలబెట్టిస్తాడు. అమ్మవారి జాతర పేరున జరిగే జంతు బలులు జరగకుండా మల్లమ్మ అడ్డుపడుతుంది. అందుకు రామాచారి పేదల గుడిసెలు తగలబెట్టిస్తాడు. మల్లమ్మను, తోటివారిని రాజోద్యోగులచే దండింప చేస్తాడు. మల్లమ్మ వారంలోగా పెళ్లి చేసుకోవాలని ఆంక్ష విధింపచేస్తాడు. దాన్ని ఎదిరించి దూరంగా వెళ్లిన మల్లమ్మ -మహావిష్ణువును భర్తగా పొంది గ్రామానికి తిరిగి వస్తుంది. తెనాలి రామలింగని సూచనతో సంస్కృత భాషలోని రామాయణాన్ని తెలుగులో కేవలం ఐదు రోజుల్లో అనువాదం పూర్తిచేస్తుంది. దుష్టులు తలపెట్టిన ఆటంకాలు ఎదుర్కొని కావ్యం పూర్తిచేసిన మల్లమ్మను శ్రీకృష్ణదేవరాయలు సత్కరించటం, ఆమె కావ్య గానంచేస్తూ శ్రీరామునిలో ఐక్యం చెందటంతో చిత్రం ముగుస్తుంది[1].
{{cite news}}
: CS1 maint: bot: original URL status unknown (link)