కమలా కామేష్ | |
---|---|
జననం | |
వృత్తి | సినిమా నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1969–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | కామేష్ (m.1974-1984) |
పిల్లలు | ఉమా రియాజ్ ఖాన్ (b.1975) |
బంధువులు | రియాజ్ ఖాన్ (అల్లుడు) |
కమల కమేష్ భారతీయ సినిమా నటి.[2] ఆమె 1970ల చివరలో, 1980లలో తమిళ సినిమారంగానికి చెందిన ప్రముఖ సహాయ నటి. ఆమె అక్కడ దాదాపు 480 సినిమాల్లో నటించింది. ఆమె తరచుగా విసు సినిమాలన్నింటిలోనూ కనిపిస్తుంది. రవికిషోర్ దర్శకత్వంలో వచ్చిన జైత్రయాత్ర (1991) తెలుగు చిత్రంలో ఆమె నటించింది. ఇందులో అక్కినేని నాగార్జున, విజయశాంతి ప్రధాన పాత్రలు పోషించారు.[3][4]
విమర్శకుల ప్రశంసలు పొందిన కుడిసై (1979)లో ఆమె తన నటనా రంగ ప్రవేశం చేసింది, ఇది ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఏకైక చిత్రం. ఇందులో నటనతో ఆకట్టుకున్న ఆమె విసు చిత్రాలయిన కుటుంబం ఒరు కదంబం, అలైగల్ ఓవతిల్లైలలో నటించింది, ఇది ఆమె కెరీర్ మొత్తంలో ఇలాంటి పాత్రలలో టైప్ కాస్ట్‌గా ఉండటానికి దారితీసింది.
ఆమె తమిళంతో పాటుగా మలయాళం, కన్నడ, తెలుగు సినిమాలలోనూ నటించింది. ప్రస్తుతం ఆమె తమిళ టెలివిజన్ ధారావాహికలు మాంగళ్యం, ఆనంద భవన్ లలో చేస్తోంది.
ఆమె తమిళ సంగీత దర్శకుడు కామేష్‌ని వివాహం చేసుకుంది. ఆమె ఏకైక కుమార్తె ఉమా రియాజ్ ఖాన్ 1975లో జన్మించింది. ఆమె కూడా తమిళ సినిమాల్లో నటి.[5] ఉమ మలయాళ, తమిళ నటుడు రియాజ్ ఖాన్‌ను వివాహం చేసుకుంది.[6]
కామేష్ 1984లో మరణించాడు.