కళ్యాణ్ సింగ్ గుప్తా

కల్యాణ్ సింగ్ గుప్తా
జననం1923
మరణం23 జనవరి 2002
వృత్తిస్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త
పురస్కారాలుపద్మశ్రీ అవార్డు

కళ్యాణ్ సింగ్ గుప్తా (1923–2002) హర్యానా రాష్ట్రానికి చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక కార్యకర్త.[1] 1952లో సుచేత కృపలానీతో కలిసి లోక్ కళ్యాణ్ సమితి స్థాపించాడు.[2][3][4]

జననం, విద్య

[మార్చు]

కళ్యాణ్ సింగ్ గుప్తా 1923లో భారతదేశంలోని హర్యానాలో జన్మించాడు. పంజాబ్, ఢిల్లీలలో తన ప్రాథమిక విద్యను పూర్తి చేశాడు. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో హెరాల్డ్ లాస్కీ పర్యవేక్షణలో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు.[1] 1951లో భారతదేశానికి తిరిగి వచ్చిన కళ్యాణ్ సింగ్ ఇండియా న్యూస్ క్రానికల్‌లో జర్నలిస్ట్‌గా తన వృత్తిని ప్రారంభించాడు.[1]

ఉద్యమ జీవితం

[మార్చు]

విద్యార్థి దశలో భారత స్వాతంత్ర్య ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు.

సామాజిక కార్యక్రమాలు

[మార్చు]

ఒక సంవత్సరం తరువాత, అతను సుచేత కృపలానీతో కలిసి లోక్ కళ్యాణ్ సమితిని స్థాపించాడు.[1] టిబెట్ శరణార్థులకు సహాయ సహకారాలు అందించడానికి 1959లో సెంట్రల్ రిలీఫ్ కమిటీను కూడా ప్రారంభించాడు.[1]

పురస్కారాలు

[మార్చు]

1969లో భారత ప్రభుత్వం నాలుగో అత్యున్నత భారతీయ పౌర పురస్కారమైన పద్మశ్రీ అవార్డుతో కళ్యాణ్ సింగ్ గుప్తాను సత్కరించింది.[5]

మరణం

[మార్చు]

కళ్యాణ్ సింగ్ గుప్తా తన 79 సంవత్సరాల వయసులో 2002, జనవరి 23న న్యూఢిల్లీలో మరణించాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. 1.0 1.1 1.2 1.3 1.4 1.5 "Tribune India". Tribune India. 24 January 2002. Retrieved 16 October 2021.
  2. "LKS". Lok Kalyan Samiti. 2015. Archived from the original on 12 February 2015. Retrieved 16 October 2021.
  3. "IIT Delhi Alumni Association". IIT Delhi Alumni Association. 14 November 2010. Retrieved 16 October 2021.
  4. "LKS About US". LKS. 2015. Archived from the original on 12 February 2015. Retrieved 16 October 2021.
  5. "Padma Shri" (PDF). Padma Shri. 2015. Archived from the original (PDF) on 15 November 2014. Retrieved 16 October 2021.