కాంగ్పోక్పి
కాంగ్పోక్పి | |
---|---|
పట్టణం | |
Coordinates: 25°8′56″N 93°58′14″E / 25.14889°N 93.97056°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | మణిపూర్ |
జిల్లా | కాంగ్పోక్పి |
Elevation | 992 మీ (3,255 అ.) |
జనాభా (2011) | |
• Total | 7,476 |
భాషలు | |
• అధికారిక | మణిపురి |
Time zone | UTC+5:30 (భారత కాలమానం) |
పిన్కోడ్ | 795129 |
టెలిఫోన్ కోడ్ | 03880 |
Vehicle registration | ఎంఎన్ 03 |
సమీప నగరం | ఇంఫాల్ |
స్త్రీ పురుష నిష్పత్తి | 989/1000 ♂/♀ |
అక్షరాస్యత | 83% |
లోక్సభ నియోజకవర్గం | ఔటర్ మణిపూర్ |
కాంగ్పోక్పి, మణిపూర్ రాష్ట్రంలోని కాంగ్పోక్పి జిల్లా ముఖ్య పట్టణం, జిల్లా ప్రధాన కార్యాలయం.[1] 39వ జాతీయ రహదారి ద్వారా ఈ పట్టణం, రాష్ట్ర రాజధాని ఇంఫాల్తో కలుపబడి ఉంది. ఇంఫాల్ నగరానికి 43 కి.మీ.ల దూరంలో ఉంది.
ఇక్కడ ప్రధానంగా తడౌ-కుకి, నేపాలీలు నివసిస్తున్నారు. అంతేకాకుండా బీహార్, ఉత్తర ప్రదేశ్ వంటి రాష్ట్రాల నుండి వలస వచ్చినవారు కూడా ఉన్నారు. తమ సొంత వ్యాపారాన్ని ప్రారంభించడానికి కొన్ని కుటుంబాలు రెండవ ప్రపంచ యుద్ధం జరగడానికి ముందే ఇక్కడికి వలస వచ్చాయి. వారే ఇక్కడ దుకాణాలు నడిపిస్తున్నారు.
2011 భారత జనాభా లెక్కల ప్రకారం, ఈ పట్టణంలో 7,476 జనాభా ఉంది. ఈ జనాభాలో 3,720 మంది పురుషులు, 3,756 మంది స్త్రీలు ఉన్నారు. పట్టణ సగటు అక్షరాస్యత 85.12% కాగా, ఇది జాతీయ సగటు 76.94% కంటే ఎక్కువగా ఉంది. ఇందులో పురుషుల అక్షరాస్యత 89.98% కాగా, స్త్రీల అక్షరాస్యత 80.34% ఉంది. మొత్తం జనాభాలో 1,016 (13.59%) మంది ఆరు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు ఉన్నారు. స్త్రీ పురుష సగటు నిష్పత్తి 1010:1000 కాగా, ఇది రాష్ట్ర సగటు 985:1000 కంటే ఎక్కువగా ఉంది.[2]
ఇక్కడ 1,437 గృహాలు ఉన్నాయి. పట్టణ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో త్రాగునీరు, పరిశుభ్రత ప్రాథమిక సౌకర్యాలు అందజేయబడుతున్నాయి. పట్టణ పరిమితుల్లో రహదారులను నిర్మించడానికి, దాని పరిధిలోకి వచ్చే ఆస్తులపై పన్ను విధించడానికి కూడా కమిటీకి అధికారం ఉంది.
ఇక్కడ ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఉన్నాయి. సుమారు 20 పాఠశాలలు, 2 కళాశాలలు (కంగ్గుయ్ కళాశాల, మణిపూర్ థియోలాజికల్ కళాశాల) ఉన్నాయి. స్పోర్ట్స్ కాంప్లెక్స్ కూడా ఉంది.
ఇది సముద్రమట్టానికి 992 మీటర్ల ఎత్తులో ఉంది.[3]
ఈ పట్టణం గూండా 39వ జాతీయ రహదారి వెళుతుంది. ఇంఫాల్ - తమెంగ్లాంగ్ రహదారి పట్టణం మధ్యనుండి వెళుతుంది. ఈ పట్టణం నుండి ఇంఫాల్ నగరానికి చాలా ప్రైవేట్ బస్సులు నడుస్తున్నాయి.