కామినీ కదమ్ | |
---|---|
జననం | కామినీ కదమ్ 1933, ఆగస్టు 3 |
మరణం | 2000 జూన్ 18 | (వయసు 66)
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1955–1967 |
జీవిత భాగస్వామి | అనిల్ జి. కదమ్ |
మాణిక్ కామినీ కదమ్ (1933 ఆగస్టు 3 - 2000 జూన్ 18), మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. 1950-70 మధ్యకాలంలో అనేక మరాఠీ, కన్నడ, హిందీ చిత్రాలలో నటించింది.[1]
కామినీ కదమ్ 1933 ఆగస్టు 3న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది.
1955లో వచ్చిన యేరే మాజ్య మాగల్య సినిమాతో మరాఠీ సినిమారంగంలోకి అడుగుపెట్టి, అనేక మరాఠీ చిత్రాలలో నటించింది. 1958లో తన స్క్రీన్ పేరును కామినీ కదమ్గా మార్చుకుంది. 1958లో వచ్చిన తలాక్ సినిమాతో హిందీ సినిమారంగంలోకి ప్రవేశించింది. సంతాన్ (1959), స్కూల్ మాస్టర్ (1959), సప్నే సుహానే (1961) వంటి హిందీ సినిమాలలో నటించింది.[2]
హిందీ సినిమాలు:
మరాఠీ సినిమాలు:
కన్నడ సినిమాలు:
కామినీ కదమ్ 2000 జూన్ 18న మహారాష్ట్రలోని ముంబైలో మరణించింది.