కార్తికేయ గుమ్మకొండ | |
---|---|
జననం | కార్తికేయ గుమ్మకొండ 1992 |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2017–ఇప్పటివరకు |
తల్లిదండ్రులు | విట్టల్ రెడ్డి |
కార్తికేయ గుమ్మకొండ, దక్షిణాది చిత్రాలతో పేరొందిన నటుడు. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఆర్‌ఎక్స్ 100 తో తన మొదటి విజయం సాధించడమే కాక తన అద్భుతమైన నటనతో విమర్శకుల ప్రశంసలు పొందారు. హీరో నాని నటించిన నాని గ్యాంగ్ లీడర్ లో ప్రతినాయకుడిగా నటించడమే కాక, గుణ 369, 90ఎంఎల్ చిత్రాల ద్వారా కమర్షియల్ హీరోగా కూడా మంచి విజయాలు సాధించాడు.
కార్తికేయ తండ్రి గుమ్మకొండ విట్టల్ రెడ్డి నాగార్జున గ్రూప్ ఆఫ్ స్కూల్స్ అధినేత, తల్లి గుమ్మకొండ రజనీ విద్యావేత్త. రంగా రెడ్డి జిల్లా హైదరాబాద్, వనస్థలిపురంలో నాగార్జున పాఠశాలలో విద్యను పూర్తి చేసి విజయవాడలోని శ్రీ చైతన్య కళాశాలలో తన ఇంటర్మీడియేట్ విద్యను కొనసాగించాడు. వరంగల్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి గ్రాడ్యుయేట్ అయిన వెంటనే తాను నటుడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు.[1]
లఘు చిత్రాలతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టి తన సొంత బ్యానర్ కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ లో నిర్మించిన "ప్రేమతో మీ కార్తీక్" చిత్రం తో తెలుగు చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించాడు. కానీ ఆ తరువాత అదే బ్యానర్ పై అజయ్ భూపతి దర్శకత్వంలో నటించిన ఆర్‌ఎక్స్ 100 చిత్రం భారీ విజయాన్ని సాధించి అతని ప్రతిభని అందరికీ తెలిసేలా చేసింది. అలా ఆ తరువాత 2019 లో హిప్పీ, గుణ 369, నాని గ్యాంగ్ లీడర్, 90ఎంఎల్ చిత్రాలలో నటించాడు. అటు హీరోగా క్రేజ్ సంపాదిస్తూనే ఇటు మంచి నటుడిగా తన ప్రతిభని చూపించాలని హీరో నాని తో గ్యాంగ్ లీడర్ చిత్రంలో విలన్ గా నటించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. కొత్త దర్శకుడు కౌశిక్ పెగళ్ళపాటి డార్క్ కామెడీ కథతో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాసు నిర్మించిన “చావు కబురు చల్లగా” లో నటించాడు.
కార్తికేయ గుమ్మకొండ నాని గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ పాత్రకుగాను ఆయన 2019 సైమా అవార్డు - ఉత్తమ విలన్ అవార్డును అందుకున్నాడు.[2]
సంవత్సరం | సినిమా | పాత్ర | దర్శకుడు | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2017 | ప్రేమతో మీ కార్తీక్ | కార్తీక్ | రిషి | రిషి | [3] |
2018 | ఆర్‌ఎక్స్ 100[4] | శివుడు | అజయ్ భూపతి | అజయ్ భూపతి | |
2019 | హిప్పీ | దేవదాస్ నడింపల్లి (హిప్పీ) | టి. యస్. కృష్ణ | టి. యస్. కృష్ణ | |
గుణ 369 | గుణ | అర్జున్ జంధ్యాల | అర్జున్ జంధ్యాల | ||
నాని గ్యాంగ్ లీడర్ | దేవ్ | విక్రమ్. కె. కుమార్ | విక్రమ్. కె. కుమార్ | [5] | |
90ఎంఎల్ [6] | దేవ దాస్ | శేఖర్ రెడ్డి ఎర్రా | [7] | ||
2021 | చావు కబురు చల్లగా | బస్తీ బాలరాజు | కౌశిక్ పెగాళ్ళపాటి | [8] | |
రాజా విక్రమార్క[9] | రాజా విక్రమార్క | శ్రీ సరపల్లి | [10] | ||
2022 | వలిమై | నరేన్ / వోల్ఫ్రాంగా | హెచ్. వినోద్ | తమిళ అరంగేట్రం | |
2023 | బెదురులంక 2012 | శివశంకర వర ప్రసాద్ | క్లాక్స్ | ||
2024 | భజే వాయు వేగం † | తెలుగు |
సంవత్సరం | సిరీస్ / షో | పాత్ర | నెట్‌వర్క్ | గమనికలు | మూ |
---|---|---|---|---|---|
2020 | బిగ్ బాస్ S4 | అతిథి / ప్రదర్శకుడు (నృత్యం) | స్టార్ మా | ఎపిసోడ్ 49 | [11] |
సంవత్సరం | అవార్డు | వర్గం | సినిమా | ఫలితం |
---|---|---|---|---|
2018 | జీ సినీ అవార్డ్స్ తెలుగు | సంవత్సరపు ఉత్తమ అన్వేషణ - పురుషుడు | ఆర్‌ఎక్స్ 100 | గెలుపు |
2019 | 17వ సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ నటుడు | గెలుపు[12] | |
2021 | 9వ సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ | ఉత్తమ ప్రతినాయకుడు | నాని గ్యాంగ్ లీడర్ | గెలుపు |
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link)
{{cite web}}
: CS1 maint: url-status (link)
{{cite web}}
: CS1 maint: numeric names: authors list (link)[permanent dead link]