Kalimpong | |||||||
---|---|---|---|---|---|---|---|
Clockwise from top-left: Zang Dhok Palri Phodang, Morgan House in Kalimpong, Kagyu Thekchen Ling Monastery, view from Rishyap, Neora Valley National Park | |||||||
Country | India | ||||||
State | West Bengal | ||||||
Division | Jalpaiguri | ||||||
ముఖ్యపట్టణం | Kalimpong | ||||||
Government | |||||||
• Lok Sabha constituencies | Darjeeling (shared with Darjeeling district) | ||||||
• Vidhan Sabha constituencies | Kalimpong | ||||||
విస్తీర్ణం | |||||||
• Total | 1,053.60 కి.మీ2 (406.80 చ. మై) | ||||||
జనాభా (2011)[1] | |||||||
• Total | 2,51,642 | ||||||
• జనసాంద్రత | 240/కి.మీ2 (620/చ. మై.) | ||||||
Time zone | UTC+05:30 (భా.ప్రా.కా) |
కాలింపాంగ్ జిల్లా భారతదేశం, పశ్చిమ బెంగాల్ రాష్ట్రం లోని ఒక జిల్లా. నిజానికి ఇది డలింగ్‌కోట్ తాలూకాగా పిలువబడే [a] ప్రాంతం. ఇది ప్రత్యామ్నాయంగా సిక్కిం, భూటాన్‌ల నియంత్రణలో ఉంది.1865లో ఇది సించులా ఒప్పందం ప్రకారం బ్రిటిష్ ఇండియాచే భూటాన్ నుండి విలీనం చేయబడింది.1916 నుండి 2017వరకు డార్జిలింగ్ జిల్లా ఉప విభాగంగా ఉంది.[2] [3] 2017లో ఇది పశ్చిమ బెంగాల్ 21వ ప్రత్వేక జిల్లాగా ఏర్పడింది.[3][4]
జిల్లా ప్రధానకార్యాలయం కాలింపాంగ్‌లో ఉంది.ఇది బ్రిటీష్ కాలంలో ఇండో-టిబెటన్ వాణిజ్యానికి వ్యాపార పట్టణంగా ప్రాముఖ్యతను సంతరించుకుంది. దీనికి ఉత్తరాన సిక్కింలోని పాక్యోంగ్ జిల్లా, తూర్పున భూటాన్, పశ్చిమాన డార్జిలింగ్ జిల్లా, దక్షిణాన జల్పాయిగురి జిల్లా సరిహద్దులుగా ఉన్నాయి. జిల్లాలో కాలింపాంగ్ పురపాలక సంఘం, కాలింపాంగ్ I, కాలింపాంగ్ II, గోరుబతన్ అనే మూడు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు ఉన్నాయి.
జిల్లాలో 23 వార్డులను కలిగి ఉన్న కాలింపాంగ్ పురపాలక సంఘంతో పాటు, జిల్లాలో కాలింపాంగ్ I, కాలింపాంగ్ II, గోరుబతన్ అనే మూడు కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాకుల క్రింద 42 గ్రామ పంచాయతీల గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి.[5] కాలింపాంగ్ జిల్లా వైశాల్యం 1,053.60 కి.మీ2 (406.80 చ. మై.). కాలింపాంగ్ I బ్లాక్ విస్తీర్ణం 360.46 కి.మీ2 (139.17 చ. మై.), కాలింపాంగ్ II విస్తీర్ణం 241.26 కి.మీ2 (93.15 చ. మై.), గోరుబతన్ బ్లాక్ విస్తీర్ణం 442.72 కి.మీ2 (170.94 చ. మై.). కాలింపాంగ్ పురపాలక సంఘ విస్తీర్ణం 9.16 కి.మీ2 (3.54 చ. మై.).[1]
ప్రస్తుతం కాలింపాంగ్ జిల్లాగా ఉన్న ప్రాంతం మొదట సిక్కిం రాజ్యంలో ఉంది.[6][7] ఇది రెండు కొండకోటల ద్వారా నియంత్రించబడింది. డంసాంగ్ [b], డాలింగ్ [c] (లేదా డాలింగ్‌కోట్, అంటే "డాలింగ్ ఫోర్ట్"). ఈ ప్రాంతాన్ని డాలింగ్‌కోట్ అని పిలుస్తారు.[8] 1718లో భూటాన్ రాజ్యం ఈ భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. తదుపరి 150 సంవత్సరాలు దీనిని పాలించింది.[9] ఈ ప్రాంతంలో స్థానిక లెప్చా సామాజికవర్గానికి చెందిన ప్రజలు ఇక్కడకు వలస వచ్చి స్థిరపడ్డారు.వారిలో భూటియా, లింబు, కిరాటి తెగలు చెందినవారు చాలా తక్కువగా ఉన్నారు.
1864లో ఆంగ్లో-భూటాన్ యుద్ధం తరువాత, సించులా ఒప్పందం (1865) ప్రకారం, తీస్తా నదికి తూర్పున ఉన్న నిర్దిష్ట కొండప్రాంతం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అప్పగించబడింది.[6] అయితే ఇందులో ఖచ్చితమైన హద్దులతో భూభాగం పేర్కొనబడలేదు, కానీ దానిలో డాలింగ్‌కోట్ కోట కలిగి ఉందని గుర్తించబడింది.1866-1867లో ఆంగ్లో-భూటానీస్ సంఘం ఈ ప్రాంతానికి, డిచు, నిచు నదులను తూర్పు సరిహద్దులుగా గుర్తించింది.[10][11]
అప్పగించబడిన భూభాగం మొదట వెస్ట్రన్ డువార్స్ జిల్లాకు కలపబడింది. తరువాత 1866లో డార్జిలింగ్ జిల్లాకు బదిలీ చేయబడింది.[2] దీని కొండకోటల తర్వాత దీనిని "డాలింగ్‌కోట్ ప్రాంతం" లేదా" డాంసాంగ్ భూఖండం"గా గతంలో గుర్తించి నిర్వహించారు.[11][12] ఆ సమయంలో కాలింపాంగ్ ఒక చిన్న కుగ్రామం. అక్కడ కేవలం రెండు లేదా మూడు కుటుంబాలు మాత్రమే నివాసం ఉండేవి.[13] అయితే 1864లో భూటాన్‌కు సహాయ సమయంలో కాలింపాంగ్ పరిసరాల్లో అనేక గ్రామాలతో బాగా జనాభా ఉందని యాష్లే ఈడెన్ నమోదు చేసాడు. ఇంకా అక్కడి ప్రజలు బ్రిటీష్ పరిపాలన పట్ల మంచి వైఖరిని కలిగి ఉన్నారని, భూటాన్ అధికారులను ధిక్కరిస్తూ తిస్టాకు పశ్చిమాన ఉన్న డార్జిలింగ్ ప్రాంతంతో తరచుగా వ్యాపారం చేసేవారని ఈడెన్ పేర్కొన్నాడు. [14]
సమశీతోష్ణ వాతావరణ కారణంగా బ్రిటీష్ వారు ఈ పట్టణాన్ని మైదానాలలో మండుతున్నవేసవి వేడినుండి తప్పించుకోవడానికి డార్జిలింగ్‌కు ప్రత్యామ్నాయంగా హిల్ స్టేషన్ అభివృద్ధిచేయడానికి పూనుకున్నారు. టిబెట్‌తో వాణిజ్యం కోసం కాలింపాంగ్ నాథులా, జెలెప్ లా పాస్‌లకు (లా అంటే "పాస్"సమీపంలో ఉండటం అదనపు ప్రయోజనం చేకూరింది. ఇది త్వరలోనే భారతదేశం, టిబెట్ మధ్య బొచ్చుతో కూడిన చర్మాలు, ఉన్ని, ఇతర ఆహార ధాన్యాల వ్యాపారంలో ఒక ముఖ్యమైన వాణిజ్యకేంద్రంగా అభివృద్ధి చెందింది.[15] పొరుగున ఉన్న నేపాల్, సిక్కిం దిగువ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో నేపాలీలను వాణిజ్యంలో పెరుగుదలకు దోహదం కలిగేలా ఆకర్షించింది, 1790లో సిక్కింపై గూర్ఖా దండయాత్ర నుండి నేపాలీలు నివసిస్తున్న ప్రాంతంలోకి ప్రజల తరలింపు, పెరిగిన ఆర్థిక శ్రేయస్సుతో కాలింపాంగ్ కొద్ది ఇళ్లతో కూడిన చిన్న కుగ్రామం నుండి, బాగాఅభివృద్ధి చెందిన పట్టణంగా మారింది. బ్రిటన్ ప్రభుత్వం, కాలింపాంగ్‌లో భూటాన్ డోర్జీ కుటుంబానికి ప్రభావవంతమైన ఒక ప్లాట్‌ను కేటాయించింది, దీని ద్వారా భూటాన్‌తో వాణిజ్యసంబంధాలు బాగా మెరుగుపడ్డాయి.ఇది కాలక్రమేణా తరువాత భూటాన్ హౌస్, భూటాన్ పరిపాలనా, సాంస్కృతిక కేంద్రంగా మారింది.[16][17][18]
బ్రిటీష్ వారి కోసం స్కాటిష్ మిషనరీల రాకతో పాఠశాలలు, సంక్షేమ కేంద్రాల నిర్మాణాలు చేపట్టింది.[13] డబ్ల్యు.మాక్‌ఫర్‌లేన్ 1870ల ప్రారంభంలో ఈ ప్రాంతంలో మొదటి పాఠశాలలను స్థాపించాడ.[13] స్కాటిష్ విశ్వవిద్యాలయ సహాయ సంస్థ 1886లో ప్రారంభమైంది. ఆ తర్వాత కాలింపాంగ్ ప్రాంతంలో బాలికలు ఉన్నత ఫాఠశాల కూడా ప్రారంభమైంది. 1900లో జెఎ. గ్రాహం, నిరుపేద ఆంగ్లో-ఇండియన్ విద్యార్థుల కోసం డాక్టర్ గ్రాహంస్ హోమ్స్‌ని స్థాపించారు.[13] యువ సామాజిక కార్యకర్త ఏనియాస్ ఫ్రాంకాన్ విలియమ్స్, (ఔత్సాహిక రచయిత, కవి) 24 సంవత్సరాల వయస్సులో, డాక్టర్ గ్రాహమ్స్ హోమ్స్‌లో అసిస్టెంట్ స్కూల్ మాస్టర్‌గా పని చేసేందుకు 1910లో కాలింపాంగ్ చేరుకున్నాడు.[19] అక్కడ అతను విద్యార్దిగా చదువుతూనే, పాఠశాలలో పని చేసాడు. తదుపరి పద్నాలుగు సంవత్సరాలు.[20] 1907 నుండి కాలింపాంగ్‌లోని చాలా పాఠశాలలు భారతీయ విద్యార్థులకు విద్యను అందించడం ప్రారంభించాయి. 1911 నాటికి, జనాభా నేపాలీలు, లెప్చాలు, టిబెటన్లు, ముస్లింలు, ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీలతో సహా అనేక జాతుల సమూహాల పెరుగుదలతో 1911 నాటికి జనాభా 7,880కి పెరిగింది.[13]
1947లో భారత స్వాతంత్ర్యం తరువాత, బెంగాల్ భారతదేశం, తూర్పు పాకిస్తాన్ మధ్య విభజించబడిన తర్వాత కాలింపాంగ్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఒక భాగమైంది. 1959లో చైనా టిబెట్‌ను స్వాధీనం చేసుకోవడంతో, చాలా మంది బౌద్ధ సన్యాసులు టిబెట్ నుండి పారిపోయి కాలింపాంగ్‌లో మఠాలను స్థాపించారు.వీరు అనేక అరుదైన బౌద్ధ గ్రంథాలను తమ వెంట తెచ్చుకున్నారు. 1962లో చైనా-భారత యుద్ధం తర్వాత జెలెప్ పాస్‌ను శాశ్వతంగా మూసివేయడం వలన, టిబెట్, భారతదేశం మధ్య వాణిజ్యానికి అంతరాయం కలిగింది. కాలింపాంగ్ ఆర్థిక వ్యవస్థలో మందగమనానికి దారితీసింది. 1976లో సందర్శించిన దలైలామా జాంగ్ ధోక్ పాల్రి ఫోడాంగ్ ఆశ్రమాన్ని దర్శించాడు. ఆశ్రమంలో అనేక గ్రంథాలు ఉన్నాయి.[13] 1986, 1988 మధ్య, జాతి ప్రాతిపదికన గూర్ఖాలాండ్, కమ్తాపూర్ ప్రత్యేక రాష్ట్రం కోసం బలంగా వత్తిడి పెరిగింది. గూర్ఖా నేషనల్ లిబరేషన్ ఫ్రంట్, పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి మధ్య జరిగిన అల్లర్లు నలభై రోజులసమ్మె తర్వాత ప్రతిష్టంభనకు చేరుకున్నాయి. పట్టణంపై ముట్టడి ఏర్పడి ప్రతిస్టంభన ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను నిర్వహించడానికి భారత సైన్యాన్ని పిలిచింది.ఇది డార్జిలింగ్ గూర్ఖా హిల్ కౌన్సిల్ ఏర్పాటుకు దారితీసింది. ఇది సిలిగురి ఉప విభాగం పరిధిలోని ప్రాంతాన్ని మినహాయించి డార్జిలింగ్ జిల్లాను పరిపాలించడానికి పాక్షిక స్వయం ప్రతిపత్తి అధికారాలు ఇవ్వబడ్డాయి. 2007 నుండి డార్జిలింగ్ హిల్స్‌లోని గూర్ఖా జనముక్తి మోర్చా, దాని మద్దతుదారులు ప్రత్యేక గూర్ఖాలాండ్ రాష్ట్రం కావాలనే వత్తిడిని పునరుద్ధరించారు.[21] కంతాపూర్ పీపుల్స్ పార్టీ, ఉత్తర బెంగాల్‌ను కవర్ చేస్తూ ప్రత్యేక కమ్తాపూర్ రాష్ట్రం కోసం దాని మద్దతుదారుల ఉద్యమం పెద్దది చేసారు.[22]
కాలింపాంగ్ I బ్లాక్‌లో బాంగ్, కాలింపాంగ్, సమాల్‌బాంగ్, టిస్టా, డా. గ్రాహమ్స్ హోమ్స్, లోయర్ ఎచాయ్, సంథార్, నీమ్‌బాంగ్, డుంగ్రా, అప్పర్ ఎచాయ్, సియోక్‌బీర్, భాలుఖోప్, యాంగ్‌మకుమ్, పాబ్రింగ్‌టార్, సిండేబాంగ్, కాఫర్ కాంకే బాంగ్, పుదుంగ్, తాషిడింగ్ అనే 18 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[5] ఈబ్లాక్‌కి కాలింపాంగ్‌లో ఒక రక్షకభట నిలయం ఉంది.[23] బ్లాక్ ప్రధాన కార్యాలయం కాలింపాంగ్‌లో ఉంది.[24]
కాలింపాంగ్ II బ్లాక్ సిక్కిం సరిహద్దులో ఉంది. ఈ బ్లాక్‌లో దలాప్‌చంద్, కష్యోంగ్, లోలే, లింగ్సేఖా, గిట్‌డబ్లింగ్, లావా-గిట్‌బియాంగ్, పయాంగ్, కాగే,లింగ్సే, షాంగ్సే, పెడాంగ్, సియాకియోంగ్, శాంతూక్ అనే 13 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[5] ఈ బ్లాక్ కాలింపాంగ్ రక్షకభట నిలయం ద్వారా సేవలు అందిస్తోంది.[23] ఈ బ్లాక్ ప్రధాన కార్యాలయం అల్గారాలో ఉంది.
గోరుబతన్ బ్లాక్‌లో దలీమ్,గోరుబతన్ – I, గోరుబతన్ – II, పటేంగోడక్, తోడే టాంగ్టా, కుమై, పోఖ్రేబాంగ్, శాంసింగ్, ఆహలే, నిమ్, రోంగో అనే 11 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.[5] ఈ బ్లాక్‌లో గోరుబతన్ జల్ధకా, అనే రెండు రక్షకభట నిలయాలు ఉన్నాయి: .[23] బ్లాక్ ప్రధాన కార్యాలయం ఫాగులో ఉంది.
పశ్చిమ బెంగాల్‌లోని నియోజకవర్గాల విభజన సంబంధించి నియోజకవర్గాల పునర్వ్యస్థీకరణ సంఘం ఆదేశం ప్రకారం, కాలింపాంగ్ జిల్లా (గతంలో కాలింపాంగ్ ఉప విభాగం), మూడు బ్లాకులు అవి కాలింపాంగ్ పురపాలక సంఘం, కాలింపాంగ్ II, గోరుబతన్, పశ్చిమ బెంగాల్‌లోని కాలింపాంగ్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో భాగంగా ఉన్నాయి. ఈ నియోజకవర్గం డార్జిలింగ్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగంగా ఉంది. డార్జిలింగ్‌కు భారతీయ జనతా పార్టీకి చెందిన నీరజ్ జింబా ప్రాతినిధ్యం వహిస్తుండగా, కాలింపాంగ్ శాసనసభ నియోజకవర్గానికి గూర్ఖా జనముక్తి మోర్చా (తమాంగ్ వర్గం) కి చెందిన రుడెన్ సదా లెప్చా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.[25]
2011 జనాభా లెక్కల ప్రకారం, కాలింపాంగ్ జిల్లా (అప్పుడు కాలింపాంగ్ ఉపవిభాగంగా లెక్కించబడింది) 2,51,642 జనాభాను కలిగి ఉంది. కాలింపాంగ్ I బ్లాక్‌లో 74,746 మంది, కాలింపాంగ్ II బ్లాక్‌లో 66,830 మంది, గోరుబతన్ బ్లాక్‌లో 60,663 మంది జనాభా కలిగి ఉంది. కాలింపాంగ్ పురపాలకసంఘ పరిధిలో 49,403 మంది జనాభా ఉన్నారు. మొత్తం జనాభాలో షెడ్యూల్డ్ కులాలు జనాభా 16,433 (6.53%) మంది ఉండగా, షెడ్యూల్డ్ తెగలు జనాభా 74,976 (29.79%) మంది ఉన్నారు.[1]
మతం | జనాభా (1941) [26] : 90–91 | శాతం (1941) | జనాభా (2011) [27] | శాతం (2011) |
---|---|---|---|---|
హిందూమతం | 35,928 | 45.45% | 153,355 | 60.94% |
గిరిజన మతం | 31,674 | 40.07% | 3,243 | 1.29% |
క్రైస్తవ మతం | 714 | 0.9% | 37,453 | 14.88% |
ఇస్లాం | 324 | 0.41% | 3,998 | 1.59% |
బౌద్ధమతం | --- | --- | 52,688 | 20.94% |
ఇతరులు [d] | 10,402 | 13.16% | 905 | 0.36% |
మొత్తం జనాభా | 79,042 | 100% | 1,595,181 | 100% |
2011 జనాభా లెక్కల ప్రకారం హిందువులు 153,355 (60.94%), బౌద్ధులు 52,688 (20.94%), క్రైస్తవులు 37,453 (14.88%) ఉన్నారు. జనాభాలో ముస్లింల సంఖ్య 3,998 (1.59%),సాంప్రదాయ విశ్వాసాలు ( కిరాత్ ముంధుమ్ వంటివి) 3,243 (1.29%) మంది ఉన్నారు.[27]
2011 భారత జనాభా లెక్కల ప్రకారం,జనాభాలో 51.25% నేపాలీ,3.18% హిందీ, 2.67% లెప్చా,1.16% భోజ్‌పురి,41.74% ఇతరభాషలు వారి మొదటిభాషగా మాట్లాడతారు.[28][29]
1951 భారత జనాభా లెక్కల సమయంలో, ఇప్పుడు కాలింపాంగ్ జిల్లాలో నివసిస్తున్న వారిలో కేవలం 24% మంది మాత్రమే నేపాలీని తమ మాతృభాషగా మాట్లాడేవారు. జనాభాలో చాలా మంది రాయ్, లింబు, లెప్చా, తమాంగ్ వంటి అనేక ఇతర దేశీయ భాషలను మాట్లాడేవవారు.అయితే దాదాపు అందరూ నేపాలీని రెండవ భాషగా మాట్లాడతారు, అర్థం చేసుకుంటారు.అయితే మాతృభాషగా నేపాలీ భాషను మొత్తం జనాభా 2,51,642 మందిలో 1,28,985 మంది జనాభా మాట్లాడేవారు.ఆ విధంగా కాలింపాంగ్ జిల్లా జనాభాలో 51.25 శాతం మంది,[30] 1961 నాటికి, నేపాలీని వారి మాతృభాషగా మాట్లాడే వారి సంఖ్య 75%కి పెరిగింది. దీనితో పాటు కొండల్లోని వివిధ జాతులు మాట్లాడే ఇతర భాషల సంఖ్య గణనీయంగా పడిపోయింది.[31]
కాలింపాంగ్ జిల్లా నుండి ప్రస్తుతం పనిచేస్తున్న సమీప రైల్వే స్టేషన్ డార్జిలింగ్ జిల్లాలోని శివోక్ రైల్వే స్టేషన్, జల్పాయిగురి జిల్లాలోని బాగ్రాకోట్ రైల్వే స్టేషన్.
బాగ్డోగ్రా విమానాశ్రయం కాలింపాంగ్ జిల్లాలోని దక్షిణ ప్రాంతాలకు సమీప విమానాశ్రయం, పాక్యోంగ్ విమానాశ్రయం, ఉత్తర ప్రాంతాలకు సమీప విమానాశ్రయం.
<ref>
ట్యాగు; "Religion" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు