కాశ్మీరా పరదేశి | |
---|---|
విద్యాసంస్థ | నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (ముంబై) |
వృత్తి | నటి, మోడల్[1] |
క్రియాశీల సంవత్సరాలు | 2018–ప్రస్తుతం |
కాశ్మీరా పరదేశి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. తెలుగులో నర్తనశాల (2018), తమిళంలో శివప్పు మంజల్ పచ్చై (2019)లలో తొలిసారిగా నటించింది.
కాశ్మీరా పరదేశి మహారాష్ట్ర రాజధాని ముంబైలోని మరాఠీ కుటుంబంలో జన్మించింది.[2] పూణేలోని సెయింట్ ఆన్స్ స్కూల్లో పాఠశాల విద్యను, బృహన్ మహారాష్ట్ర కాలేజ్ ఆఫ్ కామర్స్‌లో కళాశాల విద్యను పూర్తిచేసింది.[3] ముంబైలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైన్ చదివింది.[4]
సినీరంగంలోకి రావడానికి ముందు కాశ్మీరా పరదేశి అనేక వాణిజ్య ప్రకటనలలో నటించింది. 2018లో నాగశౌర్య హీరోగా తెలుగులో వచ్చిన నర్తనశాల సినిమాతో తన సినీ జీవితాన్ని ప్రారంభించింది.[5] 2019లో మిషన్ మంగళ్ అనే హిందీ సినిమాలో విద్యాబాలన్ -సంజయ్ కపూర్ కుమార్తెగా నటించింది.[6][2] రవి జాదవ్ తీసిన రాంపట్ (2019)తో మరాఠీ సినిమారంగంలోకి అడుగుపెట్టింది.[7][3] జివి ప్రకాష్ కుమార్ సరసన శివప్పు మంజై పచ్చై (2019) తమిళ సినిమాలో నటించింది.[8] 2021లో, కాశ్మీరా పరదేశి నిఖిల్ కుమార్ సరసన రైడర్ (2021)తో కన్నడ సినిమారంగలోకి ప్రవేశించింది.
సంవత్సరం | పేరు | పాత్ర | భాష | మూలాలు | |
2018 | నర్తనశాల | మానస | తెలుగు | ||
2019 | రాంపట్ | మున్నీ | మరాఠీ | ||
మిషన్ మంగళ్ | అన్యా షిండే | హిందీ | |||
శివప్పు మంజల్ పచ్చై | కవిన్ | తమిళం | |||
2021 | రైడర్ | సౌమ్య "చిన్ను" | కన్నడ | ||
2022 | అన్బరివు | కయల్ | తమిళ్ | [9] | |
వరలారు ముక్కియం | యమునా | తమిళ్ | [10] | ||
2023 | వసంత ముల్లై \ వసంత కోకిల | నీలా | తమిళ్ \ తెలుగు | [11] | |
వినరో భాగ్యము విష్ణుకథ | తెలుగు | ||||
పరంపోరుల్ | తమిళ్ | పోస్ట్ -ప్రొడక్షన్ | [12] | ||
పీటీ సార్ | తమిళ్ | [13] |