కుబేర్నాథ్ రాయ్ | |
---|---|
పుట్టిన తేదీ, స్థలం | మత్స గ్రామం, దిల్దార్‌నగర్ కంసర్, ఘాజీపూర్, ఉత్తర ప్రదేశ్, బ్రిటిష్ ఇండియా | 1933 మార్చి 26
మరణం | 1996 జూన్ 5 మత్స గ్రామం, వారణాసి డివిజన్, ఘాజీపూర్ జిల్లా, ఉత్తరప్రదేశ్, భారతదేశం | (వయసు 63)
వృత్తి | రచయిత, వ్యాసకర్త, పండితుడు, కవి |
జాతీయత | భారతీయుడు |
గుర్తింపునిచ్చిన రచనలు | ప్రియా నీలకంఠి, గంధమదన్, కామధేను, రామాయణ మహాతీర్థం, నిషాద్ వేణువు, రాస్ ఆఖేతక్, విశాద్ యోగ్ |
పురస్కారాలు | భారతీయ జ్ఞానపీఠ్ |
జీవిత భాగస్వామి | మహారాణి దేవి |
తండ్రి | వకుంత్ నారాయణ్ రాయ్ |
తల్లి | లక్ష్మీ రాయ్ |
ఆచార్య కుబేర్నాథ్ రాయ్ (1933 మార్చి 26 - 1996 జూన్ 5) భారతీయ హిందీ సాహితీవేత్త, సంస్కృత పండితుడు, రచయిత.[1]
ఆయన ఉత్తర ప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా మత్స గ్రామంలో భూమిహార్ బ్రాహ్మణ కుటుంబంలో 1933 మార్చి 26న జన్మించాడు. అతని తండ్రి వకుంత్ నారాయణ్ రాయ్, తల్లి లక్ష్మీ రాయ్. కుబేర్నాథ్ రాయ్ తన ప్రాథమిక విద్య మత్స గ్రామంలోనే సాగింది. అయితే వారణాసిలోని క్వీన్స్ కాలేజీలో మెట్రిక్యులేషన్ పూర్తిచేసాడు. ఉన్నత చదువుల కోసం బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU) లో చేరాడు. అతను కలకత్తా విశ్వవిద్యాలయం నుండి ఆంగ్ల సాహిత్యంలో మాస్టర్స్ చేసాడు.
ఆయన కోల్‌కతాలోని విక్రమ్ విశ్వవిద్యాలయంలో తన ఉపాధ్యాయ వృత్తిని ప్రారంభించాడు, కానీ కొద్ది రోజుల్లోనే ఆంగ్ల సాహిత్యంలో లెక్చరర్‌గా అస్సాంలోని నల్బరీకి మారాడు. ఇక్కడ ఆయన 1958 నుండి 1986 వరకు విధులు నిర్వర్తించాడు. అదే సంవత్సరం ఉత్తరప్రదేశ్ లోని ఘాజీపూర్ లో ఉన్న స్వామి సహజానంద సరస్వతి పిజి కళాశాల ప్రిన్సిపాల్‌గా పదోన్నతిపై వెళ్లిన ఆయన 1995లో పదవీ విరమణ పొందాడు.
కుబేర్ నాథ్ రాయ్ పూర్తిగా వ్యాస రూపంలో తన రచనలను కొనసాగించాడు.[2]
ఆయన గంధ మదన్, ప్రియా నీల్-కాంతి, రాస్ ఆఖేతక్, విశాద్ యోగ్, నిషాద్ బన్సూరి, పర్ణ ముకుత్ వ్యాసాల సంకలనాలు వ్యాస రూపాన్ని అపారంగా సుసంపన్నం చేశాయి.[2] ఆయన భారతీయ సంస్కృతి, పాశ్చాత్య సాహిత్యంలో పండితుడు అయినా భారతీయ వారసత్వం గురించి గర్వపడ్డాడు. సహజ సౌందర్యం ఉట్టిపడే భారతీయ జానపద సాహిత్యాలపై ఆయనకున్న ప్రేమ, యంత్రాల యుగంలోనూ వ్యవసాయ సమాజానికి ప్రాధాన్యత, అతని శృంగార దృక్పథం, సౌందర్య సున్నితత్వం, సమకాలీన వాస్తవికత, శాస్త్రీయ శైలిపై ఆయన శ్రద్ధ హిందీ సాహిత్యంలోని సమకాలీన వ్యాసకర్తలలో అతన్ని చాలా ఉన్నత స్థానంలో నిలిపింది.[2]
63 ఏళ్ల ఆయన తన స్వగ్రామమైన మత్సాలో 1996 జూన్ 5న తుదిశ్వాస విడిచాడు.[4]
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)