కుసుమ్ చెట్టును ఆంగ్లంలో సిలోన్ ఓక్ (ceylon oak) అనికూడా అంటారు. ఈచెట్టు సపిండేసి కుటుంబానికి చెందినది. కుసుమ్‍చెట్టు, తెలుగులో కుసుమ అనిపిలువబడు మొక్క ఒకటి కాదు. రెండు భిన్నమైనవి. వేరే వృక్ష కుటుంబానికి చెందినవి. కుసుమ మొక్కఆస్టరేసి/ కంపొసిటె కుటుంబానికి చెందిన మొక్క. కుసుమ ఏక వార్షిక మొక్క, వ్యవసాయ పంటగా సాగుచేయునది. కుసుమ్/కుసుము బహు వార్షిక చెట్టు. కుసుమ్ చెట్టు వృక్షశాస్త్ర నామం ఎస్, ట్రిజుగ (schleichera trijuga,, షెలెఛిర ఒలియోస (sh. oleosa). ఈచెట్టు లక్క పురుగులకు ఆశ్రిత చెట్టు. ఈచెట్టు ఆకులు లక్క పురుగుల ఆహారం. ఈ చెట్టును బహుళ ప్రయోజన వృక్షం (multi purpose tree) అని కూడా అంటారు.[1]
భారతదేశంలో హిమాలయపరిసర (sub-himalayan) ప్రాంతాలలో సముద్ర మట్టం నుండి 914 మీటర్ల ఎత్తులోకూడా వ్యాప్తిచెంది ఉన్నాయి.అలాగే ఉత్తర, దక్షిణభారతంలో కూడా వ్యాప్తి వెందినది.ఈ చెట్టు దాదాపు 45అడుగుల ఎత్తు పెరుగుతుంది. హిమాలయ పర్వతాల పాదపీఠ ప్రాంతాలు, భారతదేశం, పాకిస్తాన్, నేపాలు, బంగ్లాదేశ్, థాయ్‌లాండు ద్వీపసమూహా ప్రాంతాలు,, శ్రీలంకలలో పెరుగును. ఇండోనేశియాలోని జావా, బాలిలలో వ్యాప్తిచెంది ఉంది.[4]
ఆంధ్ర ప్రదేశ్, బీహార్, కర్నాటక, కేరళ, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్, ఒడిస్సా, ఉత్తర ప్రదేశ్,, బెంగాల్రాష్ట్రాలు.[3]
చెట్టు :బలిష్టమైన. పొట్టి కాండం కలిగి, కాండం చివర కిరీటం/గొడుగులా విస్తరించిన కొమ్మలుండి, 12-15 మీటర్ల పొడవు పెరుగును. సతతహరితం, కొన్నిచోట్ల ఆకురాల్చును. గుంపుగా రెమ్మలు, పత్రాలను కలిగి వుండును. 10-15 సంవత్సరాలకు చేవ (mature) కొస్తుంది. చెట్టు గట్టికలప నిస్తుంది.ఆకులు పశువుల మేతగా పనికొస్తుంది.బెరడులో టన్నిన్ (Tannin) ఉంది. కలప ముదురుఎరుపు, గోధుమ రంగులో చేవ కలిగి వుండటం వలన కలపను చక్కెర, నూనె మిల్లులలో ఉపయోగిస్తారు. వ్యవసాయ పనిముట్లు తయారుచేస్తారు.[5]
పూలు-పళ్ళు-గింజలు ఫిబ్రవరి-ఏప్రిల్ లో పూస్తాయి. పూలు చిన్నవిగా పసుపుఛాయతోకూడి ఆకుపచ్చగా వుండును. గుత్తులుగా పూయును. పూలనుండి అద్దకపురంగు (dye) తయారుచేయుదురు. ఈ చెట్టు పూలలోని మకరందాన్ని తేనెఉత్పత్తికై తేనెటిగలు సేకరిస్తాయి. పూలు ఉభయ లింగకాలు. జూన్-జులైకి పండుతాయి. గోళాకారం లేదా అండాకారంగా వుంటాయి.బెర్రి రకానికి చెందినది. పరిమాణం 1.25-2.5x1.1-1.8 సెం.మీ వుండును. బ్రౌన్ రంగులో సాగినట్లు, రెండుపక్కలు నొక్కబడీనట్లు గింజ లుండును. పండులో తక్కువ గుజ్జుకండ (pulp) వుండును. గింజలో విత్తనం/బీజం (kernel) 60-64% వుండును.విత్తనం/బీజభాగం (kernel) లో నూనె 51-52% వున్నది గింజలో మాంసకృత్తుల శాతం 22.0% గింజలో 25-38% నూనె ఉంది.[6] ఒక చెట్టు నుండి ఎడాదికి 25-37కిలోల నూనె గింజల దిగుబడి వస్తుంది..ఏడాదికి 80 వేల టన్నుల నూనె గింజలు సేకరించు అవకాశమున్నది. అందుండి 25వేల టన్నుల నూనె తీయవచ్చును[3].ఎండిన విత్తనం'యు'రూపంలో వుండును. తేమేక్కువగా వున్నచో విత్తనాన్ని'ఫంగస్'త్వరగా ఆశిస్తుంది.
సీకరించిన నూనె గింజ లనుండి పైపొట్టును పొట్టుతొలగించు (Decarticators) యంత్రాల ద్వారా పొట్టును తొలగించిన పిమ్మట గానుగ (ghani, ఎక్సుపెల్లరుల ద్వారా నూనెను సంగ్రహించెదరు. గానుక కన్న ఎక్సుపెల్లరు నూనె యంత్రాలలో ఆడించిన ఎక్కువనూనె దిగుబడి లభించును. కేకులో మిగిలిన నూనెను సాల్వెంట్ ప్లాంట్ ద్వారా సంగ్రహించెదరు.
ముడి కుసుమ్ నూనె పసుపు ఛాయతో కూడిన బ్రౌన్‍రంగులో, ముడి నూనె చేదుబాదం నూనెవాసన కల్గివుండును.నూనె అర్ద ఘనరూపంలో వుండును, నూనెలో 50%వరకు సంతృప్త కొవ్వు ఆమ్లాలుండటమే ఇందుకు కారణం. కుసుమ్‍నూనెలో హైడ్రొసైనిక్ ఆమ్లం ఉంది. అందుచే ఈనూనె వంట నూనెగా పనికిరాదు. నూనెను తేర్చిన, పైభాగంలో తేలిక రంగువున్న నూనె పైభాగంలో చేరును. మిగతా నూనెలకన్న కుసుమ్ నూనె లోని కొవు ఆమ్లాల సమ్మేళనం భిన్నమైనది. కుసుమ్ నూనె ట్రైగ్లిసెరైడుల, సైనొలిపిడుల (cyanolipids) ల మిశ్రమం. నూనెలో ట్రైగ్లిసెరైడ్ (triglyceride) లశాతం కేవలం37% మాత్రమే. మిగిలినవి సైనొలిపిడులు.
కుసుమ్ నూనెలోని ట్రైగ్లిసెరైడ్ సమ్మేళనాలు
సమ్మేళనం | శాతం |
ట్రై గ్లిసెరైడులు | 37.0 |
సైనొలిపిడులు -I | 58 |
సైనొలిపిడులు-II | 5 |
కుసుమ్ నూనెలో రెండు రకాల సైనొలిపిడులు ఉన్నాయి. సైనొలిపిడుల ఈస్టరులు (Esters of cyanolipids) 58% వరకు, సైనొలిపిడులు 5%శాతం ఉన్నాయి.
కుసుం నూనె భౌతిక లక్షణాల పట్టిక [7][8]
భౌతిక లక్షణాలు | మితి |
తేమ, మలినాలు | 0.25% గరిష్ఠం |
రంగు, 1/4"సెల్ (Y+5R) | 25 గరిష్ఠం |
వక్రీభవన సూచిక 500Cవద్ద | 1.456-1.460 |
ఐయోడిన్ విలువ | 48-60 |
సపనిఫికెసను విలువ | 220-240 |
అన్‌సఫొనిపియబుల్ పదార్థం | 3.0% గరిష్ఠం |
టైటెర్ విలువ | 450C కనీసం |
R-M విలువ | 15-20 |
విశిష్ట గురుత్వం 950C /300Cవద్ద | 0.8642-0.8990 |
ఆమ్ల విలువ | 10.0% గరిష్ఠం |
polenskey value, Max | 1.5 |
కుసుమ్ గింజలనూనెలోని కొవ్వు ఆమ్లంలశాతం[8][9]
కొవ్వు ఆమ్లాలు | శాతం |
మిరిస్టిక్ ఆమ్లం (C14:0) | 1.0 |
పామిటిక్ ఆమ్లం (C16:0) | 5.3-8.7 |
స్టియరిక్ ఆమ్లం (C18:0) | 1.7-6.3 |
అరచిడిక్ ఆమ్లం (C20:0) | 20-31 |
లిగ్నొసెరిక్ ఆమ్లం (C24:0) | 1.5-3.5 |
ఒలిక్ ఆమ్లం (C18:1) | 40-66 |
లినొలిక్ ఆమ్లం (C18:2) | 2.5-5.2 |