కృష్ణం వందే జగద్గురుమ్ | |
---|---|
దర్శకత్వం | జాగర్లమూడి రాధాకృష్ణ |
నిర్మాత | జాగర్లమూడి సాయిబాబు రాజీవ్ రెడ్డి |
తారాగణం | దగ్గుబాటి రానా నయనతార |
ఛాయాగ్రహణం | వి. ఎస్. జ్ఞానశేఖర్ |
సంగీతం | మణిశర్మ |
నిర్మాణ సంస్థ | |
పంపిణీదార్లు | 7 సీస్ ఇంక్ (overseas)[1] |
విడుదల తేదీ | నవంబరు 30, 2012 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కృష్ణం వందే జగద్గురుమ్ 2012లో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై విడుదలైన తెలుగు చిత్రం. ఇందులో రానా, నయనతార ప్రధాన పాత్రలు పోషించారు.
అనాథ అయిన బీటెక్ బాబు (రానా) సురభి నాటక సమాజం నీడలో పెరిగి పెద్దవాడు అవుతాడు. ఆ సంస్థను నిర్వహించే సురభి సుబ్రహ్మణ్యం (కోట శ్రీనివాసరావు) ఆశలన్నీ బీటెక్ బాబు మీదనే ఉంటాయి. అయితే మేకప్ కంపు కొట్టే ఈ జీవితాన్ని వదిలేసి, అమెరికా వెళ్ళి అక్కడే సెటిల్ అవ్వాలని బీటెక్ బాబు ఆశపడతాడు. ఆ దిశగా ప్రయత్నమూ చేస్తాడు. మనవడి కోరికను మన్నించలేని సురభి సుబ్రహ్మణ్యం దిగులుతో హఠాత్తుగా మరణిస్తాడు. ఆయన చివరి కోరికలలో ఒకటి తన అస్తికలను తన స్వగ్రామంలోని చెరువులో కలపాలని, రెండు బళ్ళారిలో జరిగే నాటకోత్సవాలలో 'కృష్ణం వందే జగద్గురుమ్' నాటకాన్ని తమ సంస్థ ఆడాలని. ఈ రెండు కోరికలూ తీర్చి అమెరికా వెళ్ళి పోవాలనుకుంటాడు బిటెక్ బాబు. ట్రూప్ తో కలిసి బళ్ళారికి ప్రయాణ మౌతాడు. అక్కడే కథ మలుపుతిరుగుతుంది. అక్రమమైనింగ్ చేస్తూ లక్షల కోట్లను ఆర్జిస్తుంటాడు రెడ్డప్ప (మిలింద్ గునాజీ). అతని అకృత్యాలను డాక్యుమెంటరీగా తెరకెక్కిస్తూ సీబీఐకీ సమాచారం అందిస్తుంటుంది జర్నలిస్ట్ దేవిక (నయనతార). అనుకోకుండా తారసపడిన దేవికను చూడగానే ప్రేమలో పడతాడు బీటెక్ బాబు. అక్రమ మైనింగ్ కారణంగా తాత పుట్టిన ఊరు, అక్కడి వాగు కనుమరుగయ్యాయని తెలుస్తుంది. దీనికి సూత్రధారి రెడ్డప్ప అనే విషయమూ అర్థమౌతుంది. నాటకం చూడటానికి వచ్చిన రెడ్డప్ప మనుషులతో బీటెక్ బాబుకు గొడవ జరుగుతుంది. అదే సమయంలో తన పుట్టు పూర్వోత్తరాలను ఓ మహిళ ద్వారా బీటెక్ బాబు తెలుసుకుంటాడు. చెడు అలవాట్లకు బానిస అయిన మేనమామ చక్రవర్తి (మురళీ శర్మ) తన తల్లిదండ్రులను చంపాడని అర్థమౌతుంది. అక్రమ మైనింగుకు పాల్పడే రెడ్డప్పను దేవిక, తన మేనమామను హతమార్చాలనుకున్న బీటెక్ బాబు ఎలా లక్ష్యాన్ని చేధించారన్నదే ముగింపు.[2]
అరరే పసి మనసా , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం.నరేంద్ర , శ్రావణ భార్గవి
సాయి అందరినను , రచన; ఇ.ఎస్ . మూర్తి, గానం.శ్రేయా ఘోషల్ , రాహూల్ సింప్లీ గంజ్ , దీపు
కృష్ణం వందే జగద్గురుం, రచన:సిరివెన్నెల సీతారామశాస్త్రి గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
స్పైసీ స్పైసి గర్ల్ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి, గానం . హేమచంద్ర,శ్రావణ భార్గవి, కె ఎస్ చిత్ర
రంగ మార్తాండ , రచన: సాయి మాధవ్ బుర్రా, గానం.రఘుబాబు , హేమచంద్ర , బుర్ర సాయి మాధవ్
చల్ చల్ చల్, రచన: సాయి మాధవ్ బూర్రా , గానం.జొన్న
పరిణామం (ఇన్స్ట్రుమెంటల్) ఎవలోషన్ థీమ్