కె.ఎస్.నిసార్ అహ్మద్ K.S. Nissar Ahmed ಕೆ.ಎಸ್.ನಿಸಾರ್ ಅಹಮದ್ | |
---|---|
![]() కె.ఎస్.నిసార్ అహ్మద్ | |
Born | దేవనహళ్ళి, బెంగళూరు, కర్నాటక | 1936 ఫిబ్రవరి 5
Died | 3 మే 2020[1] | (aged 84)
Occupation | రచయిత, ప్రొఫెసర్ |
Language | కన్నడ |
Nationality | భారతదేశం |
Genre | కన్నడ సాహిత్యం |
Subject | కాల్పనిక రచన |
Literary movement | నవ్య |
Notable works | మనసు గాంధీ బజారు (1960) నిత్యోత్సవ |
Notable awards | పద్మశ్రీ 2008 రాజ్యోత్సవ అవార్డు 1981 |
కె.ఎస్.నిసార్ అహ్మద్ (జననం. ఫిబ్రవరి 5 1936 - మరణం మే 3 2020 ) కన్నడ భాషకు చెందిన భారతీయ రచయిత.[2] వీరి పూర్తి పేరు కొక్కరె హోసహళ్ళి శేఖ్‍హైదర్ నిసార్ అహ్మద్. ఇతని తండ్రి కె.స్.హైదర్ రెవెన్యూ శాఖలో చేరక ముందు శానిటరీ ఇన్స్పెక్టర్ గా, ఉపాధ్యాయునిగా పనిచేసాడు. ఈయన భూగర్భ శాస్త్రంలో పోస్టుగ్రాడ్యుయేట్ తీసుకొని, మైసూరు గనులు, భూగర్భశాస్త్ర విభాగం, గుల్బర్గాలో కొన్నాళ్లు అసిస్టెంటు భూగర్భ శాస్త్రవేత్తగా పనిచేశాడు.ఆ సమయం లోనే రచయిత కువెంపుతో పరిచయం కలిగింది. ఆ పరిచయం కారణంగా 1959 లో మైసూరు దసరా ఉత్సవాలలో జరిగే కన్నడ రచయితల సమావేశానికి ఆహ్వానించబడ్డాడు. ఆయన కొన్నాళ్లపాటు బెంగళూరు సెంట్రల్ కళాశాల లో, తర్వాత చిత్రదుర్గలో భూగర్భశాస్త్ర ఉపన్యాసకునిగా పనిచేశాడు. ఆ తర్వాత శివమొగ్గలోని సహ్యాద్రి ఫస్టు గ్రేడు కాలేజిలో రెండు దఫాలుగా 1967-1972, 1975-1978 సంవత్సరాలలో పనిచేశాడు.[3]
అతనికి బాగా పేరుతెచ్చినది "నిత్యోత్సవ" గీతం.[3] 1978 లో కన్నడంలో మొదటి లలితగీతాల కేసెట్టు విడుదల అయినప్పుడు, అందులోని "నిత్యోత్సవ" గీతం, ఆ పాటకు సమకూర్చిన సంగీతపు బాణీ, పాటలోని భావాల మేలు కలయిక వలన, బాగా జనాదరణ పొందింది.
చీలీ దేశపు రచయిత పాబ్లో నెరూడా గీతాలను "బరి మర్యాదస్తరె" (మర్యాదస్తులు మాత్రమే) పేరుతో కన్నడం లోకి అనువదించాడు. "కురిగళు సార్ నావు కురిగళు", "భారతవు నమ్మ దేశ" ( ఇక్బాల్ అహమ్మద్ గీతం "సారే జహాన్ సె అచ్ఛా"కు అనువాదం), బెణ్ణె కద్ద నమ్మకృష్ణ" గీతాలు ఆయన రచనలలో కొన్ని. ఆయన వ్రాసిన గీతం "నిమ్మోదనిద్దు, నిమ్మంతాగడె"లో తన మతపు మూలాలను పాటించడానికి తాను పడిన విచికిత్సను బాధాత్మకంగా వర్ణించాడు.