కె. శంకరనారాయణన్ | |||
| |||
పదవీ కాలం 22 జనవరి 2010 – 24 ఆగష్టు 2014 | |||
ముందు | ఎస్.సి. జమీర్ | ||
---|---|---|---|
తరువాత | సి.హెచ్.విద్యాసాగర్ రావు | ||
5వ జార్ఖండ్ గవర్నర్
| |||
పదవీ కాలం 26 జులై 2009 – 21 జనవరి 2010 | |||
ముందు | సయ్యద్ సిబ్తే రాజీ | ||
తరువాత | ఎం.ఓ.హెచ్. ఫరూక్ | ||
13వ నాగాలాండ్ గవర్నర్
| |||
పదవీ కాలం 3 ఫిబ్రవరి 2007 – 28 జులై 2009 | |||
ముందు | శ్యామల్ దత్తా | ||
తరువాత | గుర్బచన్ జగత్ | ||
పదవీ కాలం 26 జూన్ 2009 – 27 జులై 2009 | |||
ముందు | శివ చరణ్ మాథుర్ | ||
తరువాత | సయ్యద్ సిబ్తే రాజీ | ||
పదవీ కాలం 4 సెప్టెంబర్ 2007 – 26 జనవరి 2008 | |||
ముందు | శీలేంద్ర కుమార్ సింగ్ | ||
తరువాత | జోగిందర్ జస్వంత్ సింగ్ | ||
పదవీ కాలం 7 ఏప్రిల్ 2007 – 14 ఏప్రిల్ 2007 | |||
ముందు | ఎం.ఎం. జాకబ్ | ||
తరువాత | ఎస్. కే. సింగ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాలక్కాడ్ , బ్రిటిష్ ఇండియా | 1932 అక్టోబరు 15||
మరణం | 2022 ఏప్రిల్ 24 శేఖరీపురం , భారతదేశం | (వయసు 89)||
రాజకీయ పార్టీ | కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ప్రొఫెసర్ కె రాధ | ||
సంతానం | 1 కుమార్తె |
కటీకల్ శంకరనారాయణన్ (1932 అక్టోబరు 15 - 2022 ఏప్రిల్ 24) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. అతను మహారాష్ట్ర[1], నాగాలాండ్[2], జార్ఖండ్ రాష్ట్రాలకు గవర్నర్‌గా పని చేశాడు.
కె. శంకరనారాయణన్ 1946లో విద్యార్థి రాజకీయాల ద్వారా తన కాంగ్రెస్ పార్టీతో రాజకీయ జీవితాన్ని ప్రారంభించి ఆయన త్రిథాల నుండి ఐదవ కేరళ శాసనసభకు, శ్రీకృష్ణాపురం నుండి ఆరవ కేరళ శాసనసభకు, ఎనిమిదవ అసెంబ్లీకి ఒట్టపాలెం నుండి, 11వ అసెంబ్లీకి పాలక్కాడ్ నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు. ఆయన 1977లో కె. కరుణాకరన్ మంత్రివర్గంలో వ్యవసాయం, పశుపోషణ, పాడిపరిశ్రమ అభివృద్ధి, సమాజాభివృద్ధి శాఖల మంత్రిగా, 2001 నుండి 2004 వరకు ఎకె ఆంటోనీ మంత్రివర్గంలో ఆర్థిక, ఎక్సైజ్ శాఖల మంత్రిగా పని చేశాడు. ఆయన 1985 నుంచి 2001 వరకు 16 ఏళ్లపాటు కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రండ్ (యూడీఎఫ్) కన్వీనర్‌గా ఉన్నాడు.
కె. శంకరనారాయణన్ నాగాలాండ్, జార్ఖండ్, మహారాష్ట్ర రాష్ట్రాలకు గవర్నర్‌గా, అరుణాచల్ ప్రదేశ్, అసోం, గోవా గవర్నర్‌గా అదనపు బాధ్యతలు నిర్వహించాడు.
కె. శంకరనారాయణన్ వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతూ కేరళలో పాలక్కాడ్‌లోని తన నివాసంలో 2022 ఏప్రిల్ 24న మరణించాడు. అతని భార్య రాధ మరణించింది. ఓ కుమార్తె అనుపమ ఉన్నారు.[3][4]