కొండా విశ్వేశ్వర్ రెడ్డి | |||
| |||
పార్లమెంట్ సభ్యులు (లోక్ సభ)
| |||
పదవీ కాలం 2024-ప్రస్తుతం | |||
ముందు | రంజిత్ రెడ్డి | ||
---|---|---|---|
నియోజకవర్గం | చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం | ||
పార్లమెంట్ సభ్యుడు (లోక్ సభ)
| |||
పదవీ కాలం 2014-2019 | |||
నియోజకవర్గం | చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | 1960 ఫిబ్రవరి 26||
రాజకీయ పార్టీ | భారతీయ జనతా పార్టీ | ||
తల్లిదండ్రులు | కొండా మాధవరెడ్డి, కొండా జయలతాదేవి [1] | ||
జీవిత భాగస్వామి | సంగీత రెడ్డి అపోలో హస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ | ||
నివాసం | హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం | ||
మతం | హిందూ | ||
వెబ్సైటు | కొండా విశ్వేశ్వర్ రెడ్డి |
కొండా విశ్వేశ్వర్ రెడ్డి, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు, ప్రస్తుతం పార్లమెంటు సభ్యుడు. 2014,2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్ర సమితి,భారతీయ జనతా పార్టీ తరపున చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుండి పోటిచేసి గెలుపొందాడు.[2] [3]ఇతని తాత కొండా వెంకట రంగారెడ్డి పేరుతో రంగారెడ్డి జిల్లా పేరు పెట్టారు. డెక్కన్ క్రానికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని రాజకీయ నాయకులలో కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధనికుడు (4568 కోట్లు).[4]
విశ్వేశ్వర్ రెడ్డి 1960, ఫిబ్రవరి 26న కొండా మాధవరెడ్డి (ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర మాజీ ప్రధాన న్యాయమూర్తి), జయలత దంపతులకు తెలంగాణ రాష్ట్రం లోని హైదరాబాద్‌లో జన్మించాడు. విశ్వేశ్వర్ రెడ్డి తాత కొండా వెంకట రంగారెడ్డి తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి. రంగారెడ్డి పేరుమీదుగా తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా అని పేరు పెట్టారు.
న్యూజెర్సీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఎన్.జే, ఎసెక్స్ కౌంటీ కాలేజ్ నెవార్క్ లలో అధ్యాపకులుగా పనిచేశాడు.
వీరు అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకుడు ప్రతాప్ సి రెడ్డి కుమార్తె సంగీతా రెడ్డిని వివాహం చేసుకున్నాడు.[5] వీరికి ముగ్గురు కుమారులు (ఆనందిత్, విశ్వజిత్, విరాజ్).
విశ్వేశ్వర్ రెడ్డి సాఫ్ట్వేర్ వ్యవస్థాపకులు. కోట రీసెర్చ్ & సొల్యూషన్స్ ఇంజనీరింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనే సంస్థను స్థాపించాడు. అనేక ఐ.పి.ఆర్. యొక్క క్రియేషన్స్ లో పాల్గొన్నాడు. జనరల్ ఎలక్ట్రిక్ లో చీఫ్ ఎగ్జిక్యైటీవ్ ఆఫీసర్ గా, జి.ఇ ఎం.ఎస్.ఐ.టి, హెచ్.సి.ఐ.టి. ల యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గా పనిచేశాడు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్నాడు. 2013లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్ రావు ఆహ్వానం మేరకు రాజకీయాల్లోకి వచ్చాడు. 2014 ఎన్నికల్లో 75,000 ఓట్లకు పైగా తేడాతో చేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందాడు. 2018, నవంబరులో తెలంగాణ రాష్ట్ర సమితికి రాజీనామా చేసి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సమక్షంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరాడు. తరువాత 2021 మార్చిలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు.[6] అనంతరం 2022 జూలై 03న భారతీయ జనతా పార్టీలో చేరాడు.[7] ఆయన 2024లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో చేవెళ్ల నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి జి.రంజిత్ రెడ్డి పై 1,72,897 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండోసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికై,[8] జులై 29న లోక్‌సభలో విప్‌గా నియమితుడయ్యాడు.[9]
{{cite web}}
: CS1 maint: url-status (link)