కోయంబత్తూరు-షొరనూర్ రైలు మార్గం | |||
---|---|---|---|
అవలోకనం | |||
స్థితి | పనిచేస్తోంది | ||
లొకేల్ | తమిళనాడు, కేరళ | ||
చివరిస్థానం | కోయంబత్తూరు జంక్షను షొరనూర్ జంక్షను | ||
ఆపరేషన్ | |||
ప్రారంభోత్సవం | 1861 | ||
యజమాని | భారతీయ రైల్వేలు | ||
నిర్వాహకులు | దక్షిణ రైల్వే | ||
డిపో (లు) | ఈరోడ్ | ||
రోలింగ్ స్టాక్ | WDM-2, WDM-3A, WDM-3D, WDG-3A, WDG-4 డీజిల్ లోకోలు; WAG-7, WAP-4 ఎలక్ట్రిక్ లోకోలు | ||
సాంకేతికం | |||
ట్రాక్ పొడవు | ప్రధాన మార్గం: 88 కి.మీ. (55 మై.) కోయంబత్తూరు-మెట్టుపాళయం54 కి.మీ. (34 మై.) | ||
ట్రాక్ గేజ్ | 1,676 mm (5 ft 6 in) | ||
ఆపరేటింగ్ వేగం | 130 kilometres per hour (81 mph) | ||
అత్యధిక ఎత్తు | కోయంబత్తూరు 411 మీటర్లు (1,348 అ.) షొరనూరు 26 మీటర్లు (85 అ.) పాలక్కాడ్ 84 మీటర్లు (276 అ.) | ||
|
కోయంబత్తూరు-షోరనూర్ లైన్ తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూర్, కేరళలోని షోరనూర్లను కలుపుతుంది. పొత్తనూర్ - కోయంబత్తూర్ - మెట్టుపాళయం, మెట్టుపాళయం నుండి ఉదగమండలం వరకు నీలగిరి మౌంటైన్ రైల్వే అనే బ్రాంచ్ లైన్ ఉంది. ఈ నెట్వర్కు, కేరళలోని రైల్వే నెట్వర్కును పాలక్కాడ్ గ్యాప్ ద్వారా తమిళనాడులోని నెట్వర్క్కు కలుపుతుంది.
1856లో దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి రైలు సేవ, భారతదేశంలో మూడవది మద్రాసు రైల్వే ద్వారా రాయపురం నుండి వాలాజా రోడ్ వరకు మొదలైంది. మద్రాస్ రైల్వే 1861 లో దాని ట్రంక్ మార్గాన్ని కోజికోడ్ వరకు విస్తరించింది. [1] పోదనూరు-మెట్టుపాళయం లైను 1873లో ట్రాఫిక్కు తెరవబడింది. యునెస్కో హెరిటేజ్ ట్రాక్, నీలగిరి మౌంటైన్ రైల్వేను రెండు దశల్లో ప్రారంభించారు. మెట్టుపాళయం-కూనూర్ సెక్షన్ను 1899లో ప్రారంభించారు. 1908లో దీన్ని ఉదగమండలం (ఊటీ) వరకు విస్తరించారు [2] [3]
కోయంబత్తూర్-షోరనూర్ లైన్ను "గ్రూప్ B" గా వర్గీకరించారు. ఇక్కడ వేగం 130 కిమీ/గం వరకు ఉంటుంది. ప్రస్తుతం అనుమతించిన గరిష్ట వేగం, పాలక్కాడ్ షోరనూర్ సెక్షనులో 110 కిమీ/గం. [4]
ఈ లైన్లో ఉన్న కోయంబత్తూర్, పాలక్కాడ్ స్టేషన్లు భారతీయ రైల్వేల టాప్ వంద బుకింగ్ స్టేషన్లలో ఉన్నాయి. [5] ఇటీవలి వర్గీకరణ ప్రకారం కోయంబత్తూరును NSG-1గా వర్గీకరించారు.