![]() 2022 లో వోక్స్ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వ్యక్తిగత సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|---|
పూర్తి పేరు | క్రిస్టొఫర్ రోజర్ వోక్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పుట్టిన తేదీ | బర్మింగ్‌హామ్, వెస్ట్ మిడ్‌లాండ్స్, ఇంగ్లాండ్ | 2 మార్చి 1989|||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మారుపేరు | The Wizard[1] | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ఎత్తు | 6 అ. 2 అం. (1.88 మీ.) | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బ్యాటింగు | కుడిచేతి వాటం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
బౌలింగు | కుడిచేతి ఫాస్ట్-మీడియం | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
పాత్ర | ఆల్ రౌండరు | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
అంతర్జాతీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
జాతీయ జట్టు |
| |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి టెస్టు (క్యాప్ 657) | 2013 ఆగస్టు 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి టెస్టు | 2023 జూలై 27 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి వన్‌డే (క్యాప్ 217) | 2011 జనవరి 21 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి వన్‌డే | 2023 మార్చి 3 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
వన్‌డేల్లో చొక్కా సంఖ్య. | 19 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
తొలి T20I (క్యాప్ 51) | 2011 జనవరి 12 - ఆస్ట్రేలియా తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
చివరి T20I | 2023 మార్చి 14 - బంగ్లాదేశ్ తో | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
T20Iల్లో చొక్కా సంఖ్య. | 19 | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
దేశీయ జట్టు సమాచారం | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
Years | Team | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2006–present | వార్విక్‌షైర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2012/13 | వెల్లింగ్టన్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2013/14 | సిడ్నీ థండర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2017 | కోల్‌కతా నైట్‌రైడర్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2018 | రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2021 | ఢిల్లీ క్యాపిటల్స్ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
2022–2023 | Birmingham Phoenix | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
కెరీర్ గణాంకాలు | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
| ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
మూలం: ESPNcricinfo, 31 July 2023 |
క్రిస్టోఫర్ రోజర్ వోక్స్ (జననం 1989 మార్చి 2) అన్ని ఫార్మాట్లలో ఇంగ్లండ్ తరపున అంతర్జాతీయంగా ఆడే ఒక క్రికెటరు. దేశీయ క్రికెట్‌లో, అతను వార్విక్‌షైర్‌కు ప్రాతినిధ్యం వహిస్తాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్‌లకు ఆడాడు.
వోక్స్ 2011లో వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) ట్వంటీ 20 ఇంటర్నేషనల్ (T20I) రంగప్రవేశం చేసాడు. 2013లో తొలి టెస్టు ఆడాడు. అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్, [2] 2022 T20 ప్రపంచ కప్ గెలిచిన ఇంగ్లండ్ జట్లలో సభ్యుడు. [3]
వోక్స్ 1989 మార్చిలో బర్మింగ్‌హామ్‌లో జన్మించాడు. అతను 2000 నుండి 2007 వరకు వాల్సాల్‌లోని బార్ బెకన్ లాంగ్వేజ్ కాలేజీలో చదివాడు. ఏడు సంవత్సరాల వయస్సులో ఫోర్ ఓక్స్ సెయింట్స్ క్రికెట్ క్లబ్‌లో క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. అతను హియర్‌ఫోర్డ్‌షైర్ కౌంటీ క్రికెట్ క్లబ్ కోసం 2006 మైనర్ కౌంటీస్ ట్రోఫీలో మూడు గేమ్‌లు ఆడాడు. 2004, 2007 మధ్య వార్విక్‌షైర్ అండర్-15, అండర్-17, అకాడమీ, సెకండ్ XI జట్లకు ఆడాడు [4] వోక్స్ స్థానిక ఫుట్‌బాల్ క్లబ్ ఆస్టన్ విల్లా FC కి మద్దతుదారు. [5] 14 సంవత్సరాల వయస్సు వరకు వాల్సాల్ FC లో వింగర్‌గా ట్రైనీ ఫుట్‌బాల్ ఆటగాడు.[6]
వోక్స్ తన తొలి అంతర్జాతీయ ట్వంటీ20 మ్యాచ్, 2011 జనవరి 12న అడిలైడ్‌లో ఆస్ట్రేలియాపై ఆడాడు. బౌలింగ్‌ను ప్రారంభించి, అతను 1/34 గణాంకాలు సాధించాడు. తరువాత విజయానికి అవసరమైన పరుగు చేశాడు. [7] [8] టూర్‌లోని వన్డే మ్యాచ్‌లన్నింటిలోనూ అతను కనిపించాడు. అతని రెండవ వన్డే ఇంటర్నేషనల్‌లో 6/45 పాయింట్లు సాధించాడు. వోక్స్ 2012లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్‌డే సిరీస్ జట్టులో తిరిగి చేరాడు. ఆ సంవత్సరం తర్వాత భారత, న్యూజిలాండ్‌లతో జరిగిన వన్డే జట్టులో ఆడాడు.
2013 యాషెస్ సిరీస్‌లో ఆఖరి టెస్టులో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్‌లో వోక్స్ తొలి ఇన్నింగ్స్‌లో 1/96తో రంగప్రవేశం చేశాడు. శ్రీలంక, భారతజట్లతో ఆడే జట్టులో స్థానం పొందిన తరువాత వోక్స్, 2014 వేసవిలో తన మొదటి టెస్టును భారతదేశంతో జరిగిన మూడవ టెస్టులో ఆడాడు. అతను ఇంగ్లాండ్ వన్‌డే జట్టులో భాగంగా, మొత్తం నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 2014 చివరిలో శ్రీలంకలో పర్యటించిన వన్‌డే జట్టులో ఎంపికయ్యాడు. గాయపడిన సీనియర్ బౌలర్లు స్టూవర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్ లేకుండా ఇంగ్లాండ్ పర్యటించింది. దాంతో వోక్స్ కొత్త బంతితో బౌలింగు మొదలుపెట్టాడు. సిరీస్‌లోని ఐదవ మ్యాచ్‌లో అతను 6/47 గణాంకాలు సాధించాడు, ఇది ESPNCricinfo ద్వారా సంవత్సరంలో అత్యుత్తమ వన్‌డే బౌలింగ్ ప్రదర్శనగా నామినేట్ చేయబడింది. [9]
అతను 2015 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో భాగంగా ఉన్నాడు. అయితే గాయం కారణంగా టోర్నమెంట్‌లో ఇంగ్లాండ్ చివరి మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. గాయం తర్వాత, వోక్స్ 2015/16లో ఆస్ట్రేలియా, పాకిస్తాన్‌లతో జరిగిన వన్‌డే సిరీస్‌కు, దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు జట్టు కోసం తిరిగి వచ్చాడు. 2016 జూన్ 21న, అతను శ్రీలంకతో జరిగిన మొదటి వన్‌డేలో అజేయంగా 95 పరుగులతో తన అత్యధిక వన్‌డే స్కోరును సాధించాడు. అతని స్కోరు వన్‌డే చరిత్రలో ఎనిమిదో లేదా అంతకంటే తక్కువ స్థానంలో వచ్చిన బ్యాటరు చేసిన అత్యధిక వన్‌డే స్కోరు. అతను తన తోటి ఇంగ్లీషు ఆటగాడు సామ్ కుర్రాన్‌తో ఈ రికార్డు పంచుకున్నాడు. [10] అతను 2018 ఆగస్టులో లార్డ్స్‌లో భారతదేశానికి వ్యతిరేకంగా (137 నాటౌట్) తన మొదటి టెస్టు సెంచరీ చేసాడు. ఆ మైదానం లోనే రెండు సంవత్సరాల ముందు అతను పాకిస్తాన్‌పై 11/102 తో తన అత్యుత్తమ మ్యాచ్ గణాంకాలను సాధించాడు. ఈ విన్యాసాలు అతనికి లార్డ్స్ ఆనర్స్ బోర్డులు రెండింటిలోనూ స్థానం సంపాదించిపెట్టాయి. దీనిని సాధించిన పది మంది ఆటగాళ్లలో అతనొకడు. ఒక మ్యాచ్‌లో పది వికెట్లు తీసినవారిలో ఐదవవాడు. [11] [12]
అతను ఇంగ్లాండ్ వన్డే, టెస్టు స్క్వాడ్‌లలో కనిపించడం కొనసాగింది. 2019 ఏప్రిల్‌లో 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [13] [14] ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ సెమీ-ఫైనల్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ న్యూజిలాండ్‌ల జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు.[15]
2020 జూన్ 17న, వెస్టిండీస్‌తో జరిగిన టెస్టు సిరీస్ కోసం శిక్షణ నివ్వడానికి ఎంపిక చేసిన 30 మంది సభ్యుల జట్టులోకి వోక్స్‌ను తీసుకున్నారు. [16] [17] తర్వాత మొదటి టెస్టు మ్యాచ్ కోసం పదమూడు మంది సభ్యుల ఇంగ్లాండ్ జట్టులో స్థానం పొందాడు.[18] [19] రెండో టెస్టులో, వోక్స్ టెస్టు మ్యాచ్‌ల్లో తన 100వ వికెట్‌ను సాధించాడు. [20] క్రిస్ వోక్స్ 2021 లో ఇంగ్లండ్‌లో శ్రీలంక [21] జరిగిన 1వ వన్‌డేలో పాతుమ్ నిస్సాంక వికెట్ పడగొట్టడం ద్వారా అతని కెరీర్‌లో 150 వన్‌డే వికెట్లను చేరుకున్నాడు.
2021 సెప్టెంబరులో, వోక్స్ 2021 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. [22] 2022 సెప్టెంబరులో, వోక్స్ 2022 ICC పురుషుల T20 ప్రపంచ కప్ కోసం ఇంగ్లాండ్ జట్టులో ఎంపికయ్యాడు. ఫైనల్‌లో పాకిస్తాన్‌ను ఓడించి, టోర్నమెంట్‌ను గెలుచుకున్న ఇంగ్లండ్ జట్టులో వోక్స్ ప్రతి గేమ్‌లో ఆడాడు. 2019 వన్‌డే, 2022 T20 ప్రపంచ కప్ విజేత స్క్వాడ్‌లలో ఆడిన 6 మంది ఆటగాళ్లలో వోక్స్ ఒకడు.
2023లో, హెడింగ్లీలో జరిగిన 3వ టెస్టు కోసం 2023 యాషెస్‌కు వోక్స్‌ను తిరిగి తీసుకున్నారు. అక్కడ అతను ఒక్కో ఇన్నింగ్స్‌లో మూడు వికెట్లు పడగొట్టాడు. [23] రెండో ఇన్నింగ్స్‌లో అతను 32 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. హ్యారీ బ్రూక్‌తో అతని 59 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్‌కు మ్యాచ్‌లో అతిపెద్దది. [24] సిరీస్‌లో అతని ప్రదర్శనలకు, కీలక దశల్లో కీలకమైన వికెట్లు తీయడం, ఆడిన 6 ఇన్నింగ్స్‌లలో 19 వికెట్లు తీయడం కారణాంగా అతను ఇంగ్లాండ్ "ప్లేయర్ ఆఫ్ ది సిరీస్"గా ఎంపికయ్యాడు. [25]