క్రెస్కోగ్రాఫ్ : crescograph ఒక కొలమాణి, వృక్షాల అభివృద్ధిని కొలిచే సాధనం. 20వ శతాబ్దపు ఆరంభంలో సర్ జగదీశ్ చంద్ర బోస్ చే ఆవిష్కరింపబడింది. జె.సి.బోస్, భారత్ కు చెందిన ఒక భౌతికశాస్త్రవేత్త, జంతుశాస్త్రవేత్త, వృక్షశాస్త్రవేత్త, పురావస్తుశాస్త్రవేత్త, బహుశాస్త్ర ప్రజ్నాశాలి (పాలిమత్).
ఈ క్రెస్కోగ్రాఫ్ లో గడియారపుగేర్లు, ఒక పొగగ్లాసు ప్లేటును వృక్షముల శీర్షాలను గాని వేర్ల భాగాలను గాని పెరిగేభాగాలను కొలిచేందుకు ఉపయోగిస్తారు. దీనిలోని కొలబద్దలో 10,000 పాయింట్లవరకు కొలిచేందుకు వీలుంటుంది. ప్లేటుపై వృక్షముల పెరుగుదల రేటు ప్రతి సెకనులో గుర్తించుటకు వీలుంటుంది. అనేకానేక పరిస్థితులలో వృక్షముల పెరుగుదల తేడాలను గుర్తించే వీలుంటుంది. ఉష్ణోగ్రత, రసాయనాలు, వాయువులు, విద్యుచ్ఛక్తి మొదలగు అంశాలను తీసుకుని బోసు పరిశోధనలు చేశాడు.[1]
బోసు ఆవిష్కరణతో ప్రేరణ పొంది, నవీన ఎలక్ట్రానిక్ క్రెస్కోగ్రాఫ్ [2] ని రండాల్ ఫోంటెస్ అను శాస్త్రవేత్త కనిపెట్టాడు. రండాల్, స్టాంఫోర్డ్ రీసెర్చ్ ఇంస్టిట్యూట్ లో మొక్కల కదలికలను కనిపెట్టేందుకు ఉపయోగించాడు. (S.R.I ప్రాజెఖ్టు 3194 (టాస్క్ 3) నవంబరు 1975) ఈ ప్రయోగం ద్వారా రిపోర్టు ద్వారా“ఆర్గానికి బయోఫీల్డ్ సెంసర్” [3] ను, హెచ్.ఇ.పుట్‌హాఫ్ , రండాల్ ఫోంటెస్ కనుగొన్నారు.
ఈ ఎలక్ట్రానిక్ క్రెస్కోగ్రాఫ్, మొక్కల కదలికలను గమనించే సాధనం, దీని ద్వారా మొక్కల పెరుగుదల రేటు, కొలత, అతిసూక్ష్మంగా 1/1,000,000 ఒక ఇంచీలో భాగం వరకూ కొలవవచ్చు. సాధారణగా 1/1000 నుండి 1/10,000 ఇంచ్ లలోని భాగం వరకూ కొలిచే అవకాశంవుంది. దీనిలోని మైక్రోమీటరు ఆధారంగా అతి సూక్ష్మమైన కొలత 10,000,000 భాగాలవరకూ కొలవవచ్చును.