ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము

కాజీపేట-విజయవాడ మార్గము
కి.మీ./ 0 కాజీపేట, నాగాపూర్-హైదరాబాదు రైలు మార్గము వైపుకు
10 వరంగల్
15 వంచనగిరి
23 చింతలపల్లి
30 ఎలగూర్
40 నెక్కొండ
49 ఇంతకన్నె
55 కేసముద్రం
62 తాడ్ల పూసపల్లి
70 మహబూబాబాద్
82 గుండ్రాతిమడుగు
90 గార్ల
95 డోర్నకల్
9 పోచారం
16 కారెపల్లి
మాదారం డోలోమైట్ మైంస్
ఎల్లందు(సింగరేణి కాలరీస్)
21 గాంధీపురం(హల్ట్)
38 చిమల్‌ పహాడ్
43 తడకలపూడి
50 బేతంపూడి
54 భద్రాచలం రోడ్
కొత్తగూడెం టిపిఎస్
65 గాజులగూడెం
82 పాండురంగాపురం
95 అశ్వాపురం
107 మణుగూరు
సింగరేణి కాలరీన్
110 మల్లెలడుగు
118 ఖమ్మం
127 పందిళ్ళపల్లి
133 చింతకాని
140 నాగల్వంచ
146 బోనకల్లు
156 మోటమర్రి
విష్ణుపురం నకు (పని జరుగుతున్నది)
163 మధిర
172 తొండలగోపవరం
178 ఎర్రుపాలెం
184 గంగినేని
188 చెరువు మాధవరం
ఎన్‌హెచ్ 22
ల్యాంకో కొండపల్లి పవర్ ప్రాజెక్టు
203 కొండపల్లి
208 రాయనపాడు
విశాఖపట్నం-విజయవాడ రైలు మార్గము వైపుకు
218 విజయవాడ జంక్షన్
విజయవాడ-చెన్నై రైలు మార్గము వైపుకు

Source:Google maps
Kazipet-Vijayawada Passenger 57237
Dornakal-Manguru Passenger 57139


ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము ఖాజీపేట విజయవాడ లను కలుపుతుంది.దీని పొడవు 201.14 కీ.మీ. ఈది  ఢిల్లీ-మద్రాసు కలిపే మార్గములో భాగము. 

చరిత్ర

[మార్చు]

కొన్ని సంవత్సరాల ముందు రైల్వేలు ప్రయాణీకుల కోసం పనిచేయటం ఆరంభించింది. భారతదేశం రైల్వే లైన్లులో నిర్మాణ సామాగ్రి వాటిపై తరలించబడ్డాయి. వీటితో పాటు రూర్కీ 1830 సం.లో సమీపంలో గంగా కాలువ మీద సొలానీ కాలువ నిర్మాణం కోసం, రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో చెన్నై సమీపంలో కాలువ నిర్మాణం కోసం, గోదావరి ఆనకట్ట నిర్మాణం రైల్వే 1845 సం. ప్రాంతములో రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం ఆనకట్ట నిర్మాణానికి కావల్సిన సామాగ్రి రవాణా చేయడానికి ఒక లైన్ ఉపయోగించారు. ఈ ప్రాజెక్ట్ 1852 సం.లో పూర్తయ్యింది, ఆ తదుపరి ఈ రైల్వే మూసివేశారు.[1] చెన్నై సమీపంలో రెడ్ హిల్ రైల్ రోడ్ 1837 సం.లో గ్రానైట్ రవాణా కొరకు ఉపయోగించారు. ఇది భారతదేశంలో పనిచేస్తున్న మొదటి రైల్వే వంటిది అని అనేక మంది భావిస్తారు. అంతకుముందు స్థాపించబడిన మద్రాస్ రైల్వే 1853 సం.లో విలీనం చేయబడి, భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే గా 1858 సం.లో ఏర్పాటైంది.[2] భారతదేశం యొక్క గ్రేట్ దక్షిణ రైల్వే 1872 సం.లో కర్నాటిక్ రైల్వే లో విలీనం చేయబడి, 1874 సం.లో దక్షిణ భారతీయ రైల్వే గా పేరు మార్చబడింది. దక్షిణ మరాఠా రైల్వే యొక్క ప్రధాన తూర్పువైపు మార్గం విజయవాడ (అప్పుడు బెజవాడగా పిలుచేవారు) వరకు ఇతర మార్గాలతోను 1888 సం. వరకు అనుసంధానం చేయబడింది. 1889 సం.లో నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే యొక్క ప్రధాన మార్గం విజయవాడ వరకు పొడిగించారు.[3] 1893 నుండి 1896 వరకు ఉన్న మధ్య కాలంలో ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క 1,287 కి.మీ. (800 మైళ్ళు) విజయవాడ నుండి కటక్ వరకు నిర్మించబడింది. ఆ తదుపరి ట్రాఫిక్ కొరకు ప్రారంభిచారు.[4][5] ఓల్డ్ గోదావరి బ్రిడ్జ్ 1897 సం.లో నిర్మాణం జరిగింది.[3],[6] 1899 సం.లో విజయవాడ-మద్రాసు లింక్ లైను నిర్మాణం జరిగి, రైళ్లు ఎకాఎకీ ఈ మార్గము గుండా నడిచేందుకు ప్రారంభించారు.[3] ఈస్ట్ కోస్ట్ స్టేట్ రైల్వే యొక్క దక్షిణ భాగం (వాల్తేరు నుండి విజయవాడ వరకు ) 1901 సం.లో మద్రాస్ రైల్వే వారు హస్తగతం చేసుకున్నారు.[7]

ఖాజీపేట-బాల్హర్ రైలుమార్గము 1929 లో పూర్తి అయీన తరువాత ఢిల్లీ_-మద్రాసు లు నేరుగా అనుసందానించబడీనవి. వాడీ -సికింబాదు రైలు మార్గము1874 లో నిజాము ల ఆర్థిక సహకారముతో మొదలుకాబడీనవి. తరువాత అవి నిజముల రాష్ట్ర రైలు మార్గాములలో భాగంగా మారాయీ. ఆ తరువాత అవి దీనిని విజయవాడ (బెజవాడ) వరకు పొడీగించారు. ఖాజీపేట - విజయవాడ రైలు మార్గము లో  వరంగల్, కేసముద్రం మహాబబాబాద్, డోర్నకల్, మధిర, ఖమ్మం ముఖ్యామయీన రైల్వే స్టేషన్లు.

రైల్వే పునర్వ్యవస్థీకరణ

[మార్చు]

ప్రారంభ 1950 సం.లో, స్వతంత్ర రైల్వే వ్యవస్థలు అప్పట్లో కలిగిన ఉన్న వాటిని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు అధికారిక చట్టాన్ని ఆమోదింఛడము జరిగింది. 1951 సం. ఏప్రిల్ 14 న మద్రాస్, దక్షిణ మరాఠా రైల్వే, దక్షిణ ఇండియన్ రైల్వే కంపెనీ, మైసూర్ స్టేట్ రైల్వే దక్షిణ రైల్వే జోన్ నిర్మించటానికి గాను, విలీనం చెయ్యబడ్డాయి. 1966 సం. అక్టోబరు 2 న గతంలో ఉన్న (1) నిజాంస్ గ్యారంటీడ్ స్టేట్ రైల్వే లో కలసి ఉన్నటువంటి సికింద్రాబాద్, షోలాపూర్, హుబ్లి, విజయవాడ డివిజన్ల ప్రాంతాలు,, (2) దక్షిణ రైల్వే లో విలీనం చేయబడ్డ మద్రాసు రైల్వే, దక్షిణ మరాఠా రైల్వే లోని కొన్ని భాగాలను వేరుచేసి దక్షిణ మధ్య రైల్వే జోన్ (సౌత్ సెంట్రల్ రైల్వే) ఏర్పాటు చేయడం జరిగింది. 1977 సం.లో, దక్షిణ రైల్వే లోని గుంతకల్లు డివిజన్ దక్షిణ మధ్య రైల్వేకు, సోలాపూర్ డివిజన్ సెంట్రల్ రైల్వేకు బదిలీ చేయబడ్డాయి. 2010 సం.లో కొత్తగా రూపొందించిన ఏడు మండలాల వాటిలో ఉన్నటువంటి పశ్చిమ కనుమల రైల్వే జోన్ (సౌత్ వెస్ట్రన్ రైల్వే) అనేది దక్షిణ రైల్వే నుండి. వేరుచేసి ఏర్పాటు చేశారు.[8]

విద్యుదీకరణ

[మార్చు]

విజయవాడ - మధిర  మధ్య విద్యుదీకరణ 1985-86 లోను మధిర-డోర్నకల్ మధ్య 1986-87 లోను  డోర్నకల్ - ఖాజీపేట మధ్య1987-88ల్లో విద్యుదీకరణ పనులు పూర్తి కాబడీనవి.మోటుమారి-జగ్గయపేట్ సరుకు మార్గం 2003 లో కరేపల్లి-భద్రాచలం రోడ్-మనుగురు మార్గం 2008 లోవిద్యుదీకరణ జరిగాయీ.

వేగ పరిమితులు

[మార్చు]

భారతదేశములో అత్యంత ప్రధాన రైలు మార్గముల్లో ఒకటాయెన ఢిల్లీ_-మద్రాసు కలిపే మార్గము ( గ్రాండ్ ట్రంక్ మార్గం) లో ఉండటం వల్ల ఈది అత్యంత వేగము కలిగిన మార్గము గా మారింది. ఈ మార్గము లో వేగ పరిమితి 160 కీ.మి లు.

ప్రయాణీకుల వసతుల

[మార్చు]

విజయవాడ భారతదేశములోనే అత్యదిక బుకింగ్ బుకింగ్ స్టేషన్లు కలిగిన  స్టేషను గా గుర్తించబడీంది.

లోకో షెడ్డ్స్ , కోచింగ్ నిర్వహణ డిపోలు

[మార్చు]

ఖాజీపేట లో డీజిల్ లోకోషెడ్  నిర్వహణ డిపోలు కలవు .2006 లో ప్రారంభించబడీన  ఖాజీపేట విద్యుత్ ఇంజిన్ డిపోలో 150 కు మించీ WAG-7 ఇంజిన్లు కలవు.  విజయవాడ లో విద్యుత్ ఇంజిన్ నిర్వహణ డిపో ను 1980 లో ప్రారంభించారు. దీనిలో 190 కు మించీ విద్యుత్ ఇంజిన్లు ఉన్నాయి. 2 రైలుబస్సులు,30 కు మించి DEM లు, WDM-2, WDP-1 లోకోలు  విజయవాడ డీజిల్ లోకోషెడ్  నిర్వహణ ఉన్నవి.

మోటుమర్రి-జగ్గయ్యపేట మార్గము

[మార్చు]

2012 సం.లో మోటుమర్రి-జగ్గయ్యపేట రైలు మార్గము మేళ్ళచెరువు వరకు విస్తరించబడింది. ఇది గుంటూరు-పగిడిపల్లి-సికిందరాబాద్ రైలు మార్గము లోని విష్ణుపురం వరకు విస్తరించాల్సిన అవసరం ఉంది.

మూలాలు

[మార్చు]
  1. Darvill, Simon. "India's first railways". Godavari Dam Construction Railway. IRFCA. Retrieved 2013-01-19.
  2. "IR History – Early days". 1832-1869. IRFCA. Retrieved 2013-01-19.
  3. 3.0 3.1 3.2 "IR History:Early days II". 1870-1899. IRFCA. Retrieved 2013-01-19.
  4. "Major Events in the Formation of S.E. Railway". South Eastern Railway. Archived from the original on 2013-04-01. Retrieved 2013-01-02.
  5. "History of Waltair Division". Mannanna.com. Archived from the original on 2012-10-11. Retrieved 2013-01-02.
  6. Address Resolution Protocol  Earthling . "Godavari River". En.academic.ru. Retrieved 2012-07-30.{{cite web}}: CS1 maint: extra punctuation (link)
  7. "IR History: Part III (1900-1947)". IRFCA. Retrieved 2013-01-19.
  8. "Geography – Railway Zones". IRFCA. Retrieved 2013-01-23.