ఖైదీ | |
---|---|
దర్శకత్వం | లోకేష్ కనగరాజ్ |
రచన | లోకేష్ కనగరాజ్ పోన్ పార్తీబన్ |
నిర్మాత | ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు ఎస్.ఆర్.ప్రభు తిరుప్పూర్ వివేక్ |
తారాగణం | కార్తీ నరైన్ |
ఛాయాగ్రహణం | సత్యన్ సూర్యన్ |
కూర్పు | ఫిలోమన్ రాజు |
నిర్మాణ సంస్థ | డ్రీమ్ వారియర్ పిక్చర్స్ |
విడుదల తేదీ | 25 అక్టోబరు 2019 |
సినిమా నిడివి | 146 నిముషాలు |
దేశం | ![]() |
భాష | తెలుగు |
బాక్సాఫీసు | est. ₹107కోట్లు[1] |
ఖైదీ 2019లో తమిళంతో పాటు తెలుగులో విడుదలైన యాక్షన్ థ్రిల్లర్ సినిమా. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్.ప్రకాష్‌బాబు, ఎస్.ఆర్.ప్రభు, తిరుప్పూర్ వివేక్ నిర్మించిన ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించాడు. కార్తీ, నరైన్, రమణ, హరీశ్ పేరడీ, జార్జ్ మార్యన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 2019 అక్టోబర్ 25న విడుదలైంది.
డిల్లీ బాబు (కార్తి) ఒక కేసులో యావజ్జీవ కారాగార శిక్ష పడ్డ ఖైదీ. పదేళ్ల శిక్ష పూర్తయ్యాక సత్ ప్రవర్తన కారణంగా మిగతా నాలుగేళ్ల శిక్ష తగ్గించి అతణ్ని విడుదల చేస్తారు. అప్పటిదాకా ఒక్కసారీ చూడని తన కూతురిని చూడాలని బయలుదేరుతుండగా ఒక పెద్ద ప్రమాదం నుంచి దాదాపు 40 మంది పోలీసు అధికారుల్ని కాపాడాల్సిన బాధ్యత అతడిపై పడుతుంది. అతను ఈ పనిని ఎలా నిర్వర్తించాడు? ఈ క్రమంలో తను ప్రాణాల మీదికి ఎలా తెచ్చుకున్నాడు? చివరకు కూతుర్ని అతను కలిసాడు లేదా? అనేదే మిగతా సినిమా కథ.[2][3]
{{cite news}}
: CS1 maint: numeric names: authors list (link) CS1 maint: unrecognized language (link)