ఈ పేరుతో ఉన్న ఇతర పేజీల కోసం గజపతినగరం (అయోమయ నివృత్తి) పేజీ చూడండి.
గజపతినగరం | |
— రెవెన్యూ గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 18°18′00″N 83°20′00″E / 18.3000°N 83.3333°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
జిల్లా | విజయనగరం |
మండలం | గజపతినగరం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
జనాభా (2011) | |
- మొత్తం | 5,687 |
- పురుషుల సంఖ్య | 2,847 |
- స్త్రీల సంఖ్య | 2,840 |
- గృహాల సంఖ్య | 1,439 |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
గజపతినగరం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాకు చెందిన జనగణన పట్టణం.[1]ఇది గజపతినగరం మండలానికి కేంద్రం.
విజయనగరం జిల్లాలోని 9 శాసనసభ స్థానాలలో గజపతినగరం శాసనసభ నియోజకవర్గం ఒకటి. 2007-08 పునర్వ్యవస్థీకరణ తరువాత గజపతినగరం, బొండపల్లి, గంట్యాడ, జామి, దత్తిరాజేరు మండలాలు ఇందులో చేర్చబడ్డాయి.
గజపతినగరం విజయనగరం జిల్లాలోని గజపతినగరం మండలంలో ఉన్న ఒక జనాభా లెక్కల పట్టణం. 2011 జనాభా లెక్కల ప్రకారం గజపతినగరం పట్టణంలో మొత్తం 1,439 కుటుంబాలు నివసిస్తున్నాయి. గజపతినగరం మొత్తం జనాభా 5,687 అందులో పురుషులు 2,847 మందికాగా, స్త్రీలు 2,840 మంది ఉన్నారు.[2] పట్టణ సగటు లింగ నిష్పత్తి 998. గజపతినగరం పట్టణ పరిధిలో 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లల జనాభా 515, ఇది మొత్తం జనాభాలో 9%గా ఉంది. 0-6 సంవత్సరాల మధ్య 279 మంది మగ పిల్లలు, 236 మంది ఆడ పిల్లలు ఉన్నారు. గజపతినగరంలో బాలల లింగ నిష్పత్తి 846, ఇది సగటు లింగ నిష్పత్తి (998) కంటే తక్కువ. అక్షరాస్యత రేటు 73.4%.దీనిని విజయనగరం జిల్లా 58.9% అక్షరాస్యతతో పోలిస్తే గజపతినగరం అధిక అక్షరాస్యతను కలిగి ఉంది. గజపతినగరంలో పురుషుల అక్షరాస్యత రేటు 80.96%, స్త్రీల అక్షరాస్యత రేటు 65.9%.