గీతా చంద్రన్ | |
---|---|
జననం | ఢిల్లీ, భారతదేశం |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | భరతనాట్య కళాకారిణి |
జీవిత భాగస్వామి | రాజీవ్ చంద్రన్ |
పిల్లలు | శరణ్య |
పురస్కారాలు | పద్మశ్రీ పురస్కారం |
గీతా చంద్రన్ భరత నాట్య కళాకారిణి, గాత్ర విద్వాంసురాలు.
ఈమె తన 5వ యేటి నుండి స్వర్ణ సరస్వతి వద్ద భరతనాట్యాన్ని అభ్యసించింది. 1991లో ఢిల్లీలో "నాట్యవృక్ష" అనే నాట్యశిక్షణా సంస్థను స్థాపించి అనేక మందికి భరతనాట్యాన్ని నేర్పించింది. ఈమె శిష్యులలో స్నేహ చక్రధర్, శరణ్య చంద్రన్ (కుమార్తె), సౌదామిని కుమార్, దివ్య సలూజ, నందిత భన్, గాయత్రి సురేష్, గుంజన్ భన్, మానసి త్రెహన్, పుష్పా సాహ, మల్లికా ఆయేషా భార్గవ మొదలైన వారున్నారు.
కళలలో ఈమె చేసిన కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం ఈమెను 2007లో నాలుగవ అత్యున్నత పౌరపురస్కారం పద్మశ్రీతో సత్కరించింది. [1]
2016లో ఈమెకు సంగీత నాటక అకాడమీ అవార్డు లభించింది.[2]