గులాబ్రాయ్ రాంచంద్ (జూలై 26, 1927 - సెప్టెంబర్ 9, 2003) (Gulabrai Ramchand) భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. భారత జట్టు తరఫున 33 టెస్ట్ మ్యాచ్లలో ప్రాతినిధ్యం వహించాడు. ఆస్ట్రేలియా పై ఆడిన భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించి ఆ సిరీస్ను గెలిపించాడు. అదే కెప్టెన్గా అతని ఏకైక సిరీస్ కావడం గమనార్హం.[1]
1927, జూలై 26 న కరాచిలో జన్మించాడు.
33 టెస్టులు ఆడిన రాంచంద్ 24.58 సగటుతో 1180 పరుగులు సాధించాడు. అందులో 2 సెంచరీలు, 5 అర్థసెంచరీలు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్లో అతని అత్యధిక స్కోరు 109 పరుగులు. టెస్టులలో 41 వికెట్లు కూడా సాధించాడు. అత్యుత్తమ బౌలింగ్ విశ్లేషణ 49 పరుగులకు 6 వికెట్లు.
గులాబ్రాయ్ 145 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడి 36.30 సగటుతో 6026 పరుగులు సాధించాడు. అందులో 16 సెంచరీలు, 28 అర్థసెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 230 (నాటౌట్) . బౌలింగ్లో 255 వికెట్లు సాధించాడు.
2003, సెప్టెంబర్ 9 న ముంబాయిలో రాంచంద్ మరణించాడు.