గోండ్వానా గణతంత్ర పార్టీ | |
---|---|
స్థాపకులు | హీరా సింగ్ మార్కం |
స్థాపన తేదీ | 13 జనవరి 1991 |
ప్రధాన కార్యాలయం | గ్రామం తివార్తా, టెహ్. కట్ఘోరా, కోర్బా జిల్లా, ఛత్తీస్గఢ్ |
రాజకీయ విధానం | గోండు ప్రజలు |
రంగు(లు) | వైలెట్ |
ఈసిఐ హోదా | రిజిస్టర్ చేయబడిన గుర్తింపు లేని పార్టీ[1] |
కూటమి | బిఎస్పీ+(2023-2024) |
శాసనసభలో స్థానాలు | 1 / 90 |
Election symbol | |
గోండ్వానా గంతంత్ర పార్టీ అనేది ఛత్తీస్గఢ్ లోని రాజకీయ పార్టీ. దీనిని హీరా సింగ్ మార్కం స్థాపించాడు.[2][3] ఇది ప్రధానంగా గిరిజన సంఘం, దాని రాజకీయాల కోసం పనిచేస్తుంది.[4][5][6]
గోండ్వానా గణతంత్ర పార్టీ 1991 లో గోండి ప్రజల హక్కుల కోసం వాదించడానికి, మధ్య భారతదేశంలో గోండ్వానా ప్రత్యేక రాష్ట్రాన్ని స్థాపించడానికి ఏర్పాటు చేయబడింది. హీరా సింగ్ మర్కం మరణం[7] తరువాత, తులేశ్వర్ సింగ్ మార్కం పార్టీ కొత్త అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించాడు.[8]
ఉత్తరప్రదేశ్లోని 2002 విధానసభ ఎన్నికలలో, గోండ్వానా గణతంత్ర పార్టీకి ఎనిమిది మంది అభ్యర్థులు ఉన్నారు, వారు కలిసి 11 262 ఓట్లను సాధించారు.
మధ్యప్రదేశ్లో 2003 విధానసభ ఎన్నికలలో,[9] గోండ్వానా గణతంత్ర పార్టీ 61 మంది అభ్యర్థులను ప్రారంభించింది, వీరంతా కలిసి 512 102 ఓట్లను సాధించారు. ముగ్గురు ఎన్నికయ్యారు.
ఛత్తీస్గఢ్లో 2003 విధానసభ ఎన్నికలలో, గోండ్వానా గణతంత్ర పార్టీకి 41 మంది అభ్యర్థులు ఉన్నారు, కానీ ఎవరూ ఎన్నిక కాలేదు. మొత్తంగా ఆ పార్టీకి 156,916 ఓట్లు వచ్చాయి.
2004 లోక్సభ ఎన్నికలలో, పార్టీ మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నుండి అభ్యర్థులను సమర్పించింది.[10][11][12]
గోండ్వానా గణతంత్ర పార్టీ 2018 మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల కోసం సమాజ్వాదీ పార్టీతో ఎన్నికలకు ముందు పొత్తు పెట్టుకుంది. [13] అయితే ఇప్పుడు గోండ్వానా గణతంత్ర పార్టీ బహుజన సమాజ్ పార్టీతో ముందస్తు ఎన్నికల పొత్తు పెట్టుకుంది.
పార్టీ 2023 ఛత్తీస్గఢ్ శాసనసభ ఎన్నికల కోసం బహుజన్ సమాజ్ పార్టీతో ముందస్తు ఎన్నికల కూటమిని ఏర్పాటు చేసి 1 సీటును గెలుచుకుంది.