గోవర్థన్ రెడ్డి | |
---|---|
జననం | మే 5 |
వృత్తి | సినిమా దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2004-ప్రస్తుతం |
గోవర్ధన్ రెడ్డి (గోవి) తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగు సినిమా దర్శకుడు.[1][2] 2014లో వచ్చిన లవ్ యు బంగారమ్, 2016లో వచ్చిన తెలుగు తమిళ చిత్రం నాయకి లకు దర్శకత్వం వహించాడు.[3]
గోవర్ధన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం, సిద్ధిపేట జిల్లా, మిట్టపల్లి గ్రామంలో మే 5న జన్మించాడు. న్యాయవిద్యను పూర్తిచేసాడు.
న్యాయవాదిగా ప్రాక్టీసు ప్రారంభించిన తరువాత, సినిమారంగంపై ఆసక్తితో 2004లో పట్టణ ఆధారిత గృహ కార్మికుల నేపథ్యంలో దృష్టి అనే షార్ట్ ఫిల్మ్‌కి దర్శకత్వం వహించాడు. దానికోసం 500 మందిని ఇంటర్వ్యూ చేశాడు. దీనిని వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రారంభించాడు. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ప్రదర్శించబడింది. తరువాత నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ మూవ్‌మెంట్ 3000 గృహ కార్మికుల సమావేశంలో ప్రదర్శించబడి, ఆ సంస్థ ఈ సినిమా హక్కులను కొనుగోలు చేసింది. తరువాత గోవర్థన్ రెడ్డి సామాజిక సమస్యల ఆధారంగా మరికొన్ని షార్ట్ ఫిల్మ్‌లు చేశాడు.
క్రియేటివ్ కమర్షియల్స్, మారుతి టాకీస్ బ్యానర్‌లో గోవర్థన్ రెడ్డి తన మొదటి సినిమా లవ్ యు బంగారమ్ కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో రాహుల్ హరిదాస్, శ్రావ్య ప్రధాన పాత్రలు పోషించారు. రెండవ సినిమా హర్రర్ కామెడీ ద్విభాషా చిత్రం నాయకి.[4] ఈ సినిమాలో అగ్ర కథానాయిక త్రిష నటించింది. ఇది 2016 జూలైలో తెలుగు, తమిళంలలో విడుదలైంది.[5]
సంవత్సరం | సినిమా | భాష | ఇతర వివరాలు |
---|---|---|---|
2004 | దృష్టి | షార్ట్ ఫిల్మ్ | |
2014 | లవ్ యు బంగారమ్ | తెలుగు | |
2016 | నాయకి | తెలుగు | |
2016 | నాయగి | తమిళం |
{{cite web}}
: |first3=
has numeric name (help)CS1 maint: extra punctuation (link) CS1 maint: numeric names: authors list (link)